Brahmamudi, February 13th episode: కావ్యను ‘జీవితంలో నుంచి తప్పుకోమన్న’ రాజ్.. అనామిక దొంగ అన్న అపర్ణ!

ఈ రోజు బ్రహ్మముడి సీరియల్‌లో.. నా పర్మిషన్ లేకుండా క్లయింట్స్‌తో ఎందుకు మీటింగ్ అటెండ్ చేశావు అని రాజ్.. కావ్యపై సీరియస్ అవుతాడు. ఎవరి పర్మిషన్ తీసుకుని నేను మీటింగ్ అటెండ్ చేయాలి. మీరు సరదాగా బయట తిరగడానికి వెళ్లారు కదా.. నేను అప్పటికీ మీకు కాల్ చేశాను లిఫ్ట్ చేయలేదు. పరువు పోతుందేమో అని మావయ్య గారు టెన్షన్ పడ్డారు. నన్ను మీటింగ్ అటెండ్ చేయమన్నారు. అందుకే చేశాను అని కావ్య చెబుతుంది. నిన్ను నేను ఎలాగో వదిలేస్తున్నాను కాబట్టి..

Brahmamudi, February 13th episode: కావ్యను 'జీవితంలో నుంచి తప్పుకోమన్న' రాజ్.. అనామిక దొంగ అన్న అపర్ణ!
Brahmamudi
Follow us

|

Updated on: Feb 13, 2024 | 11:41 AM

ఈ రోజు బ్రహ్మముడి సీరియల్‌లో.. నా పర్మిషన్ లేకుండా క్లయింట్స్‌తో ఎందుకు మీటింగ్ అటెండ్ చేశావు అని రాజ్.. కావ్యపై సీరియస్ అవుతాడు. ఎవరి పర్మిషన్ తీసుకుని నేను మీటింగ్ అటెండ్ చేయాలి. మీరు సరదాగా బయట తిరగడానికి వెళ్లారు కదా.. నేను అప్పటికీ మీకు కాల్ చేశాను లిఫ్ట్ చేయలేదు. పరువు పోతుందేమో అని మావయ్య గారు టెన్షన్ పడ్డారు. నన్ను మీటింగ్ అటెండ్ చేయమన్నారు. అందుకే చేశాను అని కావ్య చెబుతుంది. నిన్ను నేను ఎలాగో వదిలేస్తున్నాను కాబట్టి.. మా ఇంటి డాడీ దగ్గర నీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించి సింపతీ కొట్టేయాలని అనుకున్నావా. మా ఫ్యామిలీని నీ వైపుకు తిప్పుకుని.. విడాకులు ఇవ్వకుండా డ్రామాలు ఆడదామనా అని రాజ్ అంటాడు. దీంతో కావ్య మర్యాదగా మాట్లాడండి. అలాంటి చీప్ క్యారెక్టర్ నాది కాదు అని అంటుంది.

నిన్ను ఎప్పటికీ భార్యగా ఒప్పుకోను: రాజ్

నా వెనకాలే స్పైలా ఫాలో అయి వచ్చి ఏం విన్నావో మర్చిపోయావా.. శ్వేతకు తన భర్త నుండి త్వరలోనే విడాకులు వస్తాయి. వెంటనే నేను నీకు విడాకులు ఇచ్చి.. తొందరలోనే పెళ్లి చేసుకుంటాం. అప్పుడేం చేస్తావో నేనూ చూస్తాను. నేనేదో మారతానని.. శ్వేతను నా నుంచి దూరం చేయాలని నువ్వు ఆఫీస్‌లో చేరావని నాకు తెలుసు. కానీ నీ నమ్మకం వృథా అవుతుంది. నేను మారను. నేను ఇంతే. నిన్ను ఎప్పటికీ భార్యగా ఒప్పుకోను. మెదడుకు ఎక్కిందా. మనసు విరిచేసుకో.. నా జీవితం నుంచి తప్పుకో.. వెళ్లిపో అని కర్కశంగా మాట్లాడతాడు రాజ్. దీంతో ఏడుస్తూ వెళ్లిపోతుంది కావ్య.

