AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmamudi, May 3rd episode: స్వప్నకు తెలిసిపోయిన నిజం… కాళికా మాతలా కనకం..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళావతి డైపర్స్ కోసం వెళ్లిందా.. ఇంకా నన్ను అయ్యిందేమోనని హడలిపోయి చచ్చా.. అని రాజ్ మనసులో అనుకుంటాడు. కావ్య కనిపెట్టేసి.. అవును అదే నిజం.. నేను డైపర్స్ కోసమే వెళ్లాను. కానీ అదే ప్రశ్న ఎందుకు గుచ్చి గుచ్చి అడిగారు అని అడుగుతుంది. గడ్డి బుద్ధి తిని అని రాజ్ అంటాడు.. అదేంటి ఇటు పదం అటైంది? అవునూ మీరెక్కడికి వెళ్లారు? అని కావాలనే రాజ్‌ని విసుగిస్తుంది కావ్య. ఆ తర్వాత ఫోన్ అడుగుతుంది. కానీ రాజ్ ఇవ్వను అని..

Brahmamudi, May 3rd episode: స్వప్నకు తెలిసిపోయిన నిజం... కాళికా మాతలా కనకం..
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: May 03, 2024 | 11:52 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళావతి డైపర్స్ కోసం వెళ్లిందా.. ఇంకా నన్ను అయ్యిందేమోనని హడలిపోయి చచ్చా.. అని రాజ్ మనసులో అనుకుంటాడు. కావ్య కనిపెట్టేసి.. అవును అదే నిజం.. నేను డైపర్స్ కోసమే వెళ్లాను. కానీ అదే ప్రశ్న ఎందుకు గుచ్చి గుచ్చి అడిగారు అని అడుగుతుంది. గడ్డి బుద్ధి తిని అని రాజ్ అంటాడు.. అదేంటి ఇటు పదం అటైంది? అవునూ మీరెక్కడికి వెళ్లారు? అని కావాలనే రాజ్‌ని విసుగిస్తుంది కావ్య. ఆ తర్వాత ఫోన్ అడుగుతుంది. కానీ రాజ్ ఇవ్వను అని అంటాడు. బాబు తల్లితో కలిపి సెల్ఫీలు ఏమైనా ఉన్నాయన్న భయమా అని కావాలనే ఉడికిస్తుంది కావ్య. ఓహో అదా నీ డౌట్.. అలాంటివి ఏమీ లేవు ఇదిగో తీసుకో అని రాజ్ ఫోన్ ఇస్తాడు.

రాజ్‌తో కావ్య ఆట..

వెంటనే కావ్య ఫోన్ తీసుకుని.. రాజ్ చివరిలో మాట్లాడిన వ్యక్తి నెంబర్ తీసుకుంటుంది. అప్పూకి పంపించి.. ఆ వ్యక్తి డీటైల్స్ కనుక్కొమ్మని చెప్తుంది. వెనకాలే రాజ్ వచ్చి.. ఏంటి నువ్వు చేసిన పని అని అడుగుతాడు. నేనేం చేశాను అని కావ్య ఏమీ తెలీన్టటు అడుగుతుంది. అదే నీ ఫోన్‌లో బ్యాలెన్స్, చార్జింగ్ అయిపోయింది అన్నావ్.. ఎలా మాట్లాడావ్ అని అడుగుతాడు. ఇక కావ్య ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది. ఏదో తేడా కొడుతుందే.. అని రాజ్ ఆలోచిస్తాడు.

కనకాన్ని సహాయం అడిగిన స్వప్న..

ఈ సీన్ కట్ చేస్తే.. స్వప్న ఆస్తి పేపర్స్ కోసం మొత్తం అన్నీ వెతుకుతుంది. కానీ ఎక్కడా దొరకవు. దీంతో చాలా కంగారు పడుతుంది. ఏదో తప్పు జరిగింది. ఈ నిజాన్ని ఎలా బయట పెట్టించాలి అని కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కనకానికి ఫోన్ చేస్తుంది. ఏంటి నాకు ఫోన్ చేశావ్? అని కనకం అంటుంది. ఆ తర్వాత స్వప్న జరిగినదంతా చెప్తుంది స్వప్న. నీ ఆస్తి కొట్టేయాలని చూస్తున్నారా.. నువ్వు ఫోన్ పెట్టేయ్. ఇప్పుడే వస్తున్నా అని కనకం అంటుంది. ఇక స్వప్న ఎవరూ చూడకుండా సేటు ఇంటికి వస్తుంది. ఆ తర్వాత కనకం కూడా వస్తుంది.

