Brahmamudi, July 2nd Episode: తగ్గేదేలే అంటోన్న రాజ్.. దుగ్గిరాల ఫ్యామిలీకి అనామిక ఛాలెంజ్..

కళ్యాణ్‌ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇంటికి వస్తారు. దీంతో అందరూ కంగారు పడతారు. మన ఇంటి పరువు ఎలాగో పోయింది. కానీ ఇప్పుడు ఆలోచించాల్సింది కళ్యాణ్ సంతోషం. అందుకు మనం ఏం చేయాలో అది ఇప్పుడు చూద్దామని రాజ్ అంటే.. నాకు ఏమీ అర్థం కావడం లేదు రాజ్.. మీకు నచ్చింది చేయమని ధాన్య లక్ష్మి అంటుంది. సరే నువ్వు ధైర్యంగా వెళ్లు రా.. కోర్టులోనే తేల్చుకుందాం.. మనవైపే న్యాయం ఉంది. మనమే గెలుస్తామని కళ్యాణ్‌కు ధైర్యం..

Brahmamudi, July 2nd Episode: తగ్గేదేలే అంటోన్న రాజ్.. దుగ్గిరాల ఫ్యామిలీకి అనామిక ఛాలెంజ్..
Brahmamudi
Follow us

|

Updated on: Jul 02, 2024 | 12:44 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళ్యాణ్‌ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇంటికి వస్తారు. దీంతో అందరూ కంగారు పడతారు. మన ఇంటి పరువు ఎలాగో పోయింది. కానీ ఇప్పుడు ఆలోచించాల్సింది కళ్యాణ్ సంతోషం. అందుకు మనం ఏం చేయాలో అది ఇప్పుడు చూద్దామని రాజ్ అంటే.. నాకు ఏమీ అర్థం కావడం లేదు రాజ్.. మీకు నచ్చింది చేయమని ధాన్య లక్ష్మి అంటుంది. సరే నువ్వు ధైర్యంగా వెళ్లు రా.. కోర్టులోనే తేల్చుకుందాం.. మనవైపే న్యాయం ఉంది. మనమే గెలుస్తామని కళ్యాణ్‌కు ధైర్యం చెప్పి రాజ్ పంపిస్తాడు. ఇక తెల్లవారుతుంది. అప్పూ ఆలోచిస్తూ కూర్చొంటుంది. అప్పుడే బంటీ పరిగెత్తుకుంటూ వచ్చి కళ్యాణ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్తాడు. దీంతో కనకం, కృష్ట మూర్తి, అప్పూలు షాక్ అవుతారు. ఎందుకు అరెస్ట్ చేశారని అప్పూ అడిగితే.. ఆ అనామిక కళ్యాణ్ మీద పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చిందట అని అంటాడు. దానికేం వచ్చి చచ్చింది.. బంగారం లాంటి మొగుడి మీద కేసు పెడుతుందా? పాపం అండీ కళ్యాణ్ దాన్ని కట్టుకుని నరకం అనుభవిస్తున్నాడని బాధ పడుతుంది.

అప్పూని బలవంతంగా ఆపేసిన కనకం..

బంటీ ఏ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారని అప్పూ అడిగితే.. జూబ్లీహిల్స్ అని చెప్తాడు. సరే పదా అని అప్పూ వెళ్తుంది. ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఏం చేస్తావ్? నువ్వు పోలీస్ స్టేషన్‌కు వెళ్లడానికి వీల్లేదని కనకం అడ్డు పడుతుంది. ఎందుకు వెళ్ల కూడదు. అక్కడ నా ఫ్రెండ్ అరెస్ట్ అయి ఉంటే ఎలా కూర్చొంటాను అని అప్పూ అంటే.. మీ ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందనే కదా కళ్యాణ్‌ని పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. అందుకే విడాకులు కావాలి అడుగుతున్నాడని కళ్యాణ్‌ని అరెస్ట్ చేయించింది. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే అది మనమే ఒప్పుకున్నట్టు అవుతుందని కనకం అంటుంది. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే నేను పోలీస్ స్టేషన్‌లో ఉంటే.. వెతికి పట్టుకుని వచ్చి సహాయం చేసి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఆ విషయం మర్చిపోయావా? అని గుర్తు చేస్తుంది. అంత సహాయం చేసినవాడు ఇప్పుడు కష్టంలో ఉంటే వదిలేయాలా? అని అప్పూ అంటే.. ఇప్పుడు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరే.. అని కనకం చెప్పాలనుకుంటుంది. అయినా వినిపించుకోని అప్పూ కళ్యాణ్ దగ్గరకు బయలు దేరుతుంది. దీంతో అప్పూని ఆపడానికి తనపై బలవంతంగా ఒట్టు వేయించుకుంటుంది కనకం. ఆ తర్వాత కృష్ణ మూర్తి కూడా అప్పూకి సర్ది చెప్తాడు.

తగ్గేదేలే అంటోన్న రాజ్..

ఈ సీన్ కట్ చేస్తే.. రాజ్ లాయర్‌తో మాట్లాడతాడు. అప్పుడే కావ్య వచ్చి మీరు కూడా పంతానికే పోతున్నారా? ఇలాంటి విషయాల్లో మీరు ఆలోచించి అడుగు వేస్తారు కదా? అని అడుగుతుంది. ఏ నేనే మన్నా దేవుడినా.. మామూలు మనిషినే కదా.. ఏం చేయమంటావ్? రాజీకి వెళ్లాలా? కళ్యాణ్‌ని తన కాళ్ల దగ్గరకు రప్పించుకుంటానని అంది. కళ్యాణ్‌ని పంపించాలా? అని రాజ్ అంటాడు. లేదండి పెద్ద మనుషులను పంపించి సర్ది చెప్పిద్దామని కావ్య అంటే.. రాజ్ ఒప్పుకోడు. కావాలనే ఇప్పుడు కళ్యాణ్ పై కేసు పెట్టింది. అలాంటి దాన్ని క్షమించే ప్రసక్తే లేదని రాజ్ అంటాడు. ఆ నెక్ట్స్ అపర్ణ కూడా వచ్చి కావ్య చెప్పిన దానిలో అర్థం ఉందని అంటుంది. అనామిక ఏం అనుకుంటుందో నాకు పూర్తిగా అర్థమైంది. ఈ ఇల్లే ప్రపంచం అనుకుని బ్రతికింది. ఇంటి గుట్టు బయట పెట్టలేదు. కానీ అనామిక వీటిల్లో ఏదన్నా చేయగలదా? అని రాజ్ ధైర్యంగా ఉంటాడు.

ఇవి కూడా చదవండి

రాహుల్, రుద్రాణిల ఆనందం.. మరో ప్లాన్‌కి సిద్ధం..

ఈ సీన్ కట్ చేస్తే.. రుద్రాణి, రాహుల్‌లు నవ్వుతూ ఉంటుంది. అనామిక ఇంత పిచ్చిది అనుకోలేదు. దాని వల్ల మనకు వచ్చే లాభం ఏంటి మామ్ అని రాహుల్ అడుగుతాడు. ఆ పిచ్చిది మొగుడిని అరెస్ట్ చేయిస్తే.. భయ పడిపోయి.. దాని కాళ్ల దగ్గరకు వస్తాడు అనుకుంటుంది. కానీ ఇంత గొడవ జరిగిన తర్వాత విడాకులు ఇస్తాడని తెలుసుకోలేక పోతుంది. ఈ విషయంలో మనం మరింత హెల్ప్ చేద్దాం. మన వాళ్లు అందరూ రేపు కోర్టులో అడుగు పెట్టగానే.. వాళ్ల చుట్టూ మీడియా వాళ్లు అందరూ కలిసి ప్రశ్నల మీద ప్రశ్నలు అడగాలని రుద్రాణి మరో ప్లాన్ వేస్తుంది.