నువ్వు చేస్తుంది తప్పు రాజ్.. నచ్చజెప్పిన శ్వేత..

ఇంతలో శ్వేత రాజ్ దగ్గరికి వస్తుంది. అసలు నువ్వు ఇంత కర్కశంగా ఎలా మాట్లాడుతున్నావ్ రాజ్. నాకే నిన్ను కొట్టాలని ఆవేశం వచ్చింది. ఆ అమాయకురాలి గుండె పగిలిపోయేలా ఎలా మాట్లాడావ్? ఇంకా ఎంత బాధ పెడతావ్? ఒక అమ్మాయి మనసు ఇంత దారుణంగా ముక్కలు చేస్తే తాను ఎంత బాధ పడుతుందో తెలుసా.. అని శ్వేత అడుగుతుంది. దూరం అయిపోతుంది.. అలా అయినా తను నా జీవితంలో నుంచి దూరం అవుతుంది. నన్ను పెళ్లి చేసుకుని కళావతి సుఖ పడింది లేదు. వెళ్లి పోయాకైనా బాధ పడకూడదు. నా లాంటి వాడితో కలిసి ఉండటంలో కలిసి ఉండటం కన్నా.. విడిపోవడమే మంచిది అనుకోవాలి. ఆమెకు నా మీద మనసు విరిగి పోవాలి. అందుకే నాకు నచ్చకపోయినా.. నేను ఇలా మాట్లాడుతున్నా.

ఇవి కూడా చదవండి

కళావతి నా జీవితం లోనుంచి వెళ్లిపోవాలి.. అదే నా ప్లాన్: రాజ్

ఇంతలో ఏడ్చుకుంటూ వెళ్లిన కావ్య.. నేనేంటి ఆయన వెళ్లిపొమ్మంటే వెళ్లి పోతున్నా.. వెళ్లి నిలదీసి.. కడిగి పారేస్తా అని వస్తుంది. ఇంతలో రాజ్, శ్వేతలు మాట్లాడుకునేది వింటుంది. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అబద్ధం చెప్తే అయినా కళావతి నా జీవితం నుంచి తప్పుకుంటుందని నమ్మకం అని రాజ్ అంటే.. తప్పు రాజ్.. పాపం.. నేనే కర్మ కాలి ఒక రాక్షసుడి నుంచి విముక్తి పొందడానికి విడాకులు తీసుకున్నా. మీరిద్దరూ విడిపోవడానికి నన్ను అడ్డం పెట్టుకుంటావ్ ఏంటి? నాకు చాలా బాధగా ఉంది. నా గురించి నీ భార్య ఎంత తప్పుగా అనుకుంటుందని శ్వేత అంటుంది. ఏమైనా అనుకోని శ్వేత.. అందుకే మన స్నేహాన్ని వాడుకుని ఆమెతో అబద్ధం చెప్పాను. ఇంక కళావతి నా జీవితంలోకి అడుగు పెట్టదు. నాకు కావాల్సింది అదే అని రాజ్ గట్టిగా చెప్తాడు. ఇలా రాజ్, శ్వేతలు మాట్లాడుకున్నది మొత్తం కావ్య వినేస్తుంది. అయితే రాజ్ ఇలా మాట్లాడటం వెనుక ఏదో పెద్ద కారణమే ఉందని అనిపిస్తుంది.

అపర్ణను ఎదిరించమని అనామికకు చెప్పిన రుద్రాణి..

అపర్ణను ఎదిరించమని అనామికకు చెబుతుంది రుద్రాణి. మా అత్తనే పట్టించుకోవడం లేదు. నన్ను కరివేపాకును తీసి పాడేసినట్టు పాడేస్తుందని అనామిక అంటుంది. ఇలా రుద్రాణి, అనామికలు మాట్లాడుకుంటూ ఉంటారు. అపర్ణ బయటకు వస్తుంది. ఇంతలో సంపత్ అనే ఎంప్లాయ్ వస్తాడు. ఇంటి నుంచి ఓ రూ.5 లక్షలు తీసుకురమ్మన్నారు. లాకర్‌లో పెట్టారంట అని అతను చెప్పగా.. అవును నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను వెళ్లి తీసుకువస్తాను అని వెళ్తుంది అపర్ణ. లాకర్ తెరిచి చూడగా.. అందులో మూడు లక్షలే ఉంటుంది. అందేంటి ఐదు లక్షలు అన్నారు కదా అని ఎవరు తీసి ఉంటారు అని అపర్ణ అనుమాన పడుతుంది. బయటకు వచ్చి ఈ మూడు లక్షలు ఇవ్వు.. మిగతా రెండు లక్షలు అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాను అని చెబుతుంది. అప్పుడే ధాన్యలక్ష్మి వస్తుంది.

కావ్యను దొంగ అన్న ధాన్య లక్ష్మి:

ఏమైంది వదినా.. అన్నయ్యా ఐదు లక్షలు అని అన్నాడుగా.. మూడు లక్షలే ఇస్తున్నావ్ అని అడుగుతుంది. మిగతా రెండు లక్షలు కనిపించడం లేదని అపర్ణ అంటుంది. ఇంకెవరు తీస్తారు.. దొంగ చేతికి తాళాలు ఇచ్చారు కదా అని ధాన్య లక్ష్మి అంటుంది. తొందర పడి మాట జారకు ధాన్య లక్ష్మి అని అపర్ణ అంటుంది. ఇలా తాళాలు చేతికి ఇచ్చిందో లేదో.. అలా పట్టుకు వెళ్లి పోయింది నీ కోడలు అని ధాన్య లక్ష్మి అంటుంది. కావ్య ఈ ఇంటి పెద్ద కోడలు అవసరం అయి తీసుకుందేమో. అయితే ఏం అంటున్నావ్ ధాన్య లక్ష్మి అనుమానం లేకుండా కావ్యే ఖచ్చితంగా ఈ డబ్బులు తీసింది అంటావా అని అపర్ణ అడుగుతుంది.

అనామిక దొంగతనం చేసిందేమో అన్న అపర్ణ..

మరి తాళాలు ఇచ్చింది నీ కోడలికే కదా అని ధాన్య లక్ష్మి చెప్తుంది. అవునా మరి ఇందాక తాళాలు ఇచ్చింది నీ కోడలే కదా. అది విన్న అనామిక షాక్ అవుతుంది. తాళాలు దొరగ్గానే వెళ్లి రెండు లక్షలు తీసేసుకుందని నేనూ ఆరోపించాలి కదా.. కానీ నేను అలా మాట్లాడలేదు కదా అని అపర్ణ అంటుంది. నా కోడలికి ఆ అవసరం లేదు. నీ కోడలికి పుట్టిల్లు ఉంది అని ధాన్య లక్ష్మి అంటే.. అపర్ణ కూడా సేమ్ అలాగే రివర్స్ సమాధానం ఇస్తుంది. ఏది ఏమైనా.. కావ్య రావాలి. వచ్చాక అడిగాక అప్పుడు తెలుస్తుంది అని చెప్పి అపర్ణ వెళ్లి పోతుంది. ఈలోపు టెన్షన్ పడుతుంది అనామిక.

కావ్యపై ప్రేమ చూపిస్తూ.. లేదంటోన్న రాజ్..

ఆ తర్వాత కావ్య కారులో ఇంటికి వెళ్తూ ఉంటుంది. మధ్యలో కారు ఆగిపోతుంది. ఇంతలో రాజ్ అటువైపుగా వస్తాడు. కావ్య కారు ఆగడం చూసి ఆగుతాడు. డ్రైవర్‌ను తిట్టి.. కావ్యను కారు ఎక్కమంటాడు. కానీ కావ్య అస్సలు పట్టించుకోదు. వదిలేస్తున్న వాళ్లకు.. నా గురించి ఎందుకు? అందుకే నా దారి నేను చూసుకుంటున్నా. అయినా నేను నా పుట్టింటికి వెళ్తాను. సరే అయితే పదా పుట్టింట్లోనే దింపేస్తాను అని చెప్తాడు రాజ్. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్‌ ముగుస్తుంది.