ఇవి కూడా చదవండి

కాలికా మాత అవతారంలో కనకం.. సేటు పని అయిపోయింది..

కనకాన్ని చూసి ఒక్కసారిగా హడలి చస్తుంది స్వప్న. ఎందుకంటే కనకం.. కాళికా మాత అవతారంలో ఉంటుంది. వెంటనే వడ్డీ వ్యాపారి దగ్గరకు వెళ్తుంది. కనకాన్ని చూసి ఒక్కసారిగా సేటు ఖంగు తింటాడు. రేయ్.. నీ మాతాజీనేరా.. అంటూ ఆవేశంతో ఊగిపోతుంది. ఎందుకు అమ్మా నా మీద కోపం.. నీ భక్తుడినే కదమ్మా.. పొద్దున్న లేవగానే నిన్నే కొలుస్తాను కదమ్మా.. అని అంటాడు. నా ఆప్త భక్తురాల స్వప్న ఆస్తి పేపర్స్ నీ దగ్గరే ఉన్నాయి అంట కదా. నువ్వు ఎన్ని మోసాలు చేసినా ఊరుకున్నా.. కానీ ఈ సారి ఊరుకునేది లేదు. నిన్ను చీల్చేస్తాను అని అంటుంది. అందులో నాతప్పేం ఉంది అమ్మా.. రాహులే నాకు ఇచ్చాడు అని అచెప్తాడు. ఓహో సరే.. వెంటనే ఆ పేపర్స్ స్వప్నకు ఇచ్చేయ్.. నిన్ను క్షమించమని కలలో కనిపించి చెబుతాను అని కనకం అంటుంది. సరే మాతాజీ అని సేటు అంటాడు. ఇక కనకం మాయం అవుతుంది. ఇక స్వప్న, కనకంల ప్లాన్ సక్సెస్ అవుతుంది.

కావ్యకు సహాయంగా అప్పూ..

ఆ తర్వాత కావ్య అడ్రెస్ గురించి టెన్షన్ప డుతూ ఉంటుంది. అప్పుడే అప్పూ ఫోన్ చేస్తుంది. ఎందుకు ఇంత లేటు చేశావ్? అని కావ్య అడుగుతుంది. అడ్రెస్ తెలిసింది అని అప్పూ చెప్తుంది. ముందు ఎందుకు కనుక్కోమన్నావో చెప్పు అని అప్పూ అడుగుతుంది. తర్వాత చెప్తానులే ముందు అడ్రెస్ చెప్పు అని కావ్య అడుగుతుంది. అడ్రెస్ చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇలాగే చెప్తావ్ కానీ ముందు ఏంటో చెప్పు అని అప్పూ అంటుంది. మీ బావగారు బాబును తీసుకొచ్చారు కదా.. ఈ ప్రయత్నంలో ఒకడు దొరికాడు. అందుకే వాడి అడ్రెస్ కనుక్కోమని చెప్పాను అని కావ్య అంటుంది. సరేలే ఈ విషయంలో సహాయం చేస్తాను. నిజమేంటో తెలుసుకుందాం అని అప్పూ అంటే కావ్య ఒప్పుకోదు. కానీ అప్పూ ఒప్పిస్తుంది.

రుద్రాణి, రాహుల్‌లను ఆటాడుకున్న స్వప్న..

ఈ సీన్ కట్ చేస్తే.. స్వప్న రుద్రాణి గదికి వస్తుంది. నన్నే మోసం చేసి నన్ను బ్యాడ్ చేసి.. కోటి రూపాయలు నొక్కేసి.. పండగ చేసుకుంటున్నారా. ఇప్పుడు ఈ స్వప్న అంటే ఏంటో నేను చూపిస్తా అని స్వప్న అంటుంది. లోపలికి వెళ్లిన స్వప్న.. నేను బాధలో ఉంటే మీరు సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా? అని అడుగుతుంది. ఇక రుద్రాణి కవర్ చేస్తుంది. కావాలనే రాహుల్, రుద్రాణిలను స్వప్న డ్యాన్స్ చేయమని అడుగుతుంది. అలాగే స్వప్న క్యారెక్టర్లు మార్చేస్తుంది. ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తారు. ఇక ఇవాళ్టితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.