Brahmamudi, May 2nd episode: రాజ్‌కు బ్లాక్ మెయిల్.. గుట్టు బయటపెట్టేందుకు కావ్య కష్టాలు..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. మీకు అసలు సిగ్గుందా? చేసింది అంతా చేసి ఎలా నవ్వుతున్నారు? నీ కోసమే అంటూ నన్ను నిలువునా ముంచేశారు అని అనామిక రుద్రాణిపై ఫైర్ అవుతుంది. ఇప్పుడేమైంది? ఎందుకు ఆవేశ పడుతున్నావ్? అని రుద్రాణి అడుగుతుంది. మీ మాట విని నా మొగుడిని అరెస్ట్ చేయించినందుకు ఇటు నా భర్త దగ్గర, అటు నా అత్త దగ్గర చెడ్డదాన్ని అయ్యాను. మీరేదో నాకు మంచి చేస్తారు అనుకున్నా కానీ.. మీరు కూడా అందరిలాగే మోసం చేసి మీ స్వార్థం మీరు..

Brahmamudi, May 2nd episode: రాజ్‌కు బ్లాక్ మెయిల్.. గుట్టు బయటపెట్టేందుకు కావ్య కష్టాలు..
Brahmamudi
Follow us

|

Updated on: May 02, 2024 | 12:05 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. మీకు అసలు సిగ్గుందా? చేసింది అంతా చేసి ఎలా నవ్వుతున్నారు? నీ కోసమే అంటూ నన్ను నిలువునా ముంచేశారు అని అనామిక రుద్రాణిపై ఫైర్ అవుతుంది. ఇప్పుడేమైంది? ఎందుకు ఆవేశ పడుతున్నావ్? అని రుద్రాణి అడుగుతుంది. మీ మాట విని నా మొగుడిని అరెస్ట్ చేయించినందుకు ఇటు నా భర్త దగ్గర, అటు నా అత్త దగ్గర చెడ్డదాన్ని అయ్యాను. మీరేదో నాకు మంచి చేస్తారు అనుకున్నా కానీ.. మీరు కూడా అందరిలాగే మోసం చేసి మీ స్వార్థం మీరు చూసుకుంటారని అనుకోలేదని అనామిక అంటుంది. ఎంత మాట అన్నావ్? నిన్ను మోసం చేస్తే నాకు వచ్చేది ఏంటి? నువ్వు ఈ ఇంటికి రాక ముందే కళ్యాణ్ ప్లేసులో రాహుల్ ని కూర్చోబెట్టేదాన్ని. రాజ్ తర్వాత ఆ స్థానాన్ని తీసుకునే స్థానం కళ్యాణ్‌కే ఉంది. నా కొడుక్కి లేదు. నీ మొగుడు రెండు రోజులు మాట్లాడలేదని బాధ పడిపోతున్నావ్ కానీ.. జరిగిన లాభం ఏంటో గుర్తించ లేకపోతున్నావ్. నువ్వు అంత చేశావ్ కాబట్టి.. అప్పూ నీ మొగుడికి దూరంగా ఉంటుంది. కళ్యాణ్ నువ్వు చెప్పినట్టు వినడం మొదలు పెడతాడు. మెల్లగా నీ కంట్రోల్ కి వస్తాడు. ఈ ఇంట్లో వాళ్లు కూడా నువ్వు చెప్పినట్టే వింటారు. ఇదంతా జరగాలని నీకు మంచి సలహా ఇస్తే ఇప్పుడు వచ్చి నన్ను తప్పుపడతావా? అని రుద్రాణి అంటుంది. రుద్రాణి మాటలకు మళ్లీ అనామిక మోసపోతుంది. సారీ ఆంటీ ఆ ప్లాన్ గురించి తెలీక మిమ్మల్ని తిట్టేశాను అని చెబుతుంది.

నిజం దాచేందుకు రాజ్ ప్రయత్నం.. రాజ్‌ని ఫాలో అయిన కావ్య..

ఈ సీన్ కట్ చేస్తే.. సుభాష్ తీసుకొచ్చి పదిలక్షలు తీసుకొచ్చి ఇస్తాడు. అది పైనుంచి కావ్య చూస్తుంది. ఇది ఇక్కడితో ఆగదురా.. తెలిసి ఎందుకు ఇంత డబ్బు ధార పోతుస్తున్నావ్? అని సుభాష్ అంటాడు. ఎవరీకీ తెలీకుండా ఉండటానికి డాడ్.. అందుకే ఆ నోరు మూయించాలి అని రాజ్ అంటాడు. ఎప్పటికైనా నిజం బయట పడకపోదురా.. అని సుభాష్ అంటాడు. తను వచ్చి గొడవ చేస్తే.. జరిగే పరిణామాలకన్నా ఇదే బెటర్ అని అంటాడు రాజ్. అదంతా విన్న కావ్య.. రాజ్‌ని ఫాలో చేస్తుంది. రాజ్ కారును వెండిస్తూ వెళ్తుంది. ఒక ప్లేస్‌లో రాజ్ దిగుతాడు. కొద్దిగా వెనక్కి కారు ఆపి.. చూస్తుంది. ఓ వ్యక్తి వచ్చి.. ఏంటి ఇంత లేటుగా వచ్చావ్.. డబ్బు తీసుకొచ్చావా? అని అడుగుతాడు. దీంతో రాజ్ ఆ వ్యక్తి లాగి పెట్టి ఒక్కటి ఇస్తాడు. నిన్ను ఇప్పుడు ఇక్కడే కాళ్లు, చేతులు విరిచేసి అడుక్కోవడానికి కూడా పనికి రాకుండా చేయగలను. చంపేసి శవాన్ని కూడా మాయం చేయగలను. ఎన్ని సార్లు బ్లాక్ మెయిల్ చేస్తావ్ రా.. అని గట్టి వార్నింగ్ ఇస్తాడు రాజ్. నా కుటుంబం గురించి ఆలోచించి ఇస్తున్నా. పచ్చి పిచ్చి వేషాలు వేస్తే.. అని సీరియస్‌గా తిడతాడు. ఆ తర్వాత డబ్బు తీసుకున్న వ్యక్తి వెళ్లి పోతాడు. వాళ్లిద్దర్నీ చూసిన కావ్య.. డబ్బు తీసుకున్న వ్యక్తిని పట్టుకోవాలని చూస్తుంది. కానీ ఆ వ్యక్తి ఉండడు.

