Bigg Boss 9 Telugu: ఎప్పుడు మారతారో వాళ్లు.. బిగ్‌బాస్ పై సీరియల్ నటి సంచలన కామెంట్స్..
బిగ్‌బాస్ రియాల్టీ షో.. విమర్శలు వచ్చినా.. కాంట్రవర్సీ అయినా.. ఈ షో చూసే వాళ్ల సంఖ్య మాత్రం మారడం లేదు. తెలుగు, తమిళం, హిందీ, తమిళం, కన్నడ భాషలలో ఈ షో విజయవంతంగా రన్ అవుతుంది. అయితే తెలుగులో మాత్రం అత్యంత దారుణంగా సాగుతుంది. కంటెస్టెంట్స్ ఆట తీరు, మాట తీరు జనాలకు తెగ విసుగుపుట్టిస్తున్నాయి. అలాగే ఎలిమినేషన్ సమయంలో జనాల ఓటింగ్ కాకుండా బిగ్‌బాస్ కు నచ్చినట్లుగా ఎలిమినేట్ చేస్తున్నాడంటూ ప్రేక్షకులు మండిపడుతున్నారు.

బిగ్‌బాస్ సీజన్ 9.. ఏడో వారం నడుస్తుంది. నిజానికి ఈ షో అంటేనే కాంట్రవర్సీ. ఇప్పటికే గత సీజన్స్ పై పెదవి విరిచిన అడియన్స్.. ఇప్పుడు సీజన్ 9 మొదలైన యాబై రోజుల్లోనే చిరాకు పడుతున్నారు. ముఖ్యంగా ఈసారి వైల్డ్ కార్డ్స్ ఎంట్రీల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఆటలో కాకుండా పర్సనల్ అటాక్ చేస్తూ తమ నోటికి పని చెబుతున్నారు. ఇష్టానుసారంగా మాట్లాడుతూ నానా రచ్చ చేస్తున్నారు. ఆట తక్కువ గొడవలు ఎక్కువ అన్నట్లుగా సాగుతుంది ఈ షో. మరోవైపు బిగ్‌బాస్ షోపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే పేరుకే తెలుగు షో అయినప్పటికీ అందులో పాల్గొంటుంది మాత్రం మొత్తం ఇతర భాష నటీనటులే. ఇప్పటికే అన్ని సీజన్స్ లోనూ ఇతర భాష నటీనటులు పార్టిసిపేట్ చేయగా.. ఇప్పుడు కూడా తెలుగు రాని వాళ్లనే తీసుకొచ్చారు. మాట్లాడితే తెలుగుని ఖూనీ చేయడమే తప్ప .. మరొకటి లేదు.
ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..
ప్రస్తుతం సీజన్ 9లో ఉన్న కంటెస్టెంట్లలో సంజనా, గౌరవ్, శ్రష్టి వర్మ, నిఖిల్, ఫ్లోరా షైనీ, తనూజ వీళ్లందరూ తెలుగువాళ్లు కాదు. కేవలం తెలుగులో మాత్రమే నటించారు. తెలుగు రియాల్టీ షోలో తెలుగు వాళ్ల కంటే ఇతర భాష కంటెస్టెంట్స్ ఎక్కువగా ఉండడంపై ఇప్పటికే విమర్శలు వచ్చాయి. అవకాశాల్లేకుండా ఉన్న తెలుగు నటీనటుల కంటే పక్క రాష్ట్రాల నటీనటులకు ఛాన్సులు ఇవ్వడం ఏంటనీ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నటి నర్మదా అలియాస్ అన్షురెడ్డి సైతం బిగ్‌బాస్ రియాల్టీ షోపై సంచలన కామెంట్స్ చేసింది.
ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..
తెలుగు రియాల్టీ షో.. కానీ అందులోకి తెలుగు సరిగా మాట్లాడటం రాని చాలా మంది నాన్ తెలుగు నటీనటులను ఎందుకు తీసుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. తెలుగు మాట్లాడటం, అర్థం చేసుకోవడం అనేది తెలుగు బిగ్‌బాస్ షోలో ప్రాథమిక ప్రమాణం. బిగ్‌బాస్ లోకి వెళ్లాలని చాలా మంది తెలుగు నటీనటులు ఉన్నారు. కానీ వారికి ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇతర భాషలలో సైతం బిగ్‌బాస్ షో ఉంది.. అక్కడ తెలుగు వాళ్లకు ఎంత మందికి అవకాశం ఇస్తున్నారు ? సీరియల్స్, సినిమాల విషయంలో కూడా ఇదే పరిస్థితి. తెలుగు రాకపోయినా తెలుగు బిగ్‌బాస్ రియాల్టీ షోలో మైక్ ఉంటుంది. స్క్రిప్ట్ ఉండదు..వీళ్లు ఎప్పుడు మారతారో అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది అన్షు రెడ్డి.
ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‌తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?
ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?




