Deepthi Sunaina: శ్రీరెడ్డి వ్యాఖ్యలపై తొలిసారి స్పందించిన దీప్తి సునైనా.. తనుష్‌తో రిలేషన్‌పై క్లారిటీ..
Deepthi Sunaina: బిగ్‌బాస్ 5వ సీజన్ ప్రేక్షకులకు ఏ స్థాయిలో వినోదాన్ని అందించిందో గానీ.. దీప్తి సునైనా, షణ్ముఖ్‌ల మధ్య ప్రేమ బంధాన్ని దూరం చేసిందని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. హౌజ్‌లో సిరి, షణ్ముఖ్‌లు క్లోజ్‌గా ఉండడంతోనే..
Deepthi Sunaina: బిగ్‌బాస్ 5వ సీజన్ ప్రేక్షకులకు ఏ స్థాయిలో వినోదాన్ని అందించిందో గానీ.. దీప్తి సునైనా, షణ్ముఖ్‌ల మధ్య ప్రేమ బంధాన్ని దూరం చేసిందని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. హౌజ్‌లో సిరి, షణ్ముఖ్‌లు క్లోజ్‌గా ఉండడంతోనే దీప్తి తమ బంధానికి గుడ్‌బై చెప్పిందని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. షణ్ముఖ్‌తో తాను విడిపోతున్నట్లు ప్రకటించగానే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఈ క్రమంలోనే వీరిద్దరి బ్రేకప్‌లో ప్రముఖ నటి శ్రీరెడ్డి స్పందించిన విషయం తెలిసిందే.
సిరి, షణ్ముఖ్‌ల గురించి మాట్లాడిన దీప్తి.. బిగ్‌బాస్ సీజన్2లో పాల్గొన్న సమయంలో దీప్తి చేసింది ఏంటి.? అంటూ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే ఈ వ్యాఖ్యలపై అప్పట్లో స్పందించని దీప్తి.. తాజాగా మాత్రం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి వ్యాఖ్యలకు ఇన్‌డైరెక్ట్‌గా స్పందించిన దీప్తి.. “నేను బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లినప్పుడు నాకు 20 ఏళ్లు. అప్పుడు నేను చిన్నదాన్ని.
నాకు అప్పుడు ఎలాంటి క్లారిటీ లేదు. కానీ షో ద్వారా చాలా నేర్చుకున్నాను” అంటూ చెప్పుకొచ్చింది దీప్తి. ఇదిలా ఉంటే షణ్ముఖ్ తండ్రి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. షణ్ముఖ్, దీప్తిలు మళ్లీ ఒకటవుతారని.. దీప్తి మాత్రమే బ్రేకప్ చెప్పిందని, షణ్ముఖ్ చెప్పలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Also Read:
Viral Video: పాముతోనే పరాచకాలా.. తిక్క కుదిర్చిందిగా.. వీడియో
Nara Lokesh: స్కూల్స్ ప్రారంభించడం పెను ప్రమాదం.. సెలవులు పొడిగించండి.. సీఎంకు నారా లోకేశ్ లేఖ
AP Government: ఏపీలో పాఠశాలలకు సెలవులు పొడిగింపు.? నేడే కీలక ప్రకటన.!