Jabardasth Tanmayi: జబర్దస్త్ తన్మయి తండ్రి కన్నుమూత.. పాడే మోసి అంత్యక్రియలు నిర్వహించిన నటి.. వీడియో వైరల్

చిన్నప్పటి నుంచి చేయి పట్టి నడిపించిన తన తండ్రి కన్నుమూయడంతో కన్నీరు మున్నీరవుతోంది. తన తండ్రి చనిపోయాడంటూ తన్మయి షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇందులో తండ్రి పాడే మోస్తు కన్నీరుమున్నీరైంది తన్మయి. అలాగే ఉబికి వస్తోన్న దుఃఖాన్ని ఆపుకొంటూ తండ్రికి అంత్యక్రియలు నిర్వహించింది

Jabardasth Tanmayi: జబర్దస్త్ తన్మయి తండ్రి కన్నుమూత.. పాడే మోసి అంత్యక్రియలు నిర్వహించిన నటి.. వీడియో వైరల్
Jabardasth Tanmayi
Follow us
Basha Shek

|

Updated on: Aug 26, 2024 | 3:33 PM

జబర్దస్త్ కామెడీ షోలో తర లేడీ గెటప్పులతో అందరినీ కడపుబ్బా నవ్వించిన తన్మయి ఇప్పుడు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చిన్నప్పటి నుంచి చేయి పట్టి నడిపించిన తన తండ్రి కన్నుమూయడంతో కన్నీరు మున్నీరవుతోంది. తన తండ్రి చనిపోయాడంటూ తన్మయి షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇందులో తండ్రి పాడే మోస్తు కన్నీరుమున్నీరైంది తన్మయి. అలాగే ఉబికి వస్తోన్న దుఃఖాన్ని ఆపుకొంటూ తండ్రికి అంత్యక్రియలు నిర్వహించింది. ‘ మా నాన్నే నా హీరో.. నాన్న ఓ ఎమోషన్.. మిస్ యూ నాన్నా.. నా మనసులో ఎప్పటికీ నువ్వు ఉంటావ్.. కొడుకునైనా, కూతురినైనా నేను మీ బిడ్డనే’ అంటూ తన్మయి షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. రిప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన్మయి తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నారు. అలాగే జబర్దస్త్ నటికి ధైర్యం చెబుతున్నారు.

కాగా అబ్బాయిగా పుట్టినా హార్మోన్ల అసమతుల్యత కారణంగా అమ్మాయిగా మారిపోయింది తన్మయి. లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు ఓ టీవీ షోలో బహిరంగంగా చెప్పుకొచ్చింది. ఇక జబర్దస్త్ షోతో తన్మయికి మంచి గుర్తింపు వచ్చింది. ఇందులో తను వేసే లేడీ గెటప్పులు ఆడియెన్స్ ను బాగా అలరించాయి. దీంతో పాటు అప్పుడప్పుడూ శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ లోనూ సందడి చేస్తోంది. ఇక టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది తన్మయి. రీల్స్, వీడియోలు చేస్తూ తన ఫాలోవర్స్ ను ఆకట్టుకుంది. ఆమెకు ఇన్ స్టా గ్రామ్ లో మంచి ఫాలోయింగ కూడా ఉంది. ఎక్కువ శాతం జబర్దస్త్ నటీనటులతో రీల్స్ చేస్తూ నవ్విస్తుంటుంది తన్మయి. ఎప్పుడ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే ఈ కమెడియన్ ఇప్పుడు పుట్టెడు దుఃఖంలో ఉండడం చూసి అభిమానులు, నెటిజన్లు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

తండ్రి అంత్యక్రియల్లో జబర్దస్త్ తన్మయి.. వీడియో ఇదిగో..

తండ్రి శవం వద్ద కన్నీరు మున్నీరవుతోన్న జబర్దస్త్ కమెడియన్..

హైపర్ ఆదితో జబర్దస్త్ తన్మయి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.