ఇంట్లో డాక్యుమెంట్స్ రచ్చ.. పాపం ఇరుక్కున్న స్వప్న..

ఈ సీన్ కట్ చేస్తే.. స్వప్న ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తారు. ఈలోపు సేటు వస్తాడు. హలో ఏంటి? ఇలా నేరుగా వచ్చేస్తున్నారు? ఎవరు మీరు? అని రాహుల్ ఏమీ తెలియనట్టు అడుగుతాడు. స్వప్న కావాలి?. కోటి రూపాయలు అప్పు ఇచ్చాను. అది వసూలు చేసుకోవడానికి వచ్చాను అని చెప్తాడు సేటు. అది విని అందరూ షాక్ అవుతారు. ఇంతలో స్వప్న వస్తుంది. సేటును చూసి ఎవరు? అని అడుగుతుంది స్వప్న. కోటి రూపాయలు అప్పు తీసుకుందని సేటు చెప్పబోతే.. స్వప్న ఒక్కసారిగా సీరియస్ అవుతుంది. అప్పేంటి? నేను చేయడం ఏంటి? అని స్వప్న అంటుంది. ఎవరయ్యా నువ్వు? ఎక్కడికి అనుకుని ఇక్కడికి వచ్చావు? అని అపర్ణ, పెద్దావిడ అడుగుతారు. అప్పుడే సేటు డాక్యుమెంట్స్ చూపిస్తాడు.

ఇవి కూడా చదవండి

Brahmamudi (1)

స్వప్నకు అపర్ణ సలహా..

ఆ డాక్యుమెంట్స్‌ని సుభాష్ చూస్తాడు. ఆ తర్వాత స్వప్న కూడా చేసి.. హా అవును అవే ఇవి.. కానీ వీడి దగ్గరకు ఎలా వచ్చాయి? అని స్వప్న అంటుంది. నువ్వే కదా వచ్చి తాకట్టు పెట్టావు? నీ సంతకం కూడా ఉందని సేటు చూపిస్తాడు. నేనేంటి? అప్పు తీసుకోవడం ఏంటి? పైగా నేను సంతకం చేయడం ఏంటి? అని స్వప్న అంటుంది. ఆ తర్వాత కావాలనే రుద్రాణి ఏమీ తెలియనట్టు మాట్లాడుతూ.. స్వప్న బుక్ చేస్తుంది. ఇదేదో గ్యాంబ్లింగ్‌లా ఉంది అని స్వప్న అంటే.. వెంటనే రాహుల్.. అంతా చేసి మళ్లీ ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావ్? నడవ్వే బయటకు అని రాహుల్ అంటాడు. నేను ఏ తప్పూ చేయకుండానే బయటకు ఎందుకు వెళ్లాలి? అని స్వప్న అంటే.. ఇంతలో సేటు పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇస్తాను అని చెప్తాడు. ఇంతలో సుభాష్ సర్ది చెప్తాడు. ఏదో జరిగింది.. నా దగ్గర ఉండాల్సిన పేపర్స్ అక్కడికి ఎందుకు వెళ్లాయి? అతని దగ్గరకు ఎలా వెళ్లాయి? ఏదో జరిగిందని స్వప్న అంటుంది. ఏమ్మా.. నీకు నిజంగా అంత డబ్బుతో అవసరం లేదని నీకు తెలుసు. నువ్వు తెలివైన దానివి. నీ అనుభవం నీకు ఏమని చెప్తుందో అదే నిజమని తేలుతుంది. ఆ దిశగా ఆలోచించు అని అపర్ణ అంటుంది. అవును ఆంటీ? ఏదో జరిగింది. నేను బాగా ఆలోచిస్తాను. రెండు రోజుల్లో ఆ గుట్టు బయట పెడతాను. నా మాట నమ్మండి అని స్వప్న అంటుంది.

రాజ్‌ని తికమక పెట్టిన కావ్య..

ఈ సీన్ కట్ చేస్తే.. రాజ్ ఇంటికి వచ్చి బాబును చూస్తాడు. హమ్మయ్యా అప్పటి నుంచి లేవలేదన్నమాట. రేయ్ ఏం టైమింగ్‌రా నీది. నేను వచ్చే దాకా ఏడుపు ఆపుకున్నావా.. అని చూడబోతే బాబు టాయిలెట్ పోస్తాడు. డైపర్ మార్చుదామంటే ఇంతలో డైపర్స్ ఉండవు. ఎలా అని ఆలోచిస్తుండగా.. కావ్య వస్తుంది. ఎక్కడికి వెళ్లావు? అని రాజ్ అడిగితే.. కావ్య కావాలనే రాజ్ ని తికమక పెడుతూ మాట్లాడుతుంది. ఇక ఈ రోజుతో ఇవాళ్టి ఎపిసోడ్‌ ముగుస్తుంది.