దుగ్గిరాల ఫ్యామిలీని టార్గెట్ చేసిన మీడియా..

ఇక తెల్లవారుతుంది. కోర్టు దగ్గర మహిళా సంఘాలు అన్నీ పోగయ్యి.. కళ్యాణ్ డామ్ డామ్ అని అంటారు. అప్పుడే మీడియా కూడా కవరేజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే రాజ్, కావ్య ధాన్య లక్ష్మి, ప్రకాశం, రుద్రాణి, రాహుల్‌లు కోర్టుకు వస్తారు. రాజ్ ఫ్యామిలీని చూసిన మీడియా వాళ్లు వెంటనే అక్కడకు వెళ్తారు. రాజ్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తారు. సర్.. మీ తమ్ముడు కళ్యాణ్.. అనామికను విడాకుల కోసం టార్చర్ చేశారంటా నిజమేనా? మరో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంట.. ఇప్పుడు మీరు మీ తమ్ముడిని కాపాడటానికి వచ్చారా? అంటూ ఏవోవే ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. దీంతో రాజ్, కావ్యలు సమాధానం చెప్తారు. అప్పుడే కళ్యాణ్ కోర్టుకు వస్తాడు. కళ్యాణ్‌ని చూసి ధాన్య లక్ష్మి, ప్రకాశంలు బాధ పడతారు. ఆ తర్వాత కళ్యాణ్‌పై ఎటాక్ చేస్తారు మీడియా వాళ్లు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో మళ్లీ కలుద్దాం. అప్పుడే పొగరు బోతు అనామిక వచ్చి ఛాలెంజ్ విసురుతుంది.

జూలై 5 లేదా 6 జ్యేష్ట అమావాస్య ఎప్పుడు పితృ దేవతలను ఇలా పూజించండి
జూలై 5 లేదా 6 జ్యేష్ట అమావాస్య ఎప్పుడు పితృ దేవతలను ఇలా పూజించండి
ఇదేందిది.. రోడ్డుపై రయ్యిమని వచ్చి.. అడ్డంగా బుక్కై ఒక్కటే ఏడుపు.
ఇదేందిది.. రోడ్డుపై రయ్యిమని వచ్చి.. అడ్డంగా బుక్కై ఒక్కటే ఏడుపు.
బీజేపీ అగ్రనేత అద్వానీకి మళ్ళీ అస్వస్థత అపోలో ఆసుపత్రిలో చికిత్స
బీజేపీ అగ్రనేత అద్వానీకి మళ్ళీ అస్వస్థత అపోలో ఆసుపత్రిలో చికిత్స
హమ్మయ్య..! దిగివచ్చిన పసిడి ధరలు.. తులంపై ఎంత తగ్గిందంటే..
హమ్మయ్య..! దిగివచ్చిన పసిడి ధరలు.. తులంపై ఎంత తగ్గిందంటే..
వర్షాకాలంలో వంట గదిని ఇలా శుభ్రం చేస్తే దుర్వాసన, పురుగులు ఉండవు!
వర్షాకాలంలో వంట గదిని ఇలా శుభ్రం చేస్తే దుర్వాసన, పురుగులు ఉండవు!
Horoscope Today: ఆ రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
Horoscope Today: ఆ రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
ఎల్‌కే అద్వానీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
ఎల్‌కే అద్వానీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
పిఠాపురంలో 3 ఎకరాలు కొన్నా.. ఇక నుంచి ఇదే నా ఇల్లు
పిఠాపురంలో 3 ఎకరాలు కొన్నా.. ఇక నుంచి ఇదే నా ఇల్లు
కల్కి పార్ట్ 2లో ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసిన నాగ్ అశ్విన్..
కల్కి పార్ట్ 2లో ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసిన నాగ్ అశ్విన్..
గ్యాస్‌ నొప్పిని చిటికెలో మాయం చేసే అద్భుత చిట్కా..
గ్యాస్‌ నొప్పిని చిటికెలో మాయం చేసే అద్భుత చిట్కా..