AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss: నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేశా.. బిగ్‌బాస్ బ్యూటీ ఎమోషనల్

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉదంతాలు తరచూ బయట పడుతున్నాయి. స్టార్ హీరోయిన్ల దగ్గరి నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల దాకా.. చాలా మంది ఆడవాళ్లు ఈ వేధింపుల బారిన పడ్డవారే. ఇదే నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ తెలుగు బ్యూటీ కూడా తన ఆవేదనను పంచుకుంది.

Bigg Boss: నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేశా.. బిగ్‌బాస్ బ్యూటీ ఎమోషనల్
Bigg Boss Telugu Fame Nainika Anasuru
Basha Shek
|

Updated on: Apr 06, 2026 | 7:10 PM

Share

క్యాస్టింగ్ కౌచ్.. సినిమా ఇండస్ట్రీలో తరచూ వినిపించే పదం. స్టార్ హీరోయిన్లు మొదలు కొని చిన్న ఆర్టిస్టుల వరకు ఎంతో మంది ఆడవాళ్లు క్యాస్టింగ్ కౌచ్ బారిన పడుతున్నారు. అయితే వీరిలో చాలా మంది తమకు జరిగిన అన్యాయంపై సైలెంటుగా ఉన్నారు. కొద్ది మంది మాత్రమే ధైర్యంగా తమకు జరిగిన అవమానాలు, చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. తాజాగా ఢీ డ్యాన్సర్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ నైనికా అనసూరు తన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయట పెట్టింది. ప్రస్తుతం టీవీ షోలతో బిజీ బిజీగా ఉంటోన్న ఆమె తాజాగా ఓ టాక్ షోకు హాజరైంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే క్యాస్టింగ్ కౌచ్ కు సంబంధించిన తనకు ఎదురైన చేదు అనుభవాలను బయట పెట్టింది.

‘చాలా మంది అమ్మాయిల్లాగే నేను కూడా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బారినపడ్డాను. ఒకసారి నాకు బాగా పరిచయమైన వ్యక్తి ఫోన్ చేసి, నా ఫొటోలు అసభ్యకరంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని, వాటికి రేట్లు కూడా ఫిక్స్ చేస్తున్నారని చెప్పాడు. అది విన్న వెంటనే నేను షాక్ అయ్యాను. నా ప్రమేయం లేకుండా ఇలాంటి ఘటనలు ఎలా జరుగుతాయో అర్థం కాక షాక్ లో ఉండిపోయాను. నా ఫ్రెండ్ మాటలు విన్నాక నాకు తీవ్రంగా కోపం, అసహ్యం కలిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీ చాలా వల్గర్‌గా మారిపోయింది. నేరుగా కమిట్మెంట్స్‌ని అడుగుతున్నారు. ఒకసారి బ్రాండ్ ప్రమోషన్ పేరుతో ఒక వ్యక్తి నన్ను సంప్రదించాడు. మొదట అతను చెప్పిన ‘పర్సనల్ రిక్వైర్మెంట్’ అంటే ఏమిటో అర్థం కాలేదు. కానీ పదేపదే అదే విషయాన్ని చెప్పడంతో అసలు విషయం అర్థమైంది. నాకు తెలిసి కొంత మంది అమ్మాయిల వల్లే ఇండస్ట్రీలో ఈ పరిస్థితి దాపరించింది. కమిట్మెంట్ కి రెడీ అయితే ఆఫర్స్ వస్తాయనే కొంతమంది అలాగే చేస్తున్నారు. ఒక వేళ నేను నటిని అయితే.. నా కూతురిని మాత్రం ఇండస్ట్రీకి రానివ్వను.

ఇవి కూడా చదవండి

నైనిక లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

కొంత మంది చిన్న పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరినీ టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్లతో వేధిస్తున్నారు. ఇక ఒక సందర్భంలో నా మాట ఎవ్వరూ వినలేదు. నమ్మడం లేదు అనిపించింది. ఆ సమయంలోనే నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను’ అని ఎమోషనల్ అయ్యింది నైనిక. ప్రస్తుతం ఈ డ్యాన్సర్ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us