Brahmamudi, May 4th episode: రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ.. దెబ్బకు దెబ్బ కొట్టిన స్వప్న..

ఈ రోజు బ్రహ్మముడి సీరియల్‌లో.. రుద్రాణి, రాహుల్‌లతో కలిసి స్వప్న డ్యాన్స్ చేస్తుంది. రుద్రాణి, రాహుల్‌లు కలిసి డ్యాన్స్ చేస్తుంటే.. స్వప్న వాళ్లకు తెలియకుండా.. మందులో మత్తు మందు కలిపేస్తుంది. అది రుద్రాణి, రాహుల్‌ల చేత తాగిస్తుంది. ఆ నెక్ట్స్ రుద్రాణి చేత నిజం చెప్పిస్తుంది స్వప్న. చీమకు కూడా తెలియకుండా నీ ఆస్తి పేపర్స్ కొట్టేశాం. వాటిని తాకట్టు పెట్టి కోటి రూపాయలు తీసుకుని నీ మీద నెట్టేశామని..

Brahmamudi, May 4th episode: రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ.. దెబ్బకు దెబ్బ కొట్టిన స్వప్న..
Brahmamudi
Follow us

|

Updated on: May 04, 2024 | 12:15 PM

ఈ రోజు బ్రహ్మముడి సీరియల్‌లో.. రుద్రాణి, రాహుల్‌లతో కలిసి స్వప్న డ్యాన్స్ చేస్తుంది. రుద్రాణి, రాహుల్‌లు కలిసి డ్యాన్స్ చేస్తుంటే.. స్వప్న వాళ్లకు తెలియకుండా.. మందులో మత్తు మందు కలిపేస్తుంది. అది రుద్రాణి, రాహుల్‌ల చేత తాగిస్తుంది. ఆ నెక్ట్స్ రుద్రాణి చేత నిజం చెప్పిస్తుంది స్వప్న. చీమకు కూడా తెలియకుండా నీ ఆస్తి పేపర్స్ కొట్టేశాం. వాటిని తాకట్టు పెట్టి కోటి రూపాయలు తీసుకుని నీ మీద నెట్టేశామని రాహుల్, రుద్రాణిలు అంటారు. ఆ తర్వాత ఆ డబ్బు ఎక్కడ పెట్టారు అనేది చెప్పిస్తుంది స్వప్న. తెలివిగా రుద్రాణి దగ్గర నుంచి తాళం కొట్టేసి.. డబ్బు కూడా తీసుకుంటుంది. మీ వేలితో మీ కన్నే పోడిచాను. ఇపుడు మీకు కోటి రూపాయల అప్పును కానుకగా ఇస్తున్నాను. మీరూ ఆ అప్పు ఇచ్చిన వాడు తన్నుకుని చావండి అని డబ్బులు పట్టికెళ్తుంది స్పప్న.

అవాక్కైన రుద్రాణి.. స్వప్న ప్లాన్ అదుర్స్..

ఆ తర్వాత ఉదయం తెల్లవారుతుంది. బయటకు వెళ్లేందుకు కావ్య రెడీ అవుతుంది. అప్పుడే అప్పూ.. కాల్ చేసి బయలు దేరావా.. నీ ఫోన్‌కి లొకేషన్ పంపించాను త్వరగా వచ్చేయ్ అని చెబుతుంది. సరే అని కావ్య బయలు దేరుతుంది. అందరూ హాలులో కూర్చొంటారు. అప్పుడే వడ్డీ వ్యాపారి సేటు వచ్చి సీతారామయ్య కాళ్ల మీద పడతాడు. అది చూసి రాహుల్, రుద్రాణిలు షాక్ అవుతారు. రాహుల్ పక్కకు లాగకపోతే.. హేయ్ పాపాత్ముడా.. ముందు వెళ్లా ఆ పుణ్యాత్మురాలిని పిలువు అని అంటాడు. ఎవరు అని రుద్రాణి అడుగుతుంది. ఏ భక్తురాలిని మాతాజీ కన్న బిడ్డలా చూస్తుందో.. ఆ భక్తురాలు స్వప్నను పిలవండి అని సేటు అంటాడు. ఇంతలో స్వప్న వస్తుంది. నేను అందరిలా పూజలు చేయను. కానీ ఎప్పుడూ అమ్మవారి నామాన్నే జపిస్తూ ఉంటాను అని చెప్తుంది. జై మాతాజీ.. నిజం చెప్పావ్ తల్లీ.. ఇలాంటి భక్తుల్ని సినిమాల్లోనే చూశాను. కానీ ఇప్పుడు నిజంగా చూస్తున్నా అమ్మా.. అని సేటు అంటాడు. హేయ్ ఆపండి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అప్పుడు అప్పు ఇచ్చాను అన్నావ్.. ఇప్పుడు భక్తురాలు అంటున్నావ్ ఏంటి ఈ నాటకాలు అని సుభాష్, అపర్ణలు అంటారు.

అప్పు పేరు ఎత్తితే.. పాత చెప్పుతో కొట్టండి..

