AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sridevi: అందుకే శ్రీదేవి నాకు నచ్చేది కాదు.! అంతా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది.. సీనియర్ నటి

టాలీవుడ్ నటి తల్లూరి రామేశ్వరి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవి నటన "ప్రోగ్రామ్డ్"గా అనిపించిందని, వాణిశ్రీ సహజత్వాన్ని మెచ్చుకున్నారు. అలాగే, పేదరికంతో కూడిన సన్నివేశాలలో శ్రీదేవి పాత్రల వస్త్రధారణ వాస్తవికంగా ఉండదని పేర్కొన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Sridevi: అందుకే శ్రీదేవి నాకు నచ్చేది కాదు.! అంతా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది.. సీనియర్ నటి
Sridevi
Ravi Kiran
|

Updated on: Apr 06, 2026 | 8:33 PM

Share

టాలీవుడ్ నటి తల్లూరి రామేశ్వరి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖ వ్యక్తుల గురించి, తన వ్యక్తిగత అనుబంధాల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కుటుంబంతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. బోనీ కపూర్ తండ్రి సురేంద్ర కపూర్ తనను సొంత కుమార్తెలా చూసుకునేవారని, అలాగే బోనీ మొదటి భార్య మోనా కపూర్‌తో కూడా తనకు మంచి పరిచయం ఉండేదని ఆమె తెలిపారు.

ఇది చదవండి: నేను, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్స్.. ‘వాడు’ అనేంత చనువు ఉంది.. టాలీవుడ్ నటుడు

శ్రీదేవి మరణం తర్వాత బోనీ కపూర్‌పై వచ్చిన ఆరోపణల గురించి స్పందిస్తూ.. అవి చాలా అన్యాయమని ఆమె అభిప్రాయపడ్డారు. అత్యంత ప్రేమించిన వ్యక్తిని కోల్పోయిన సమయంలో ఇలాంటి నిరాధారమైన మాటలు అనడం సరికాదని, తాను ఎప్పుడూ మనుషుల్లోని మంచిని మాత్రమే చూడటానికి ఇష్టపడతానని స్పష్టం చేశారు. ఇక నటన విషయానికి వస్తే, శ్రీదేవి, వాణిశ్రీల శైలిపై రామేశ్వరి తనదైన విశ్లేషణ ఇచ్చారు. శ్రీదేవి అద్భుతమైన నటి, డ్యాన్సర్ అయినప్పటికీ, ఆమె నటన కొంత “ప్రోగ్రామ్డ్”గా అనిపించేదని రామేశ్వరి పేర్కొన్నారు. అంటే, ఏ హావభావం ఎప్పుడు ఎలా పలకాలి అనేది ముందుగానే నిర్ణయించుకున్నట్లుగా ఉండటం వల్ల, వ్యక్తిగతంగా తాను శ్రీదేవి నటనతో పూర్తిగా కనెక్ట్ కాలేకపోయానని వివరించారు.

దీనికి పూర్తి భిన్నంగా వాణిశ్రీ నటనను ఆమె ప్రశంసించారు. వాణిశ్రీ నటన ఎంతో సహజంగా, ఎఫర్ట్లెస్‌గా ఉండేదని కొనియాడారు. సాధారణమైన జడ, చిన్న చెవిపువ్వులు, పెద్ద ముక్కు వంటి సాదాసీదా లక్షణాలతో కూడా ఆమె ఎంతో అందంగా కనిపించేవారని, ఆ రకమైన సరళతను శ్రీదేవి తన పాత్రల్లో ప్రదర్శించలేకపోయారని రామేశ్వరి అభిప్రాయపడ్డారు.

ఇది చదవండి: అన్నగారు చనిపోయిన చివరి రోజు జరిగిందిదే.. షాకింగ్ నిజం చెప్పిన సీనియర్ ఎన్టీఆర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్

Follow Us
ఈ టాలీవుడ్ హీరోయిన్ అనిల్ రావిపూడికి కోడలు అవుతుందని తెలుసా?
ఈ టాలీవుడ్ హీరోయిన్ అనిల్ రావిపూడికి కోడలు అవుతుందని తెలుసా?
4000 కోట్ల రూపాయల అద్భుతం: 'రామాయణ' గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ
4000 కోట్ల రూపాయల అద్భుతం: 'రామాయణ' గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ
వంటింట్లో సమస్యకు చెక్! ఉల్లిపాయలు కోసేటప్పుడు ఇక కన్నీళ్లు రావు
వంటింట్లో సమస్యకు చెక్! ఉల్లిపాయలు కోసేటప్పుడు ఇక కన్నీళ్లు రావు
రామాయణ Vs ఆదిపురుష్... తప్పు దిద్దుకుంటారా ??
రామాయణ Vs ఆదిపురుష్... తప్పు దిద్దుకుంటారా ??
అందుకే శ్రీదేవి నాకు నచ్చేది కాదు.! అంతా ఆర్టిఫిషియల్..
అందుకే శ్రీదేవి నాకు నచ్చేది కాదు.! అంతా ఆర్టిఫిషియల్..
హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు.. వాహనదారులకు పోలీసుల బంపర్ ఆఫర్..
హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు.. వాహనదారులకు పోలీసుల బంపర్ ఆఫర్..
మామిడి పండ్లు ఇలా తింటే ఆస్పత్రికి పరుగెత్తాల్సిందే
మామిడి పండ్లు ఇలా తింటే ఆస్పత్రికి పరుగెత్తాల్సిందే
93 కోట్ల వ్యూస్‌..ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలుగు పాట
93 కోట్ల వ్యూస్‌..ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలుగు పాట
మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి..
మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి..
కుజుడి ప్రభావంతో కుభేరులయ్యే రాశులివే.. మీ రాశి ఉందో చూడండి!
కుజుడి ప్రభావంతో కుభేరులయ్యే రాశులివే.. మీ రాశి ఉందో చూడండి!