AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guppedantha Manasu Rishi: ఆ రూమర్స్ అసలు నమ్మకండి.. గుప్పెడంత మనసు రిషీ ఆవేదన..

తల్లికొడుకు అనుబంధం సెంటిమెంట్ తో మళ్లీ గుప్పెడంత మనసు టీఆర్పీ రేటింగ్ దూసుకుపోతుంది. ఇదంతా పక్కనపెడితే గుప్పెడంత మనసు ఫేమ్ రిషి అలియాస్ ముఖేష్ గౌడ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. సినిమా చిత్రీకరణలో బిజీగా ఉండడంతో గుప్పెడంత మనసు సీరియల్ దూరంగా ఉంటున్నారు. దీంతో రిషి పాత్ర గురించి సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి.

Guppedantha Manasu Rishi: ఆ రూమర్స్ అసలు నమ్మకండి.. గుప్పెడంత మనసు రిషీ ఆవేదన..
Rishi
Rajitha Chanti
|

Updated on: May 02, 2024 | 2:00 PM

Share

ముఖేష్ గౌడ.. ఈ పేరు కంటే రిషి సర్ అంటే ఠక్కున గుర్తుపట్టేస్తారు తెలుగు అడియన్స్. బుల్లితెరపై అతడు ఓ సూపర్ స్టార్. ఇప్పటివరకు అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకున్న సీరియల్ నటుడు. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇందులో రిషి, వసుధార జోడిగా ఎక్కువగా అభిమానులు ఉన్నారు. కానీ చాలా రోజులుగా రిషి సీరియల్లో కనిపించడం లేదు. దీంతో కొన్నాళ్లపాటు గుప్పెడంత మనసు టీఆర్పీ రేటింగ్ దారుణంగా పడిపోయింది. అదే సమయంలో మను, అనుపమ అంటూ కొత్త క్యారెక్టర్లను సృష్టించి కథను మరో ట్రాక్ ఎక్కించారు. తల్లికొడుకు అనుబంధం సెంటిమెంట్ తో మళ్లీ గుప్పెడంత మనసు టీఆర్పీ రేటింగ్ దూసుకుపోతుంది. ఇదంతా పక్కనపెడితే గుప్పెడంత మనసు ఫేమ్ రిషి అలియాస్ ముఖేష్ గౌడ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. సినిమా చిత్రీకరణలో బిజీగా ఉండడంతో గుప్పెడంత మనసు సీరియల్ దూరంగా ఉంటున్నారు. దీంతో రిషి పాత్ర గురించి సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి.

రిషి పాత్రను ఎందుకు తీసుకురావడం లేదంటూ సీరియల్ టీంపై ముఖేష్ గౌడ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఈ క్రమంలో తన గురించి వస్తున్న రూమర్స్ పై రియాక్ట్ అయ్యాడు ముఖేష్ గౌడ. తన ఇన్ స్టా స్టోరీలో సుధీర్ఘమైన వివరణ ఇస్తూ తన పై ఫేక్ రూమర్స్ క్రియేట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నరంటూ ఫ్యాన్స్ కు రిక్వెస్ట్ చేశారు. ఇటీవల తన గురించి వస్తున్న తప్పుడు కథనాలను అభిమానులు నమ్మొద్దని.. గుప్పెడంత మనసు ఫ్యాన్స్ పేజ్, ఇన్ స్టా, యూట్యూబ్ ఛానల్లో రూమర్స్ వస్తున్నాయని.. కావాలని తన గురించి అసత్యాలను క్రియేట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారని పేర్కొన్నాడు.

గుప్పెడంత మనసు సీరియల్ ప్రొడక్షన్ హౌస్.. ఛానల్ తోపాటు తనతో నటించిన టీం మొత్తం తనకు సపోర్ట్ ఉన్నారని.. కష్ట సమయంలో తనకు ఎప్పుడూ వారంత అండగా ఉన్నారని అన్నారు. ప్రొడక్షన్ హౌస్ కు ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దని అన్నారు. అలాగే తన పాత్ర రీఎంట్రీ గురించి దర్శకుడిని, ఛానల్ ను ఇబ్బంది పెట్టొద్దని… తప్పుడు రూమర్స్ వల్ల అడియన్స్ ప్రేమను కోల్పోతున్నానని అన్నారు. ప్రస్తుతం రిషి చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కష్టపడ్డాడు..అనుకున్నది సాధించాడు! డెలివరీ బాయ్‌ టు బిజినెస్‌మేన్
కష్టపడ్డాడు..అనుకున్నది సాధించాడు! డెలివరీ బాయ్‌ టు బిజినెస్‌మేన్
ఆఫీస్ డెస్క్‌పై ఇవి ఉంటే మీ కెరీర్ రాకెట్‌లా దూసుకుపోవడం ఖాయం..
ఆఫీస్ డెస్క్‌పై ఇవి ఉంటే మీ కెరీర్ రాకెట్‌లా దూసుకుపోవడం ఖాయం..
కొండెక్కిన చికెన్‌ ధరలు.. ప్రస్తుతం కిలో ధర ఎంత ఉందంటే?
కొండెక్కిన చికెన్‌ ధరలు.. ప్రస్తుతం కిలో ధర ఎంత ఉందంటే?
ఆ స్టార్ హీరో సినిమాపై అక్కినేని కోడలి ప్రశంసల జల్లు
ఆ స్టార్ హీరో సినిమాపై అక్కినేని కోడలి ప్రశంసల జల్లు
మేకింగ్‌తో రాజమౌళినే ఫిదా చేసిన సినిమా ఏదో తెలుసా?
మేకింగ్‌తో రాజమౌళినే ఫిదా చేసిన సినిమా ఏదో తెలుసా?
శీతాకాలంలో ఈ కూరగాయను పండించండి.. తక్కువ ఖర్చుతో రెట్టింపు ఆదాయం!
శీతాకాలంలో ఈ కూరగాయను పండించండి.. తక్కువ ఖర్చుతో రెట్టింపు ఆదాయం!
మరో ప్లేయర్‌పైనా గంభీర్ పగ పట్టాడా.. వైట్ బాల్ కెరీర్ క్లోజ్?
మరో ప్లేయర్‌పైనా గంభీర్ పగ పట్టాడా.. వైట్ బాల్ కెరీర్ క్లోజ్?
అయ్యో.. పుట్టింట్లో భార్య.. లాడ్జిలో భర్త.. ఆత్మహత్యల వెనక అసలు..
అయ్యో.. పుట్టింట్లో భార్య.. లాడ్జిలో భర్త.. ఆత్మహత్యల వెనక అసలు..
మందారం నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మందారం నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మీ వాష్ బేసిన్ ట్యాప్‌పై మొండి మరకలు పోవాలా? అద్భుతమైన ట్రిక్స్‌!
మీ వాష్ బేసిన్ ట్యాప్‌పై మొండి మరకలు పోవాలా? అద్భుతమైన ట్రిక్స్‌!