వీటిని గుర్తుపట్టారా.? రోజూ చిటికెడు తింటే లాభమెంతో..!
06 April 2026
TV9 Telugu
TV9 Telugu
ఆరోగ్యకరమైన ప్రొటీన్ దండిగా ఉండే మెంతులు ప్రతి ఇంటి వంటగదిలో తప్పనిసరిగా ఉంటాయి. అందుకే కండబలం కోసం గుడ్డు, మాంసం కంటే మెంతుల్లోని ప్రొటీన్ ఎక్కువ మేలు చేస్తుందని ఫుడ్ సైన్స్ జర్నల్ చెబుతుంది
TV9 Telugu
మెంతి గింజల్లో పుష్కలంగా ఉండే ప్రొటీన్, పీచు, మెగ్నీషియంల సమ్మేళనం కండబలానికి ఎంతగానో సహకరిస్తుందట. వ్యాయామం చేసిన తర్వాత అలసి, గాయపడిన కండరాలు రిలాక్స్ అవ్వాలన్నా, గాయాల నుంచి తిరిగి వేగంగా కోలుకోవాలన్నా మెంతులు ఎంతో ఉపయోగపడతాయి
TV9 Telugu
మెంతులు నోట్లో పెట్టుకుంటే చేదుగా అనిపిస్తాయి కానీ, శరీరంలోకి వెళితే మాత్రం ఔషధంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే పీచు పదార్థాలు జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తాయి
TV9 Telugu
అంతేకాదు ఆహారంలోని కార్బోహైడ్రేట్లు, గ్లూకోజ్‌లను త్వరగా గ్రహించకుండా అడ్డుకుంటాయి. మెంతి ఆకుల్లోనూ ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తహీనత రాకుండా జాగ్రత్త పడొచ్చు
TV9 Telugu
వీటిల్లో విటమిన్ ఎ, సిలతోపాటు బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. విటమిన్-సి రోగనిరోధకతను పెంచితే విటమిన్-ఎ దృష్టి సమస్యలను దూరం చేస్తుంది
TV9 Telugu
వీటిలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేసి వృద్ధాప్య ఛాయల్ని దూరం చేస్తాయి. రోజూ మెంతులు తీసుకోవడం వల్ల మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని అధ్యయనాల్లోనూ తేలింది
TV9 Telugu
అంతేకాదు హార్మోన్ల స్థాయుల్ని సమతుల్యం చేయడానికి మెంతులను తొంభై రోజులపాటు సప్లిమెంట్‌గా తీసుకున్నవారిలో నొప్పి కూడా తగ్గిందని ప్లేసిబో అధ్యయనం వెల్లడించింది
TV9 Telugu
రాత్రిపూట మెంతుల్ని నానబెట్టి తెల్లారి వాటిని వడగట్టి తాగినా, వేడి నీటిలో పదినిమిషాలు నానబెట్టి తాగినా జుట్టు రాలడం తగ్గుతుంది. మొలకలుగా తీసుకున్నా అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది