AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inaya Sultana: నిండు ప్రాణాన్ని కాపాడిన ఇనయా సుల్తానా బాయ్ ఫ్రెండ్.. అసలేమైందంటే? వీడియో వైరల్

ప్రస్తుతం గౌతమ్ తో కలిసి జోరుగా షికార్లు చేస్తోంది ఇనయా సుల్తానా. అలాగే వీటికి సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తోంది. తాజాగా ఇనయా బాయ్ ఫ్రెండ్ గౌతమ్ తన మంచి మనసును చాటుకున్నాడు. సకాలంలో స్పందించి.. ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Inaya Sultana: నిండు ప్రాణాన్ని కాపాడిన ఇనయా సుల్తానా బాయ్ ఫ్రెండ్.. అసలేమైందంటే? వీడియో వైరల్
Inaya Sultana
Basha Shek
|

Updated on: Jul 21, 2024 | 7:59 AM

Share

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఇనయా సుల్తానా ఒకరు. బిగ్‏బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి ఆమె తన ఆట తీరుతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇక ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నెట్టింట ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఫోటోషూట్స్, రీల్స్ అంటూ తెగ హడావిడి చేస్తుంది. ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం తన ప్రియుడిని కూడా పరిచయం చేసింది ఇనయా సుల్తానా. అతడి పేరు గౌతమ్ కొప్పిశెట్టి. అతను యోగా ట్రైనర్ అండ్ జిమ్ కోచ్ అని తెలుస్తోంది. ప్రస్తుతం గౌతమ్ తో కలిసి జోరుగా షికార్లు చేస్తోంది ఇనయా సుల్తానా. అలాగే వీటికి సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తోంది. తాజాగా ఇనయా బాయ్ ఫ్రెండ్ గౌతమ్ తన మంచి మనసును చాటుకున్నాడు. సకాలంలో స్పందించి.. ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ప్రాణాలుతో కొట్టుమిట్టాడుతూ రోడ్డు మీదే పడిపోయాడు. అదే సమయంలో ఆ వైపుగా వెళుతున్న ఇనయా బాయ్ ఫ్రెండ్ గౌతమ్ దీనిని చూశాడు. వెంటనే స్పందించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడాడు.

ఈ ఇన్సిడెంట్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘నువ్వు ఒక ప్రాణాన్ని కాపాడావు’ అంటూ దీనికి క్యాప్షన్ పెట్టింది. ‘రోడ్డు మీద వెళ్తుంగా ఓ యాక్సిడెంట్ చూశాను. ఓ వ్యక్తి రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. చాలా రక్తం పోతూ కనిపించింది. వెంటనే నేను మా మదర్ చున్నీ తీసుకుని రక్తం రాకుండా ఆకట్టుకున్నాను. అక్కడే ఉన్న ఇనయా అంబులెన్స్ కు ఫోన్ చేసింది. ట్రాఫిక్ క్లియర్ చేసింది. అతడిని మాట్లాడిస్తూ స్పృహలో ఉండేలా చూశాం. వాళ్ల ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాం. ఆ తర్వాత బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించాం. ఇప్పటికీ అతని గురించి ఆరా తీస్తూనే ఉన్నాం. పరిస్థితి కాస్త సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది. వర్షాలు పడుతున్నప్పుడు కాస్త జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. వేగంగా వెళ్లడం మానేయండి ప్లీజ్.. వీలైనంత వరకు నిదానంగా వెళ్లండి. ఒక్కోసారి మన తప్పు లేకపోయినా ప్రమాదాలు జరుగుతుంటాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ప్రాణాలతో తిరిగి రావాలని, వేగంగా కోలుకోవాలని ప్రార్థించండి’ అని వీడియోలో చెప్పుకొచ్చారు ఇనయా, గౌతమ్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఇనయా బాయ్ ఫ్రెండ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
2026లో తొలి సూర్య గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం, తేదీ సమయం ఇదే!
2026లో తొలి సూర్య గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం, తేదీ సమయం ఇదే!
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఊరట.. ప్రభుత్వం కొత్త నిర్ణయం
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఊరట.. ప్రభుత్వం కొత్త నిర్ణయం