AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ridhima Pandit: ఆ నిర్మాత చాలా వేధించాడు.. అమ్మకు ఆరోగ్యం బాలేక ఆసుపత్రికి వెళ్తే.. బుల్లితెర నటి కామెంట్స్..

ఇటీవల హిందీ సీరియల్ నటి కృష్ణ ముఖర్జీ క్యాస్టింగ్ కౌచ్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. సెట్ లో ఓ నిర్మాత తనను వేధిస్తున్నారని ఆరోపించింది. ఇక ఇప్పుడు ఆమెకు మద్దతుగా మరో నటి రిద్ధిమ పండిట్ ఇండస్ట్రీలోని విషయాలను బయటపెట్టారు. అలాగే గతంలో తనకు ఎదురైన పరిస్థితులను చెప్పుకొచ్చారు. గతంలో ఓ నిర్మాత కూడా తనను చాలా వేధించాడని అన్నారు. మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడ్డాడని అన్నారు.

Ridhima Pandit: ఆ నిర్మాత చాలా వేధించాడు.. అమ్మకు ఆరోగ్యం బాలేక ఆసుపత్రికి వెళ్తే.. బుల్లితెర నటి కామెంట్స్..
Ridhima Pandit
Rajitha Chanti
|

Updated on: May 05, 2024 | 7:09 AM

Share

సినీ పరిశ్రమలో ఎప్పుడూ ఏదోక చోటు క్యాస్టింగ్ కౌచ్ గురించి వింటుంటాం. సెట్స్ లో తమకు ఎదురైనా చేదు అనుభవాలపై కొందరు నటీనటులు బయటపెడుతున్నారు. ఇప్పుడిప్పుడే బుల్లితెర నటీమణులు క్యాస్టింగ్ కౌచ్ గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. తమకు ఎదురైన సంఘటనలు.. వేధింపుల గురించి మీడియా ముందు వెల్లడిస్తున్నారు. ఇటీవల హిందీ సీరియల్ నటి కృష్ణ ముఖర్జీ క్యాస్టింగ్ కౌచ్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. సెట్ లో ఓ నిర్మాత తనను వేధిస్తున్నారని ఆరోపించింది. ఇక ఇప్పుడు ఆమెకు మద్దతుగా మరో నటి రిద్ధిమ పండిట్ ఇండస్ట్రీలోని విషయాలను బయటపెట్టారు. అలాగే గతంలో తనకు ఎదురైన పరిస్థితులను చెప్పుకొచ్చారు. గతంలో ఓ నిర్మాత కూడా తనను చాలా వేధించాడని అన్నారు. మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడ్డాడని అన్నారు.

“తనకు (కృష్ణ ముఖర్జీ)కి జరిగింది చాలా భయంకరమైనది. ఇది ఎవరికీ జరగకూడదు. కుందన్ సింగ్ లాంటి నిర్మాతలు ఇలాంటి అమాయక నటీనటులను కనుగొని వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. వారిని డిప్రెషన్ కు గురయ్యేలా చేస్తున్నారు. మనలో ఎవరికైనా ఇలా జరగొద్దు.. కాబట్టి అందరం కృష్ణకు తోడుగా నిలబడదాం” అని అన్నారు.

బుల్లితెరపై ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయని.. కానీ చాలా మంది బయటకు మాట్లాడేందుకు భయపడుతున్నారని రిద్ధిమ అన్నారు. గతంలో తనకు ఎదురైన పరిస్థితిపై మాట్లాడుతూ.. తాను పనిచేస్తున్న ఓ షో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా తనను వేధింపులకు గురిచేశాడని తెలిపింది.. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసేందుకు ఆసుపత్రికి వెళ్లేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని తెలిపింది. తన తల్లి ఆరోగ్యం బాగలేక ఆసుపత్రిలో చేర్పించామని.. ఐసీయూలో ఉన్న తన తల్లిని చూసేందుకు విజిటింగ్ అవర్స్ ఉదయం 7-8 వరకు సాయంత్రం 4-5.30 వరకు ఉండేదని.. అమ్మను చూసి ఉదయం 9 గంటలకు షూటింగ్ కు వస్తానన్నా.. ఉదయం 7 గంటలకు వచ్చి సాయంత్రం త్వరగా వెళ్లిపోతానన్నా అనుమతి ఇచ్చేవాడు కాదని.. బయటకు చెప్పాలంటే అప్పట్లో తనపై రూమర్స్ క్రియేట్ చేశారని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.