ఎదురుచూపుల్లో కృతి శెట్టి.. అమ్మాడి ఆశలన్నీ అక్కడే..

Rajitha Chanti

Pic credit - Instagram

06 April 2026

దక్షిణాది సూపర్‌స్టార్ సిమ్రాన్ 50వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో విషెస్ తెలుపుతున్నారు. 

ఇదిలా ఉంటే.. తాజాగా తన పుట్టినరోజు ప్రత్యేకంగా సిమ్రాన్ భర్త దీపక్ ఆమె స్టైలీష్ ఫోటోస్ షేర్ చేస్తూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

ఆ ఫోటోస్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఐదు పదుల వయసులో ఏమాత్రం తరగని అందంతో కట్టిపడేస్తున్నారు మేడమ్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్. 

ఇది కేవలం ఒక షూట్ మాత్రమే కాదు, ప్రతి ఫ్రేమ్‌తో నా భావాలను, జ్ఞాపకాలను పండుగలా జరుపుకోవడంలో ఇది ఒక భాగం. ఒక కొత్త లుక్, ఎప్పటికీ వదులుకోను అంటూ సిమ్రాన్ చెప్పుకొచ్చారు.

పంజాబీ కుటుంబంలో పుట్టి పెరిగిన సిమ్రాన్ 1995లో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. అందాల పోటీల ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో నటించింది.

 సిమ్రాన్‌కు 2003లో వివాహం జరిగింది. తన చిన్ననాటి స్నేహితుడు దీపక్ ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక బాబు జన్మించిన సంగతి తెలిసిందే.

తన సోదరి నవల్ మరణం తర్వాత సినిమాలకు దూరంగా ఉండవలసి వచ్చిన సిమ్రాన్‌కు దీపక్ అండగా నిలిచాడు. ఇటీవలే సిమ్రాన్ తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది.