AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth: ‘అమ్మానాన్నలు కాబోతున్నాం’.. శుభవార్త చెప్పేసిన జబర్దస్త్ కమెడియన్.. ఫొటోస్ వైరల్

స్టాండప్ కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టాడు. పటాస్ టీవీషోలో కామెడీ స్కిట్లతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. ఆ తర్వాత టాప్ కామెడీ షో జబర్దస్త్ లోకి అడుగు పెట్టి స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. ప్రస్తుతం బుల్లితెరతో పాటు వెండితెరపైనా కనిపిస్తూ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచుతోన్న ఈ కమెడియన్ తాజాగా ఒక గుడ్ న్యూస్ చెప్పాడు.

Jabardasth: 'అమ్మానాన్నలు కాబోతున్నాం'.. శుభవార్త చెప్పేసిన జబర్దస్త్ కమెడియన్.. ఫొటోస్ వైరల్
Jabardasth Comedian
Basha Shek
|

Updated on: Jul 21, 2024 | 11:01 AM

Share

స్టాండప్ కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టాడు. పటాస్ టీవీషోలో కామెడీ స్కిట్లతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. ఆ తర్వాత టాప్ కామెడీ షో జబర్దస్త్ లోకి అడుగు పెట్టి స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. ప్రస్తుతం బుల్లితెరతో పాటు వెండితెరపైనా కనిపిస్తూ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచుతోన్న ఈ కమెడియన్ తాజాగా ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలోనే తాను తండ్రిని కాబోతున్నానన్న వార్తను అందరితో పంచుకున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో అతను షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో యాదమ్మ రాజు కూడా ఒకడు. ‘పటాస్’ కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న యాదమ్మ రాజు.. సద్దాంతో కలిసి కామెడీ స్కిట్స్, ప్రోగ్రామ్స్ చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు. ప్రస్తుతం ‘జబర్దస్త్’లో స్టార్ కమెడియన్‌గా ఉన్నాడు. ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీ షోలతో బిజీగా ఉంటోన్న యాదమ్మ రాజు ఏడాదిన్నర క్రితం యూట్యూబర్ స్టెల్లా రాజ్‌ని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడీ జంట మరొకరిని తమ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు. స్టెల్లా గర్బంతో ఉంది. ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకున్నారీ క్యూట్ కపుల్.

స్టెల్లాతో కలిసి దిగిన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన యాదమ్మ రాజు.. ఎనిమిదేళ్ల అపురూపమైన ప్రేమ, ఏడాదిన్నర వైవాహిక బంధం, ఊహించని సవాళ్లు, నవ్వులు, కన్నీళ్లు.. ఇలా జీవితంలోని ప్రతిక్షణం మమ్మల్ని మరింత దగ్గర చేశాయి. ఇప్పుడు మా బంధం మరింత బలపడింది. మా కుటుంబంలోకి మరొకరు వస్తున్నారని చెప్పడానికి మాకెంతో సంతోషంగా ఉది. జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. మాపై మీరు చూపిస్తున్న దీవెనలు, మద్దతు, ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’ అని తన ఆనందానికి అక్షర రూప మిచ్చారు యాదమ్మ రాజు దంపతులు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు యాదమ్మ రాజు, స్టెల్లా దంపతులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

యాదమ్మ రాజు, స్టెల్లా దంపతుల పోస్ట్ ఇదిగో..

యాదమ్మ రాజు, స్టెల్లాల పెళ్లి నాటి ఫొటో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్