వేడి చేస్తుందని మామిడి పండ్లను దూరం పెడుతున్నారా?

06 April 2026

TV9 Telugu

TV9 Telugu

వేసవి కాలంలో విరివిగా వచ్చే మామిడి పండ్లంటే ఎవరికి ఇష్టం ఉండదు. మామిడి పండ్లు రుచికే కాదు, ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. అయితే కొంతమంది మాత్రం ఈ పండు తింటే వేడి చేస్తుందని అనుకుంటారు

TV9 Telugu

ఇందులో అధిక చక్కెరలు, కొవ్వు పదార్థాలు ఉంటాయని.. వీటిని పూర్తిగా దూరం పెడతారు. మరికొంతమంది తినాలనిపించినా ఆ కోరికను అదుపు చేసుకుంటూ చాలా మితంగా తింటుంటారు

TV9 Telugu

మామిడి పండ్లు వేడి చేస్తాయని, వాటిని తినడం వల్ల శరీరంలో వేడి పెరిగి ఫలితంగా మొటిమలొస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ ఇది నిజం కాదంటున్నారు నిపుణులు. ఇంకా చెప్పాలంటే వీటిలో పుష్కలంగా ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు.. వంటివన్నీ చర్మ ఆరోగ్యానికి మరింతగా దోహదం చేస్తాయంటున్నారు

TV9 Telugu

అయితే ఇప్పటికే మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలతో బాధపడే వారు వీటిని మరీ ఎక్కువగా తీసుకోకుండా మితంగా తినడం ఉత్తమం అని చెబుతున్నారు

TV9 Telugu

ముఖ్యంగా పోస్ట్‌మెనోపాజ్‌ దశలో ఉన్న మహిళల్లో ఇది గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా చేపట్టిన ఓ అధ్యయనం ఈ అంశాలను వెల్లడించింది

TV9 Telugu

50-70 ఏళ్ల మధ్య వయసు మహిళలు ఒక కప్పున్నర మామిడి పండ్ల ముక్కలను రోజులో రెండు విడతలుగా తీసుకున్నప్పుడు వాళ్లలో బీపీ, కొలెస్ట్రాల్‌ స్థాయులు తగ్గాయట

TV9 Telugu

ఈ అధ్యయనంలో భాగంగా అధిక బరువున్న 24 మంది మహిళలకు రెండు వారాలపాటు మామిడి పండ్లను అందించారు. వాటిని తిన్న రెండు గంటల తర్వాత ఆ మహిళల్లో సిస్టోలిక్‌ బీపీ ఆరు పాయింట్లు తగ్గడం గమనించారు

TV9 Telugu

రెండు వారాలకు వీళ్లలో చెడు కొలెస్ట్రాల్‌ 13 పాయింట్లు తగ్గడం విశేషం. కాబట్టి లేనిపోని అపోహలతో వేసవి సీజన్‌లో వచ్చే మామిడి పండ్లు తినడం అస్సలు మానకండి. ఏడాదంతా బలంగా ఉండటానికి వీటిని తప్పక తినండి