Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shobha Shetty: పెళ్లికి రెడీ అయిన బుల్లితెర నటి.. ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న శోభా శెట్టి..

ఈ సీరియల్ ద్వారా వచ్చిన క్రేజ్ మొత్తాన్ని బిగ్ బాస్ షో ద్వారా పోగొట్టుకుంది. బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గోన్న మోనితాపై తీవ్రస్థాయిలో నెగిటివిటీ ఏర్పడింది. ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత వ్యతిరేకతతో కొన్నాళ్లు సైలెంట్ అయిన శోభా ఆ తర్వాత యాంకర్ గా కొత్త ప్రయాణం స్టార్ట్ చేసింది. అటు యూట్యూబర్ గా మారి తన వ్యక్తిగత జీవితానికి అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది శోభా. ఇక అదే స్టేజ్ పై తన ప్రియుడిని జనాలకు పరిచయం చేసింది.

Shobha Shetty: పెళ్లికి రెడీ అయిన బుల్లితెర నటి.. ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న శోభా శెట్టి..
Shobha Shetty
Follow us
Rajitha Chanti

|

Updated on: May 04, 2024 | 11:13 AM

బుల్లితెరపై దాదాపు ఏడేళ్లు సంచలనం సృష్టించిన సీరియల్ కార్తీక దీపం. ఇందులోని పాత్రలకు జనాలు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత పాత్రలకు వచ్చిన క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఈ సీరియల్లో విలన్ మోనీత పాత్రలో అదరగొట్టేసింది శోభా శెట్టి. దీంతో ఆమెకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ సీరియల్ ద్వారా వచ్చిన క్రేజ్ మొత్తాన్ని బిగ్ బాస్ షో ద్వారా పోగొట్టుకుంది. బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గోన్న మోనితాపై తీవ్రస్థాయిలో నెగిటివిటీ ఏర్పడింది. ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత వ్యతిరేకతతో కొన్నాళ్లు సైలెంట్ అయిన శోభా ఆ తర్వాత యాంకర్ గా కొత్త ప్రయాణం స్టార్ట్ చేసింది. అటు యూట్యూబర్ గా మారి తన వ్యక్తిగత జీవితానికి అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది శోభా. ఇక అదే స్టేజ్ పై తన ప్రియుడిని జనాలకు పరిచయం చేసింది.

బుల్లితెర నటుడు యశ్వంత్ రెడ్డితో ప్రేమలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. వీరిద్దరూ కలిసి కార్తీక దీపం సీరియల్లో నటించారు. ఆ తర్వాత పలు మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు. షార్ట్ ఫిల్మ్స్ చేసిన సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఇక బిగ్ బాస్ తర్వాత తన ప్రియుడితో కలిసి కొత్త ప్రయాణం స్టార్ట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అలాగే సొంతంగా ఇళ్లు తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు పెళ్లికి రెడీ అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. గతంలో తాంబులాలు అంటూ వీడియో షేర్ చేస్తూ త్వరలోనే పెళ్ళి అంటూ హింట్ ఇచ్చేసింది. ఇక తాజాగా వీరి నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది.

నిశ్చితార్థం కోసం ఇలా రెడీ అఏయ్యామంటూ శోభ తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో షేర్ చేసింది. పట్టుచీరలో.. ఒండినిండా ఆభరణాలతో.. చేతులకు మెహందీ వేసుకుని సంప్రదాయంగా రెడీ అయ్యి మరింత అందంగా కనిపిస్తుంది. నిశ్చితార్థ వేడుకలలో శోభా శెట్టి, యశ్వంత్ రెడ్డి చూడముచ్చటగా కనిపిస్తున్నారు. ఈ వేడుకకు వచ్చిన అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. శోభాష యశ్వంత్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

థాయ్‌లాండ్ పర్యటనలో సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు అందించిన ప్రధాని మోదీ..
థాయ్‌లాండ్ పర్యటనలో సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు అందించిన ప్రధాని మోదీ..
గ్రూప్ 1 అభ్యర్ధులకు దెబ్బమీదదెబ్బ.. ఏం జరిగిందంటే?
గ్రూప్ 1 అభ్యర్ధులకు దెబ్బమీదదెబ్బ.. ఏం జరిగిందంటే?
వామ్మో.. మీ గుండె అకస్మాత్తుగా వేగంగా కొట్టుకుంటుందా..?
వామ్మో.. మీ గుండె అకస్మాత్తుగా వేగంగా కొట్టుకుంటుందా..?
రజనీకాంత్ కూలీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎన్టీఆర్‌తో బాక్సాఫీస్ 'వార్'
రజనీకాంత్ కూలీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎన్టీఆర్‌తో బాక్సాఫీస్ 'వార్'
రోహిత్ శర్మకు గాయం: ముంబయి ఇండియన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ!
రోహిత్ శర్మకు గాయం: ముంబయి ఇండియన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ!
చేతిపై కుట్టడానికి దోమ తిప్పలు.. ఫన్నీ వీడియోపై ఓ లుక్ వేయండి
చేతిపై కుట్టడానికి దోమ తిప్పలు.. ఫన్నీ వీడియోపై ఓ లుక్ వేయండి
పాలిటెక్నిక్‌ 2025 ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణతోపాటు మెటీరియల్‌
పాలిటెక్నిక్‌ 2025 ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణతోపాటు మెటీరియల్‌
పిడుగుల బీభత్సం.. నలుగురి మృతి..!
పిడుగుల బీభత్సం.. నలుగురి మృతి..!
Video: సీపీఆర్‌ చేసి కార్యకర్త ప్రాణం కాపాడిన ఎమ్మెల్యే...
Video: సీపీఆర్‌ చేసి కార్యకర్త ప్రాణం కాపాడిన ఎమ్మెల్యే...
రక్తపు మడుగులో భర్త..నవ్వుతూ వీడియో కాల్‌ మాట్లాడుతున్న భార్య
రక్తపు మడుగులో భర్త..నవ్వుతూ వీడియో కాల్‌ మాట్లాడుతున్న భార్య