అప్పా.. అప్పు పేరు ఎత్తితే.. పాత చెప్పుతో కొట్టండి. తప్పు ఒప్పుకుని మీ ఆస్తి కాగితాలు మీకు ఇచ్చి పోదామని వచ్చాను అని సేటు అనగానే.. రాహుల్, రుద్రాణిలు షాక్ అవుతారు. ఆవిడ ఈ పేపర్స్ తీసుకుంటే.. నోరు మూసుకుని పోతాను. ఇదిగోమ్మా ఆస్తి పేపర్స్.. నువ్వు నాకు నయాపైసా ఇవ్వాల్సిన పని లేదు. తీసుకోమ్మా అని సేటు అంటే.. నాకేం అవసరం లేదు. నిన్న నువ్వే వచ్చావ్ ఆస్తి పత్రాలు నీ దగ్గర తాకట్టు పెట్టాను అన్నావ్. కోటి రూపాయలు తీసుకున్నా అన్నావ్. ఇప్పుడు నీ పేపర్స్ తీసుకొచ్చి ఇస్తే.. నా మీద పడ్డ నింద ఎలా పోతుంది. అసలు నా ఇంట్లో ఉండాల్సిన ఆస్తి పత్రాలు నీ దగ్గరకు ఎలా వచ్చాయి? అని స్వప్న అంటే.. సేటు రుద్రాణి వాళ్ల వైపు చూస్తాడు. రాహుల్ వద్దని సైగ చేస్తాడు. కొంత మంది దొంగ వెధవలు ఇలాగే ఆస్తి పత్రాలు దొంగిలించి తీసుకొచ్చ.. తాకట్టు పెడతారు. సంతకాలు కూడా ఫోర్జరీ చేస్తారు. నేను ఆస్తి కొట్టేయడానికి ఇలాంటి దరిద్రపు పనులు చేస్తాను. ఇదిగో నీ ఆస్తి పత్రాలు అని ఇచ్చేస్తాడు.

ఇవి కూడా చదవండి

పోలీసులకు సేటు.. రాహుల్‌కి కౌంట్ డౌన్..

అప్పుడే ఇలాంటి వాళ్లను ఊరికే వదిలేయ కూడదు. వీడిని పట్టుకుని నాలుగు తంటే.. వాడెవడో బయటకు వస్తాడు. ముందు పోలీసులకు ఫోన్ చేయండి అని ప్రకాశం అంటాడు. దీని మీరెందుకు చిన్నమావయ్య నేను చూసుకుంటాను. రేయ్ రారా అని బయటకు తీసుకెళ్తాడు రాహుల్. ఎందుకు రా నా ప్లాన్ అంతా రివర్స్ చేశావ్? అని రాహుల్ అంటే.. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో అలాంటి గొప్ప భార్య దొరికింది. అయినా నువ్వెలా చస్తే నాకేంటి? నా దగ్గర తీసుకున్న కోటి రూపాయలు తిరిగి ఇచ్చేయ్. రెండే రెండు రోజులు టైమ్ ఇస్తున్నా.. లేదంటే నిజం చెప్పేస్తా అని సేటు వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు.

తల్లి బిడ్డ పేరు మాయ అని తెలుసుకున్న కావ్య..

ఈ సీన్ కట్ చేస్తే.. కావ్య, అప్పూలు కలిసి రాజ్‌ని డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి దగ్గరకు వస్తారు. అప్పూ అయితే ఇద్దరి క్యారెక్టర్ ఆర్టిస్టులకు పోలీస్ గెటప్ వేసి తీసుకొస్తుంది. అది చూసి కావ్య కంగారు పడుతుంది. దీంతో అప్పూ సర్ది చెప్తుంది. ఆ తర్వాత అందరూ కలిసి లోపలికి వెళ్తారు. ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి నిలదీస్తారు. రాజ్ సర్ దగ్గర నువ్వు ఎందుకు పది లక్షలు తీసుకున్నావ్ అని కావ్య అడుగుతుంది. అది నేను చెప్పలేను మేడమ్.. నిజం చెప్తే రాజ్ సర్ చంపేస్తారు మేడమ్ అని ఆ వ్యక్తి అంటాడు. ఇక కావ్య, అప్పూలు మరోసారి బెదిరిస్తారు. ఫిబ్రవరి 18వ తేదీన రాజ్ సర్ వచ్చారు. మాయ అనే ఒకావిడ తన బాబును రోజూ తన బాబును కేర్ సెంటర్‌లో పెట్టడానికి వచ్చింది. కానీ ఆరోజు బాగా ఆలస్యంగా వచ్చింది. అప్పుడే రాజ్ సర్, మాయ మేడమ్ మాట్లాడుకుంటున్నారు. వాళ్లను చూడగానే అనుమానం వచ్చి వాళ్ల మాటలు విన్నాను అని ఆ వ్యక్తి చెప్తాడు. ఇక ఇవాళ్టితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.

Latest Articles
Horoscope Today: డబ్బు వ్యవహారాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
Horoscope Today: డబ్బు వ్యవహారాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్