AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mangoes: మామిడి పండ్లు ఇలా తింటే ఆస్పత్రికి పరుగెత్తాల్సిందే.. కాస్త చూస్కోండి!

వేసవిలో మాత్రమే దొరికే మామిడి పండ్లు ఎంత తినాలి? ఒక రోజులో ఎన్ని మామిడి పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిది? మామిడిని సరైన పద్ధతిలో ఎలా తినాలి అనే సందేహాలు మనలో చాలా మందికి ఉంటాయి. మామిడి పండ్లు రుచిగా ఉండటమే కాకుండా వాటిలో విటమిన్లు ఎ, సి, అనేక ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే మామిడి పండ్లు అందరికీ మేలు..

Mangoes: మామిడి పండ్లు ఇలా తింటే ఆస్పత్రికి పరుగెత్తాల్సిందే.. కాస్త చూస్కోండి!
Mango Consumption Tips
Srilakshmi C
|

Updated on: Apr 06, 2026 | 8:01 PM

Share

వేసవి ప్రారంభమైంది. పండ్ల రారాజు మామిడి. వేసవిలో మాత్రమే దొరికే మామిడి పండ్లు ఎంత తినాలి? ఒక రోజులో ఎన్ని మామిడి పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిది? మామిడిని సరైన పద్ధతిలో ఎలా తినాలి అనే సందేహాలు మనలో చాలా మందికి ఉంటాయి. మామిడి పండ్లు రుచిగా ఉండటమే కాకుండా వాటిలో విటమిన్లు ఎ, సి, అనేక ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే మామిడి పండ్లు అందరికీ మేలు చేయవు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మామిడి పండ్లు తినడం ప్రమాదకరం. మామిడి పండ్లను అధికంగా తినడం వల్ల లేదా తప్పుడు సమయంలో తినడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటే మామిడి పండ్లు కాస్త మితంగా తినాలి. మామిడి పండ్లలో కేలరీలు అధికంగా ఉంటాయి. ఒక మధ్యస్థ పరిమాణపు మామిడి పండు సుమారు 150 నుంచి 200 కేలరీలను అందిస్తుంది. దీనివల్ల బరువు పెరగవచ్చు. మామిడి పండ్లలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మంచిదని భావిస్తారు. అయితే, మామిడి పండ్లను ఎక్కువగా తినడం వల్ల విరేచనాలు లేదా గ్యాస్ రావచ్చు. తరచుగా కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవారు మామిడి పండ్లను పరిమితంగా తినాలి.

మామిడి తొక్క లేదా దానిలోని కొన్ని పదార్థాల వల్ల కొంతమందికి చర్మం దురద, దద్దుర్లు, కళ్ళు ఎర్రబడటం వంటి అలెర్జీ ప్రతిచర్యలు కలుగుతాయి. అలాంటి వారు జాగ్రత్తగా ఉండాలి. మామిడిని అధికంగా తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరగవచ్చు. దీనివల్ల కీళ్లనొప్పులతో బాధపడే రోగులలో నొప్పి పెరగవచ్చు. మామిడి పండ్లను తినడానికి ముందు కనీసం 1-2 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. దీనివల్ల వాటిలోని రసాయనక ప్రతిచర్యలు తగ్గుతాయి. రాత్రి పడుకునే ముందు మామిడి పండ్లు తినడం మానుకోవాలి. ఎందుకంటే దీనివల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మామిడి పండ్లలో తగినంత సహజ చక్కెర ఉంటుంది కాబట్టి వీటిని తినేటప్పుడు వాటికి చక్కెర కలపడం అంత మంచిదికాదు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు రోజుకు ఒక మధ్యస్థ పరిమాణంలో ఉన్న మామిడి పండు తింటే సరిపోతుంది. ఒకవేళ మీరు మామిడి పండ్ల ముక్కలు తింటుంటే రోజుకు ఒక చిన్న గిన్నెడు మామిడి పండ్లు తింటే సరిపోతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
వేడి పెరుగుతోంది.. గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
వేడి పెరుగుతోంది.. గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
పోలీసులకు సవాల్‌గా మారిన 'సైలెంట్' డెత్స్!
పోలీసులకు సవాల్‌గా మారిన 'సైలెంట్' డెత్స్!
వైభవంగా అన్నవరం సత్యదేవుని కళ్యాణం తరలివచ్చిన వేలాది మంది భక్తులు
వైభవంగా అన్నవరం సత్యదేవుని కళ్యాణం తరలివచ్చిన వేలాది మంది భక్తులు
అమ్మ ప్రేమకు భాష లేదు.. కదిలించిన దృశ్యం !!
అమ్మ ప్రేమకు భాష లేదు.. కదిలించిన దృశ్యం !!
ముంచుకొస్తున్న సూపర్ ఎల్ నినో.. మానవాళికి డెత్ వారెంట్.. !
ముంచుకొస్తున్న సూపర్ ఎల్ నినో.. మానవాళికి డెత్ వారెంట్.. !
పార్క్‌లో వాకింగ్‌ చేస్తున్నారా.. పన్ను కట్టాల్సిందేనా?
పార్క్‌లో వాకింగ్‌ చేస్తున్నారా.. పన్ను కట్టాల్సిందేనా?
లక్ష్మీ పార్వతి చిన్న పిల్లలా చూసుకున్నారు: టాలీవుడ్ నటి
లక్ష్మీ పార్వతి చిన్న పిల్లలా చూసుకున్నారు: టాలీవుడ్ నటి
రైల్వే స్టేషన్ల అభివృద్ధికి సహకరించండిః కిషన్ రెడ్డి
రైల్వే స్టేషన్ల అభివృద్ధికి సహకరించండిః కిషన్ రెడ్డి
తెలుగు రాష్ట్రాల్లో పెట్రో కష్టాలు.. రంగంలోకి దిగిన అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో పెట్రో కష్టాలు.. రంగంలోకి దిగిన అధికారులు
గర్భగుడిలో 1000 ఏళ్ల నాటి రహస్యం.. వెలుగులోకి గగుర్పొడిచే నిజం
గర్భగుడిలో 1000 ఏళ్ల నాటి రహస్యం.. వెలుగులోకి గగుర్పొడిచే నిజం