Brahmamudi, March 29th episode: అనామికను కుక్కిన పేనులా ఉండమన్న అపర్ణ.. పిల్లాడితో ఆఫీస్‌కి రాజ్!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. బాబు స్నానం ఎలా చేయించాలో చెబుతుంది కావ్య. కానీ రాజ్‌కు చేత కాదు. మధ్య మధ్యలో కావ్య సెటైర్లు వేస్తూ.. తనని తాను తిట్టుకుంటూ ఉంటుంది. బాబుకు స్నానం చేయించడం రాజ్‌కు చేత కాకపోతే.. కావ్యనే దగ్గరుండి స్నానం చేయిస్తుంది. నన్నూ, ముమ్మల్ని ఈ టైమ్‌లో చూస్తే మన ఇద్దరికీ ఒకేసారి తలంటు పోస్తారు అని కావ్య అంటుంది. ఈ సీన్ కట్ చేస్తే.. కింద ప్రకాశం ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. పై నుంచి రుద్రాణి వింటూ ఉంటుంది. అప్పుడే అనామిక..

Brahmamudi, March 29th episode: అనామికను కుక్కిన పేనులా ఉండమన్న అపర్ణ.. పిల్లాడితో ఆఫీస్‌కి రాజ్!
Brahmamudi
Follow us

|

Updated on: Mar 29, 2024 | 11:23 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. బాబు స్నానం ఎలా చేయించాలో చెబుతుంది కావ్య. కానీ రాజ్‌కు చేత కాదు. మధ్య మధ్యలో కావ్య సెటైర్లు వేస్తూ.. తనని తాను తిట్టుకుంటూ ఉంటుంది. బాబుకు స్నానం చేయించడం రాజ్‌కు చేత కాకపోతే.. కావ్యనే దగ్గరుండి స్నానం చేయిస్తుంది. నన్నూ, ముమ్మల్ని ఈ టైమ్‌లో చూస్తే మన ఇద్దరికీ ఒకేసారి తలంటు పోస్తారు అని కావ్య అంటుంది. ఈ సీన్ కట్ చేస్తే.. కింద ప్రకాశం ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. పై నుంచి రుద్రాణి వింటూ ఉంటుంది. అప్పుడే అనామిక వస్తుంది. ఏంటి చూస్తున్నారు అని అనామిక అడుగుతుంది. ఏదో జరిగింది.. మీ మామ దేనికో టెన్షన్ పడుతున్నాడు అని అంటుంది రుద్రాణి. కింద ప్రకాశం మాట్లాడుతూ.. రాజ్ ఇప్పటికే కొన్ని సమస్యల్లో ఉన్నాడు. ఇప్పుడు రాజ్ వల్ల కోటి రూపాయల నష్టం వచ్చిందంటే ఇంకా సమస్యలు పెరుగుతాయి. టైమ్ చూసి నేనే ఏదో ఒకటి చేస్తాను. ఈ విషయం మా అన్నయ్య దాకా వెళ్లనివ్వకు అని చెప్తాడు ప్రకాశం. అది విన్న రుద్రాణి.. అనామికలు వెళ్లి ధాన్య లక్ష్మికి చెప్తారు.

నట్టింట్లో ధాన్య లక్ష్మి రచ్చ..

అది విన్న ధాన్యం.. దొరికింది మా అక్కా.. ఆరోజు మా ఆయన రూ.50 లక్షల నష్టం తెచ్చాడని భార్యభర్తలు ఇద్దరూ ఎంత గొడవ చేశారు కదా.. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో నేనూ చూస్తాను అని ఆవేశంగా వెళ్తుంది. అప్పటికే హాలులో ప్రకాశాన్ని కంపెనీకి వచ్చిన నష్టం గురించి సుభాష్ నిలదీస్తూ ఉంటాడు. ప్రకాశం నేను చూసుకుంటానులే అన్నయ్యా అని చెప్తాడు. ఇంతలో వచ్చిన ధాన్య లక్ష్మి.. మీరెందుకు ఈ విషయం దాస్తున్నారెండి? బావగారికి కారణం ఇప్పుడే చెప్పండి అని అంటుంది. ఏయ్ నువ్వెందుకు ఈ విషయంలో జోక్యం చేసుకుంటున్నావ్ అని ప్రకాశం మందలిస్తాడు. అయినా వినిపించుకోని ధాన్య లక్ష్మి.. ఎవర్ని కాపాడటానికి ఇదంతా చేస్తున్నారు అని అంటుంది. దేని గురించి ధాన్య లక్ష్మి మాట్లాడుతుంది.. అసలు ఏం జరుగుతుంది చెప్పు అని సుభాష్ అడుగుతాడు.

రాజ్‌ పరువు తీసేసిన ధాన్య లక్ష్మి..

మీరన్న ఆర్డర్ ఆగిపోవడం వల్ల.. కంపెనీకి కోటి రూపాయల నష్టం వచ్చింది. ఆ నష్టానికి కారణం మన రాజ్ అని అంటుంది. అది విన్న ఇంట్లోని వాళ్లందరూ షాక్ అవుతారు. పై నుంచి వచ్చిన రాజ్ అదంతా వింటాడు. అప్పుడు మీ వల్ల రూ.50 లక్షల నష్టం వచ్చినప్పుడు మిమ్మల్ని అనలేదా.. ఇప్పుడు రాజ్ వల్ల అంతకు రెట్టింపు నష్టం వచ్చింది. మరి ఇప్పుడు దీనికి మా అక్క ఏమని సమాధానం చెప్తుంది అని ధాన్య లక్ష్మి నిలదీస్తుంది. అప్పటికీ ప్రకాశం ధాన్యాన్ని తిడుతూ ఉంటాడు. అయినా పట్టించుకోని ధాన్య లక్ష్మి.. రెచ్చిపోతుంది. మిమ్మల్ని పది మందిలో నిలబెట్టి పరువు తీసేస్తారు అని అంటుంది. ఎన్నిసార్లు తీశారు పరువు? మా బాబాయ్ పరువు ఎన్ని సార్లు తీశారు? ఎవరు తీశారు? అసలు మిమ్మల్ని ఎవరు వేరుగా చూశారు? మీరే మానసికంగా వేరు అయిపోయి.. మమ్మల్నే వేరుగా చూడటం మొదలు పెట్టారు. ఇవాళ నావల్లే నష్టం వచ్చింది. అందుకు మా అమ్మ ఎందుకు సమాధానం చెప్పాలి అని రాజ్ అంటాడు.

ఇవి కూడా చదవండి

అనామికను కుక్కిన పేనులా ఉండమన్న అపర్ణ..

మీ అమ్మ మరిదిగారు అని చూడకుండా.. నిలదీయకుండా ఉండాల్సింది అని ధాన్య లక్ష్మి అడుగుతుంది. దీంతో ధాన్య లక్ష్మి అని అపర్ణ గట్టిగా అరుస్తుంది. ఆ రోజు మా ఆయన నీకు సారీ చెప్పారు. తమ్ముడిని మందలించే హక్కు మీకుందా అని అడిగితే.. నీకేంద అధికారం ఉందని అడగకుండా ఆయన తమ్ముడికి సారీ చెప్పారు. మగవాళ్ల ఆఫీసు విషయంలో జోక్యం అనవసరం అని అప్పుడే అర్థం అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆఫీసు విషయాలు కూడా ప్రస్తావించడం మానేశాను. ఇప్పుడు నీకు సమాధానం చెప్పాలా.. చెప్పను.. ఏం చేస్తావ్ నోరు వేసుకుని అరుస్తావా.. అరిస్తే నీ క్యారెక్టర్ ఏంటో బయట పడుతుంది. అంతకంటే ఏం చేయగలవు నువ్వు అని ధాన్యలక్ష్మిపై సీరియస్ అవుతుంది అపర్ణ. అప్పుడే కానీ కోటి రూపాయల నష్టం అని కూని రాగాలు తీస్తుంది అనామిక. ఏయ్.. వచ్చింది అయితే ఏంటి? నీ పుట్టింటి నుంచి తెచ్చిన ఆస్తి కలిపావా? నిన్నగాక మొన్న వచ్చావ్.. కుక్కిన పేనులా పడి ఉండు. ఎక్కువ మాట్లాడితే శాంతను పనిలోనుండి తీసి పారేస్తా. అన్ని పనులూ నువ్వే చేయాల్సి ఉంటుంది అర్థమైందా అని పిల్ల కాకి కూడా వార్నింగ్ ఇస్తుంది.

ఎమోషనల్ అయిన రాజ్..

ఆ నష్టానికి కారణం నేనే పిన్ని. అలాగే ఈ సంవత్సరంలో వారసుడిగా ప్రకటించాక.. రెట్టింపు లాభాలకు కారణం కూడా నేనే. దేనికి సారీ చెప్పాలి నష్టానికా? లాభానికా? సరే ఈ ఇంట్లో లాభ నష్టాల మాటేంటి? అని అడుగుతాడు. అక్కా చెల్లెల్లా కలిసి ఉండేవారు. కానీ ఇప్పుడు సఖ్యత లేదు అది లాభమా.. నష్టామా అన్నదమ్ముల మధ్య కూడా భేదాభిప్రాయాలు పుట్టిస్తున్నారు. స్వప్నకు ఆస్తి రాసిచ్చినప్పుడు మా అత్తను బయటకు పొమ్మన్నారు అని అన్నీ ప్రశ్నిస్తాడు రాజ్. ఇప్పటివరకూ నువ్వు లాభనష్టాల గురించి బాగానే మాట్లాడావ్. పాలకుండ లాంటి ఇంట్లో విషపు చుక్క పడింది. అది లాభమా.. నష్టామా.. ఈ ఇంటి పునాదుల్నిపెకిలించుకుంటూ ఓ రావి మొక్క మొలిచింది. అది లాభమా నష్టామా.. ఈ రోజు ధాన్య లక్ష్మి వంటి వాళ్లు మాట్లాడుతున్నారంటే దానికి అవకాశం ఇచ్చింది ఎవరు? అంటూ అపర్ణ.. రాజ్‌ని ప్రశ్నిస్తుంది.

అప్పూ మాస్ వార్నింగ్..

ఈ సీన్ కట్ చేస్తే.. అప్పూ ఇంటర్వ్యూకి వెళ్తుంది. అంతా సక్సెస్ కావడంతో ఇక ఓన్లీ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది మెయిల్ చేస్తాం అని చెప్తారు. దీంతో అప్పూ సంతోష పడుతూ బయటకు వస్తుంది. అంతలోనే అక్కడున్న బ్రోకర్.. ఏంటి మెయిల్ చేస్తాం అని చెప్పారా? కానీ అది కుదరదు. మా లాంటి బ్రోకర్లు ఉన్నంత వరకూ ఉద్యోగాల్ని అంత తేలిగ్గా పోనివ్వం కదా.. మీ లాంటి యంగ్ టాలెంట్‌ని బాగా ఎంకరేజ్ చేస్తారు. మీకు మెయిల్ రావాలి అంటే.. లోపల మావాడు ఉన్నాడు. వాడికి లంచం ఇస్తే కానీ పని చేయడు. ఇక్కడి వరకూ వచ్చాం అంటే.. మా జాగ్రత్తలో మేము ఉంటాం కదా.. అందుకే నా మాట విని నా దారికి వినండి. నేను చెప్పినట్టు చేస్తే ఈజీగా పోలీస్ అయిపోతారు. జస్ట్ ఒక్క నైట్ నేను చెప్పిన గెస్ట్ హౌస్‌కి వస్తే చాలు అని అంటాడు. దీంతో అప్పూ బ్రోకర్ కాలర్ పట్టుకుంటుని.. వార్నింగ్ ఇస్తుంది.

పిల్లాడితో ఆఫీస్‌కి రాజ్.. కావ్య కష్టాలు..

ఆ తర్వాత పిల్లాడితో పాటు ఆఫీస్‌కి బయలు దేరతాడు రాజ్. ఎందుకు? ఎక్కడికి అని కావ్య అడుగుతుంది. జరిగిన నష్టాన్ని పూడ్చాలి కదా.. అని రాజ్ అంటే.. మరి నిజాన్ని ఎక్కడ పూడ్చుతారు. వాడిని ఆఫీస్‌కు తీసుకెళ్లడం అవసరమా? అంటే నీ ఉద్దేశం ఏంటి? అని రాజ్ అడుగుతాడు. ఇప్పుడు ఇలా వెళ్తే మీకు గౌరవం ఉంటుందా? ఇంట్లో ఏమని సమాధానం చెప్తారు? అని కావ్య అడిగితే.. ఇంట్లో ఎవరూ బాబును పట్టించుకునే వాళ్లు లేరు కాబట్టి తీసుకును వెళ్తున్నా అని రాజ్ అంటాడు. మీరు అన్నింటికీ తెగించేశారని కావ్య అంటుంది. మరి ఇప్పుడు ఏం చేయమంటావ్? అని రాజ్ అడిగితే.. వాడి తల్లిని తీసుకు రండి.. నేను ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతాను. ఆ బిడ్డను తల్లి నుంచి వేరు చేసే హక్కు మీకు లేదు. ఈ బిడ్డను కన్న తల్లి ఎవరో చెప్పండి అని కావ్య అడిగితే.. రాజ్ మౌనంగా ఉంటాడు. ఇవాళ ఆఫీస్‌లో డిజైన్స్ సెలెక్ట్ చేయాలి. నువ్వు కూడా ఆఫీస్‌కి రావాలి అని రాజ్ అంటే.. కుదరదు.. ఏ బోర్డు తగిలించుకుని రావాలో చెప్పండని కావ్య అడుగుతుంది. డిజైనర్‌గా రా అని రాజ్ అంటే.. దీంతో కావ్య క్లాస్ పీకుతుంది. ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.