Karthik Deepam: కోర్టు బోనులో సౌందర్య.. మోనిత చెరలో దీప.. కార్తీక్ భవిష్యత్ ఏమిటి? కార్తీకదీపంలో ఆసక్తికర మలుపు

తెలుగు బుల్లితెర మెగా సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. కొత్త మలుపులతో.. ఉత్కంఠభరితంగా ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుంటూ సాగుతున్న కార్తీక దీపం సీరియల్ ఈరోజు 1141 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది.

Karthik Deepam: కోర్టు బోనులో సౌందర్య.. మోనిత చెరలో దీప.. కార్తీక్ భవిష్యత్ ఏమిటి? కార్తీకదీపంలో ఆసక్తికర మలుపు
Karthika Deepam 1141 Episode

KarthikA Deepam Episode 1141: ఏసీపీ రోషిణి కార్తీక్ ను కోర్టులో హాజరు పరిచింది. అక్కడ వాదోపవాదాలు మొదలు అయ్యాయి. ఇక కార్తీక్ ను ఆసుపత్రి బయట బెదిరిస్తూ ఫోన్ చేస్తున్న మొనితను చూసిన దీప ఆమెను పాట్టుకోవడానికి బయలు దేరింది. ఆమె కారును ఫాలో అవుతున్న క్రమంలో పెట్రోల్ అయిపోవడంతో మధ్యలోనే ఆగిపోవాల్సి వస్తుంది. ఇక మోనిత.. తనను దీప వెంబడించడం లేదని నిర్ధారించుకుని క్యాబ్ దిగి కాలినడకన వెనుకకు వస్తుంటుంది. ఈలోపు కారు దగ్గర వారణాసి పెట్రోల్ తీసుకువస్తాడని ఎదురు చూస్తున్న దీప మోనిత కంట పడుతుంది. దీంతో మొనితలోని రాక్షసత్వం బయటకు వస్తుంది. దీపను చంపేస్తే.. తనకు ఇక అడ్డు ఉండదు అని అనుకుంటుంది. బ్యాగ్ లో ఉన్న పిస్టల్ తీసుకుని దీప దగ్గరకు వస్తుంది. ఇదీ నిన్నటి ఎపిసోడ్(1140) లో జరిగిన కథ. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరుగుతుందో తెలుసుకుందాం.

కార్తీక్ కోర్టు బోనులో ఉంటాడు. విచారణ ప్రారంభం అవుతుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్తీక్ పై నేరాభియోగాలు చేస్తాడు. డాక్టర్ ముసుగులో ఉండి.. పెళ్ళయిన తరువాత కూడా తన తోటి డాక్టర్ మోనిత తో సహజీవనం చేస్తున్నాడని ఆరోపిస్తాడు పీపీ. అంతే కాకుండా.. మోనితను గర్భవతిని చేసి.. ఆమె తనకు న్యాయం చేయాలని ఒత్తిడి చేయడంతో రివాల్వర్ తో కాల్చి చంపి శవాన్ని మాయం చేశాడని.. ఇటువంటి మంచితనం ముసుగులో నేరాలకు పాల్పడిన ముద్దాయిని కఠినంగా శిక్షించాలని కోరతాడు పీపీ. తరువాత, కార్తీక్ తరఫు లాయర్ రంగంలోకి దిగుతాడు. ఏసీపీ రోషిణిని ప్రశ్నిస్తాడు.

కార్తీక్ ను ఎక్కడ ఎప్పుడు అరెస్ట్ చేశారని ప్రశ్నిస్తాడు. 25వ తేదీ.. అతని ఇంట్లో అని చెబుతుంది రోషిణి. హత్య ఎప్పుడు జరిగింది అని అడుగుతాడు లాయర్. 24వ తేదీ అంటుంది రోషిణి. అంటే ఒకరోజు పట్టింది అని అంటాడు లాయర్. తనకు కంప్లైంట్ 25వతేదీన వచ్చింది అని చెబుతుంది రోషిణి. కంప్లైంట్ ఎవరు చేశారు అని అడుగుతాడు లాయర్.. మోనిత ఇంటిలో పనిమనిషి ప్రియమణి అని చెబుతుంది రోషిణి. ఆమె కార్తీక్ హత్య చేయడం చూసిందా అని అడుగుతాడు. దానికి లేదు అని సమాధానం ఇస్తుంది. మరి కార్తీక్ హత్య చేశాడు అని ఎలా అనుకున్నారు? అని ప్రశ్నిస్తాడు లాయర్. కార్తీక్ అత్త భాగ్యం కూడా సాక్ష్యం చెప్పింది అని రోషిణి చెబుతుంది. అయితే, ఆమె ఆ హత్య చూసిందా అనే ప్రశ్నకు కూడా లేదు అనే జవాబిస్తుంది. అసలు ఆమె అక్కడ కార్తీక్ మోనితను హత్య చేస్తుంటే భాగ్యం సినిమా చూస్తుందా? అని అడుగుతాడు లాయర్. లేదు ఆమె పక్క గదిలో ఉంది. మోనిత ఆమెను అక్కడ కట్టిపడేసింది అని చెబుతుంది రోషిణి. దీంతో లాయర్ ఈ ఒక్క విషయం చాలు యువరానర్.. మోనిత నేర ప్రవృత్తిని చెప్పడానికి అని చెబుతాడు. రోషిణిని వెళ్ళిపొమ్మని చెప్పిన లాయర్ రివాల్వర్ సౌందర్యది కాబట్టి.. ఆమెను విచారించాలని కోరతాడు. దీంతో సౌందర్య బోనులోకి వస్తుంది.

మీ లైసెన్స్ రివాల్వర్ లో రెండు బుల్లెట్స్ మాయం అయ్యాయా అని అడుగుతాడు. దానికి ఔను అని చెబుతుంది. అవి ఎక్కడ ఉన్నాయో తెలుసునా అని ప్రశ్నిస్తాడు లాయర్. పోలీసులు చెప్పినదాని ప్రకారం ఒకటి మోనిత ఇంటిలో దొరికింది. రెండోది మోనిత శరీరంలో ఉంది. అని సమాధానం ఇస్తుంది సౌందర్య. మోనిత మీకు తెలుసా అని అడుగుతాడు లాయర్. తెలుసు.. మా అబ్బాయి ఆమె కలిసి మెడిసిన్ చదివారు అంటుంది సౌందర్య. మోనిత తో మీ అబ్బాయి క్లోస్ గా ఉంటె మీరు అభ్యంతరం చెప్పలేదా? అని అడుగుతాడు లాయర్. ఒక ఆడా, మగా స్నేహంగా ఉండటాన్ని తప్పుగా నేను భావించను అని ఆమె సమాధానం చెబుతుంది.

ఇంతలో జడ్జి.. మీ అబ్బాయి నేరం చేశాడని మీరు భావిస్తున్నారా? అని అడుగుతాడు. దానికి సౌందర్య.. పోలీసుల కథనం అలానే ఉంది యువరానర్. కానీ, మా అబ్బాయి వ్యక్తిత్వం అటువంటిది కాదు. ఏ తల్లైనా తన కొడుకు నేరం చేయలేదని చెబుతుంది. కానీ, నేను ఒకవేళ నా కొడుకు నేరం చేస్తే శిక్షించామనే అడుగుతాను. ఎందుకంటే నేరం ఎవరు చేసినా శిక్ష అనుభవించాలి. ఆ శిక్షాకాలంలో పరివర్తన చెందాలి అని ఆమె చెబుతుంది. ఇక సాక్ష్యాలు నా కొడుకు నేరం చేశాడని చెబుతున్నాయి. నేను నా కొడుకు నీతిని నిరూపించడానికి సాక్ష్యాలు తేలేను.. కానీ, అతని నిజాయతీని నిరూపించడానికి కావలసినంత మందిని తీసుకు వచ్చి చెప్పించాగలను . జరిగిన సంఘటనలో తన ప్రమేయం లేకపోయినా కార్తీక్ నిశ్శబ్దంగా ఉన్నాడు అని చెబుతుంది.

ఇక అక్కడ మోనిత దీపను చూసిన మోనిత గన్ తీసుకుని ఎదురుగా నిలబడుతుంది. అప్పటికే వారణాసి వచ్చి పెట్రోల్ పొయ్యడంతో.. దీపకు గన్ గురిపెట్టి.. ‘కదలకు.. కారెక్కు..’ అంటుంది. దీప కారు ఎక్కుతుంది. పక్కనే మోనిత గన్ చూపిస్తూ కూర్చుంటుంది. వారణాసి కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ‘ఇంకా ఏం చెయ్యాలనుకుంటున్నావ్?’ అని దీప కోపంగా మోనితని ప్రశ్నించడంతో.. ‘నీ మొగుడిని పెళ్లి చేసుకోవాలనే అనుకుంటున్నాను.. నువ్వు చస్తే నాకు ఏ అడ్డు ఉండదు.. నువ్వు కాసేపట్లో చచ్చిపో బంగారం.. మీ ఆయన్ని నాకు ఇచ్చిపో..’ అంటూ ఉంటుంది. తరువాత ఆమెను కారులో ఎక్కడికో తీసుకువెళ్ళిపోతుంది.

ఇదీ ఈరోజు ఎపిసోడ్ (1141) లో జరిగిన కథ. మరి మోనిత బారి నుంచి దీప తప్పించుకోగలిగిందా? కార్తీక్ జైలు నుంచి బయట పడ్డాడా? వంటి విషయాలు తెలియాలంటే రేపటి ఎపిసోడ్ (1142) వరకూ ఆగాల్సిందే.

మరిన్ని ‘కార్తీకదీపం’ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Karthik Deepam: వామ్మో మోనిత.. ఇంత క్రూరంగానా.. కార్తీకదీపంలో కొత్త ట్విస్ట్!

Karthika Deepam: మోనితను గుర్తుపట్టిన కార్తీక్..ఎలాగైనా కార్తీక్‌ను విడిపించాలనే ప్రయత్నంలో దీప!

Karthika Deepam: కార్తీకదీపంలో కొత్తమలుపు.. మరో పథకం వేసిన మోనిత.. దీపను నిలదీసిన పిల్లలు.. 

Karthika Depam: సూపర్ ట్విస్ట్.. మోనిత బ్రతికే ఉందని తెలుసుకున్న దీప.. నమ్మని కుటుంబం!

Karthika Deepam: మోనిత రాక్షసత్వం..దీపను తుపాకీతో కాల్చిన మోనిత.. గుడిలో కుప్పకూలిన వంటలక్క!

 

Click on your DTH Provider to Add TV9 Telugu