Brahmamudi, November 19th Episode: కావ్య డిజైన్స్ కొట్టేసిన రాజ్.. కళావతి ఓడిపోనుందా..

కావ్య వేసిన డిజైన్స్‌ని రాజ్ దొంగిలిస్తాడు. ఆ డిజైన్స్‌ని తాను వేసినట్టు ప్రెజెంటేషన్‌ను సిద్ధం చేస్తాడు. ఎలాగైనా ఆఫీసుకు కావ్య రాకుండా చేస్తానని రాజ్ అనుకుంటాడు. మరోవైపు ధాన్య లక్ష్మి వేసిన ప్లాన్ బెడిసికొడుతుంది..

Brahmamudi, November 19th Episode: కావ్య డిజైన్స్ కొట్టేసిన రాజ్.. కళావతి ఓడిపోనుందా..
BrahmamudiImage Credit source: Disney Hotstar
Follow us
Chinni Enni

|

Updated on: Nov 19, 2024 | 12:28 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్య తాను గీసిన డిజైన్స్ ఆఫీసులోనే వదిలి వెళ్తుంది. అప్పటికే కావ్య గీసిన డిజైన్స్ కొట్టేద్దామని ఫిక్స్ అయిన రాజ్.. పక్కన దాక్కుంటాడు. ఇక కావ్య వెళ్లిపోయిన తర్వాత డిజైన్స్ తీసుకొద్దామని రాజ్ వెళ్తాడు. మనం కావ్యని ఏమీ మోసం చేయడం లేదు కదా. పెళ్లి చేసుకుని మహారాణిలా చూసుకున్నా.. ఆ లెక్క చూస్తే కావ్యే నాకు రుణం ఉంది. కాబట్టి ఆ డిజైన్స్ తస్కరించడంలో తప్పు లేదని డిజైన్స్ చూస్తాడు రాజ్. అబ్బా డిజైన్స్ చాలా బాగా వేశాడని అనుకుంటాడు. ఈలోపు కావ్య తన హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయానని వెనక్కి వస్తుంది. అక్కడ బ్యాగ్ తీసుకునేలోపు రాజ్ తన డిజైన్స్ ఫొటో తీసుకుంటాడు. కావ్య రావడం చూసి దాక్కుంటాడు. ఆఫీస్ లోపలికి వచ్చిన కావ్య.. ఇక్కడికి ఎవరో వచ్చారు.. ఈ డిజైన్స్ ఇందాక నా వైపుకు ఉన్నాయి. ఇప్పుడు ఇటు వైపు ఉన్నాయని కావ్య అంటే.. అవును మేడమ్ కొంపదీసి రాజ్ సార్ వచ్చారా? అని శ్రుతి అంటే.. ఆయన ఎందుకు వస్తారులే అని కావ్య అంటుంది. ఏమో మేడమ్ ఆయన స్ట్రేటజీలు వేరుగా ఉంటాయి. మీరు డిజైన్స్ ఎలా వేశారో చూసి ఉండొచ్చు కదా.. మిమ్మల్ని ఓడించాలని శ్రుతి అంటుంది. ఈలోపు రాజ్ టెన్షన్ పడుతూ ఉంటారు.

కావ్య డిజైన్స్ కొట్టేసిన రాజ్..

ఆయన మోసం చేసేంత చెడ్డవారు కాదు.. ఆయనకంటూ ఓ క్యారెక్టర్ ఉంది.. ఇలాంటి పనులు అస్సలు చేయరని కావ్య అంటుంది. ఆ తర్వాత కావ్య, శ్రుతిలు వెళ్లిపోతారు. ఇక రాజ్.. నువ్వు చెప్పింది నిజమే. నేను ఇప్పటివరకు ఎవర్నీ మోసం చేయలేదు. కానీ నేను గెలవడానికి ఈ మాత్రం కష్టపడొచ్చని అంటాడు. ఆ తర్వాత దుగ్గిరాల ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటారు. అక్కడికి ధాన్యలక్ష్మి.. తాను వండుకున్నది తెచ్చుకుని తింటుంది. ధాన్యలక్ష్మి వంటను చూసని అదేంటి శాంతమ్మా చికెన్ చేస్తే నాకు వేయలేదు ఏంటి? అని స్వప్న అడుగుతుంది. అది నేను చేయలేదని శాంతా చెబుతుంది. ఎవరు చేస్తే ఏంటి వండింది వేయాలి కదా అని స్వప్న అంటుంది. ధాన్యలక్ష్మి తన కోసం మాత్రమే వండుకుందని ఇందిరా దేవి అంటుంది. ఆవిడ గారు అనుకున్నది జరగలేదని వంటింట్లో వేరు కుంపటి పెట్టింది. ఇంట్లోనే తాను పోరాటం మొదలు పెట్టిందని అంటుంది.

ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతున్న రుద్రాణి..

ధాన్యలక్ష్మి మీకు అంత బాధగా అయిపోయిందా? తను ఎందుకు ఇలా చేస్తుందో తెలిసి కూడా ఇలా మాట్లాడటం పెద్దరికం అనిపించుకోదని రుద్రాణి అంటుంది. నా కొడుక్కి అన్యాయం జరిగితేనే మావయ్య గారు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు నాకు అవమానం జరిగితే పట్టించుకుంటారా? అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. నువ్వు అడిగింది బ్రెడ్ ముక్క అనుకున్నావా.. ఆస్తి గురించి అని చెప్తాడు ప్రకాశం. చూడు ధాన్యలక్ష్మి అడ్డమైన సలహాలు విని చెడిపోతున్నావు. అంతే కానీ కుటుంబం ముక్కలు కావాలని చూడకు అని ఇందిరా దేవి అంటుంది. నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. నాకు న్యాయం కావాలని ధాన్యలక్ష్మి అంటుంది. సుప్రీం కోర్టులోనే న్యాయం జరగాలంటే సమయం పడుతుంది. మరి నువ్వు అడిగిన దానికి సమయం పట్టదా అని ప్రకాశం అంటే.. మీకు కావాల్సినంత సమయం తీసుకోండి. అప్పటివరకు నేను ఇలాగే చేస్తానని ధాన్యలక్ష్మి అంటుంది. అప్పుడే రుద్రాణి పుల్ల పెడితే.. ప్రకాశం తనకు ఏమైనా సమాన్లు కావాలేమో తీసుకోమని అంటాడు. దీంతో అందరూ నవ్వుతారు. ఇక కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మి.

ఇవి కూడా చదవండి

కనకం కంగారు..

మరోవైపు కావ్య డిజైన్స్ కొట్టేసిన రాజ్.. ప్రెజెంటేషన్‌కు రెడీ అవుతాడు. అప్పుడే సీతారామయ్య వస్తాడు. అది చూసిన రాజ్ వెంటనే ల్యాప్ టాప్ మూసేస్తాడు. అదేంట్రా అలా మూసేస్తున్నావ్.. అని అడుగుతాడు పెద్దాయన. రేపటి ప్రెజెంటేషన్‌కు అన్నీ సిద్ధం చేస్తున్నానని చెబుతాడు. రేపు అందరికీ కలిపి చూపిస్తానని అంటాడు. అయితే ఇద్దరిలో పోటీలో ఎవరు అనుకున్నా.. నేను కోరుకున్నది జరగదని సీతారామయ్య వెళ్తాడు. ఆ తర్వాత రాజ్.. క్యావ్య వెళ్లే ఆటో అతనికి ఫోన్ చేసి.. రేపు కావ్యని ఆఫీసుకు లేటుగా తీసుకురమ్మని చెప్తాడు. ఎందుకు అని ఆటో డ్రైవర్ అడిగితే.. రాజ్ బెదిరిస్తాడు. దీంతో సరే అని అంటాడు. ఇక తెల్లవారుతుంది. కావ్య గెలిచేందుకు కనకం పూజ చేస్తుంది. ఈ పోటీలో నువ్వు ఖచ్చితంగా గెలుస్తావ్ కదా.. అని అడుగుతుంది. అదేంటి అమ్మా అలా అడుగుతున్నావ్? అని కావ్య అడిగితే.. అంటే అటు పక్కన ఉంది అల్లుడు గారు కదా అని కనకం చెబుతుంది. నా ప్రయత్నం నేను చేశాను అమ్మా.. ఆ దేవుడే చూసుకోవాలి అని కావ్య అంటుంది.

స్టైల్‌గా రెడీ అయిన రాజ్..

ఇక కావ్య ఆటో దగ్గరకు వెళ్తే.. రాజ్ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుని కావ్యని ఆపేందుకు డ్రైవర్ ఏదేదో మాట్లాడతాడు. దీంతో కావ్య సీరియస్‌గా తిడుతుంది. ఇక ఆటో డ్రైవర్ బయటకు తీసుకెళ్తాడు. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అపర్ణ టెన్సన్ పడుతూ ఉంటారు. ఎందుకు టెన్షన్ పడుతున్నావ్ అని ఇందిరా దేవి అడిగితే.. రుద్రాణి మధ్యలో పుల్ల పెడుతుంది. దీంతో అపర్ణ సీరియస్ అవుతుంది. ఈ పందెంలో ఎవరు గెలుస్తారని గాబరాగా ఉందని అపర్ణ అంటుంది. ఇక రాజ్ స్టైల్‌గా రెడీ అయి ఆఫీసుకు వెళ్తాడు.. ఇక ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..