Brahmamudi, July 3rd Episode: ఇరుక్కున్న కవి.. కోర్టుకు అప్పూ.. అనామికకు పాజిటివ్‌గా జడ్జి..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళ్యాణ్‌కు శిక్ష పడాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉంటాయి. అప్పుడే కళ్యాణ్‌ని పోలీసులు తీసుకు వస్తారు. కళ్యాణ్‌ని చూడగానే మీడియా కూడా ముందుకు వచ్చి.. టార్గెట్ చేసి ప్రశ్నల వర్షం కురిపిస్తారు. అది చూసిన ధాన్య లక్ష్మి, ప్రకాశం బాధ పడుతూ ఉంటారు. మీడియా ఇష్ట మెచ్చినట్టు ప్రశ్నలు అడగటంతో రాజ్ ఒక్కసారిగా ఆవేశ పడతాడు. దీంతో కావ్య పక్కకు తీసుకొచ్చి సర్ది చెబుతుంది. మీరు ఆవేశ పడితే..

Brahmamudi, July 3rd Episode: ఇరుక్కున్న కవి.. కోర్టుకు అప్పూ.. అనామికకు పాజిటివ్‌గా జడ్జి..
Brahmamudi
Follow us

|

Updated on: Jul 03, 2024 | 11:40 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళ్యాణ్‌కు శిక్ష పడాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉంటాయి. అప్పుడే కళ్యాణ్‌ని పోలీసులు తీసుకు వస్తారు. కళ్యాణ్‌ని చూడగానే మీడియా కూడా ముందుకు వచ్చి.. టార్గెట్ చేసి ప్రశ్నల వర్షం కురిపిస్తారు. అది చూసిన ధాన్య లక్ష్మి, ప్రకాశం బాధ పడుతూ ఉంటారు. మీడియా ఇష్ట మెచ్చినట్టు ప్రశ్నలు అడగటంతో రాజ్ ఒక్కసారిగా ఆవేశ పడతాడు. దీంతో కావ్య పక్కకు తీసుకొచ్చి సర్ది చెబుతుంది. మీరు ఆవేశ పడితే.. నష్ట పోయేది కవి గారే. కాబట్టి కాసేపు మీరు ఓపికగా ఉండాలని చెబుతుంది. అప్పుడే అనామిక కూడా వస్తుంది. అనామికను చూసిన రాజ్ మరింత ఆవేశ పడతాడు. ఇదంతా జరగడానికి కారణం అది.. మా తమ్ముడు ప్రేమించానని చెప్పగానే ఇంటికి తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నాం కదా ఇలా జరగాల్సిందే అంటాడు. ఆవేశ పడకండి.. నేను వెళ్లి ఒక్కసారి అనామికతో మాట్లాడతాను అని కావ్య చెబుతుంది. వద్దని రాజ్ అంటాడు. కానీ కావ్య వెళ్లి ఒకసారి ప్రయత్నం చేస్తాను అంటుంది.

తగ్గని అనామిక పొగరు..

మహిళా సంఘాలను చూడగానే.. చూశావా డాడ్ నేను తప్పు చేస్తున్నా అన్నారు. కానీ ఈ రోజు నాకు ఇంత మంది సపోర్ట్‌గా నిలబడ్డారని మురిసి పోతుంది. నిజం బయట పడితే వీళ్లందరూ నీకు నెగిటీవ్‌గా మారతారమ్మా అని తండ్రి సుబ్రమణ్యం అంటాడు. దానికి ఛాన్సే లేదని అనామిక అంటుంది. అనామిక దగ్గరకు వచ్చిన కావ్య.. నువ్వు ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావ్.. నా మాట విను అని కావ్య అంటే.. అనామిక పొగరుగా సమాధానం చెబుతుంది. అదంతా చూసి రుద్రాణి, రాహుల్ లు సంతోష పడతారు. ఇక అందరూ కోర్టులోకి వెళ్తారు. అప్పుడే జడ్జి కోర్టుకు వస్తాడు. డౌరీ హరాస్ మెంట్, డొమెస్టిక్ వయెలెన్స్, ఎక్స్ ట్రా మారిటల్ అఫైర్స్.. ఇంకా వేరే కేసులు గుర్తుకు రాలేదా అని జడ్జి పోలీసులను అడిగితే.. ఆమె పెట్టిన కేసులో రాశాం సర్ అని పోలీస్ చెప్తాడు.

ట్నం కోసం కూడా వేధించాడన్న అనామిక..

ఇక కోర్టులో వాదనలు మొదలవుతాయి. ముందు అనామిక లాయర్ స్టార్ట్ చేస్తుంది. అనామిక అనే వ్యక్తి కోర్టుకు రావడానికి కారణం.. ఆమె అనుభవించిన శారీరక, మానసిక కారణాలే కారణం. ఎంతో ఆశతో దుగ్గిరాల కుటుంబంలోకి అడుగు పెట్టింది. కానీ ఈ ముద్దాయి అప్పూ అనే వ్యక్తితో సంబంధం పెట్టుకున్నాడు. ఆ సంబంధం పెళ్లి అయినప్పటి నుంచీ గొడవలు జరుగుతున్నాయి. అంతే కాకుండా ఇద్దరినీ హోటల్ గదిలో రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత కట్నం కోసం కూడా వేధించేవాడు. ఇలాంటి ముద్దాయిని కోర్టు కఠింగా శిక్షించాలని కోరుతున్నా అని అనామిక లాయర్ చెబుతుంది.

ఇవి కూడా చదవండి

అనామికక ఝలక్ ఇచ్చిన లాయర్..

ఆ తర్వాత కళ్యాణ్ తరపు లాయర్ వాదిస్తాడు. ముందుగా అనామికను ప్రశ్నలు కురిపిస్తాడు. మీరు అతన్ని ఎలా పెళ్లి చేసుకున్నారు? పెళ్లికి ముందు అతను కవిత్వం రాస్తాడని మీకు తెలుసా? అని అడుగుతాడు. నా కర్మ కాలి లవ్ చేసి పెళ్లి చేసుకున్నా.. ముందు కేవలం కవితలు మాత్రమే రాస్తాడు. అసలు బిజినెస్ అనే ధ్యాసే ఉండేది కాదని అనామిక అంటే.. ఈ పాయింట్ నోట్ చేసుకోమని జడ్జిగారికి చెప్తారు. నా క్లయింట్ ముందు కవిత్వాలు రాస్తాడని.. బిజినెస్ చూసుకోడని తెలుసు. అయినా కూడా పెళ్లి తర్వాత అతని మీద ఒత్తిడి తీసుకొచ్చాడని లాయర్ చెబుతూ.. మిమ్మల్ని అదనపు కట్నం కోసం వేధించేవాడా? అని అడుగుతాడు. అవునని అనామిక అంటుంది. మీ పెళ్లికి ఎంత కట్నం ఇచ్చారని లాయర్ అడిగితే.. కోటి రూపాయలని అనామిక అబద్ధం చెబుతుంది.

పెళ్లికి ముందే మీ నాన్నకు అప్పు ఉంది కదా..

కట్నం తీసుకోవడమే కాదు.. ఇవ్వడం కూడా తప్పు. అంతే కాకుండా మీ పెళ్లికి ముందే మీ నాన్నకు రెండు కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయనీ.. అది ఇస్తేనే మీ పెళ్లి జరిపిస్తానని ఓ వడ్డీ వ్యాపారి వచ్చాడు. అతనెవరు? అని లాయర్ అడిగితే.. అనామిక నీళ్లు నములుతూ ఏమో నాకు తెలీదు.. గుర్తు లేదని అంటుంది. ఇదంతా నీ సమక్షంలోనే జరిగింది. గుర్తు తెచ్చుకో.. పెళ్లి జరగదని ఆపేస్తే.. మీ బావగారు స్వరాజ్ అప్పటికప్పుడు రెండు కోట్లు ఇచ్చారన్న మాట నిజమేనా? అని అడుగుతాడు. ఎంతో పేరు, డబ్బు ఉన్న ఈ ఫ్యామిలీ కట్నం అడగాల్సిన అవసరమే లేదని లాయర్ అంటాడు.

మీ పెళ్లి ఆపాలని అప్పూ ఎందుకు ట్రై చేసింది..

అప్పుడే లేడీ లాయర్ ఎంటర్ అయ్యి.. కళ్యాణ్‌ని ప్రశ్నించడం మొదలు పెడుతుంది. మీ ఫ్రెండ్ అప్పూతోనే కదా మీరు సంబంధం పెట్టుకున్నారు. అందుకే కదా అనామిక విడాకులు కోరుతుంది అని లాయర్ అంటుంది. కాదని కళ్యాణ్ అంటాడు. అయితే మరి అప్పూ, ఆమె తల్లి కనకం ఎందుకు మీ పెళ్లి ఆపాలని ట్రై చేశారు.. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఉందని జడ్జి గారికి చూపిస్తుంది. మరి ఈ వీడియో ఏంటి.. అప్పూతో ఎలాంటి సంబంధం లేదని అన్నారని జడ్జ్ అడుగుతుంది.

ఇరుక్కున్న కళ్యాణ్.. కోర్టుకు అప్పూ..

అప్పూతో నాకు స్నేహం మాత్రమే ఉంది. తనని వేరే దృష్టితో చూడలేదు. కానీ అప్పూ మాత్రం తనకు తెలియకుండానే ప్రేమించిందని కళ్యాణ్ అంటాడు. ఆమె ప్రేమించిందో లేదో నీకెలా తెలుసు? మీది పవిత్రమైన స్నేహం అన్నావ్? అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? అని జడ్జ్ అంటాడు. అలాగే అనామికను కొట్టిన విషయం కూడా చెబుతుంది లాయర్. ఇదేంటయ్యా సున్నిత మనస్కుడు అన్నావ్? ఇప్పుడు కొట్టాడు.. ఇంతకీ అప్పూ ఏది? అని జడ్జ్ అడిగితే.. ఇక్కడ లేదని కళ్యాణ్ లాయర్ చెప్తాడు. అదేంటి? ఇంత గొడవకు కారం అయిన మనిషి ఉండాలి కదా ముందు అప్పూని కోర్టుకు తీసుకు రండి అని చెప్తాడు. రేపటి వరకూ ఈ కేసు వాయిదా వేస్తున్నాను అని జడ్జి చెప్పి వెళ్లి పోతాడు. ఇక ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు
అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి.. ఎందుకో తెలుసా.?
అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి.. ఎందుకో తెలుసా.?
ఇదుగో... ఇదే కల్కిమూవీలో అశ్వత్ధామ ఆలయం
ఇదుగో... ఇదే కల్కిమూవీలో అశ్వత్ధామ ఆలయం