ప్రేమే సర్వస్వం కాదు.. ప్రేమ లేకపోతే దేనికీ అర్థం లేదు.. త్రిష పోస్ట్

Rajitha Chanti

Pic credit - Instagram

06 April 2026

త్రిష కృష్ణన్.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మారు మోగుతున్న పేరు. సినిమా కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నారు.

తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇప్పుడు ఆమె పేరు రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారారు. టీవీకే అధినేత దళపతి విజయ్ తో ఆమె పేరు ముడి పెడుతున్నారు.

ఈ క్రమంలో తాజాగా త్రిష తన ఇన్ స్టాలో షేర్ చేస్తున్న వీడియోస్, ఫోటోస్ , లవ్ కోట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి. ఇప్పుడు మరో పోస్ట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

మీరు ఇతరుల అభిప్రాయాలను, వైఖరులను నియంత్రించలేరు లేదా శాసించలేరు. మీరు చేయగలిగిందల్లా మీ జీవితాన్ని ఉత్తమంగా జీవించడమే. ఒక మంచి వ్యక్తిగా ఉండండి.

నిజాయితీతో మాట్లాడండి.. అప్పుడు ఇదే మీ జీవితంలో అత్యుత్తమ రోజు అని తెలుసుకుని మీరు రాత్రి హాయిగా నిద్రపోగలరని మీకు తెలుస్తుందంటూ పోస్ట్ చేసింది. 

అలాగే నేను ఎవరితోనూ వాదించే  స్టేజ్ లో లేను. ఏనుగు ఎగురుతుందని అంటే అవును నిజమే అంటాను. దాన్ని ఒప్పుకుంటాను తప్పు.. నిన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించను.

నేను చాలా ముఖ్యమైన విషయం తెలుసుకున్నాను. అదేంటంటే సరిగ్గా ఉండడం కంటే శాంతియే ఎక్కువ విలువైనది. వివరించడం కన్నా మౌనంగా ఉండడం మేలు.

 ప్రేమే సర్వస్వం కాదు. కానీ ప్రేమ లేకపోతే దేనికీ అర్థం లేదు అనే కోట్ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ నిజం అని త్రిష పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె పోస్టులు వైరలవుతున్నాయి.