Brahmamudi, February 14th episode: రాజ్ జీవితం నుంచి తప్పుకుంటానన్న కళావతి.. కావ్య దొంగ అన్న ధాన్యం

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్యను పుట్టింటి దగ్గర దింపుతాడు రాజ్. లోపలికి రమ్మని కనకం, కృష్ణమూర్తిలు అడిగితే రాజ్, కావ్యలు పొంతన లేని సమాధానాలు చెప్తారు. దీంతో అక్కడ ఏదో జరిగిందని కనకం, కృష్ణమూర్తిలు అనుమానిస్తారు. రాజ్‌పై కావాలనే సెటైర్లు వేస్తుంది అప్పూ. ఆ తర్వాత రాజ్ వెళ్లిపోతాడు. మరోవైపు కావ్య దగ్గరకు వెళ్లిన అప్పూ.. ఏమైంది అక్కా.. ఏం జరిగింది అని అడుగుతుంది. ఆ తర్వాత కనకం కూడా అడుగుతుంది. ఆయన మాటలే కాదమ్మా..

Brahmamudi, February 14th episode: రాజ్ జీవితం నుంచి తప్పుకుంటానన్న కళావతి.. కావ్య దొంగ అన్న ధాన్యం
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Feb 14, 2024 | 1:32 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్యను పుట్టింటి దగ్గర దింపుతాడు రాజ్. లోపలికి రమ్మని కనకం, కృష్ణమూర్తిలు అడిగితే రాజ్, కావ్యలు పొంతన లేని సమాధానాలు చెప్తారు. దీంతో అక్కడ ఏదో జరిగిందని కనకం, కృష్ణమూర్తిలు అనుమానిస్తారు. రాజ్‌పై కావాలనే సెటైర్లు వేస్తుంది అప్పూ. ఆ తర్వాత రాజ్ వెళ్లిపోతాడు. మరోవైపు కావ్య దగ్గరకు వెళ్లిన అప్పూ.. ఏమైంది అక్కా.. ఏం జరిగింది అని అడుగుతుంది. ఆ తర్వాత కనకం కూడా అడుగుతుంది. ఆయన మాటలే కాదమ్మా.. ఆయన ప్రవర్తన కూడా అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగింది అమ్మా అని కృష్ణ మూర్తి అడుగుతాడు. తన కూతురి జీవితంలో ఏదైతే వినకూడదని తల్లిదండ్రులు అనుకుంటారో.. ఆ మాటే వినాల్సి వచ్చిందమ్మా అని చెబుతూ బోరున ఏడుస్తుంది కావ్య. కళావతి ఏడవడంటో కనకం, కృష్ణ మూర్తి, అప్పూ బాధ పడతారు.

వేరే అమ్మాయితో తిరుగుతున్నారన్న కావ్య.. షాక్‌లో కనకం కుటుంబం..

నువ్వు ఏడుస్తున్నావా.. ఎంత కష్టం వచ్చినా తట్టుకునే నువ్వు.. ఏడుస్తున్నావంటే ఏదో జరగ రానిది జరిగింది. అసలు ఏమైంది అమ్మా చెప్పు అని కృష్ణమూర్తి అడుగుతాడు. ఆయన ఇంకో అమ్మాయితో తిరుగుతున్నారు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. నాకు విడాకులు ఇస్తాను అన్నారమ్మా అని ఏడుస్తుంది. ఆ ఇంట్లో ఇప్పుడు ఒంటరి దాన్ని అయిపోయాను అని ఏడుస్తూ కావ్య చెప్తుంది. కావ్య మాటలకు అందరూ షాక్ అవుతారు. బావ అందరి లాంటి మగాడు కాదనుకున్నా.. కానీ మగ బుద్ధి చూపించాడు. అయినా నువ్వు ఈ విషయం గురించి అడిగావా అని అడుగుతుంది అప్పూ. నమ్మకం లేదని కావ్య అంటుంది. వెంటనే వెళ్లి బావను నిలదీస్తాను. అందరి ముందూ తను చేసిన తప్పును నిలదీస్తాను అని కోపంతో అప్పూ అంటుంది. దీంతో అప్పూని కనకం వారిస్తుంది. మెల్లగా మన దారికి తెచ్చుకోవాలి అంటుంది.

ఆయన అసలు నాతో కలిసి ఉండాలి అనుకోవడం లేదు: కావ్య

అప్పూ వినిపించుకోకుండా ఆవేశ పడుతుంది. అక్కను మోసం చేశాడు కాబట్టి.. ఆ తప్పును అందరి ముందూ బయట పెడతాను. అవసరం అయితే కోర్టుకు లాగుతాను.. శిక్ష వేయాలి అని అప్పూ అంటుంది. నాకు కూడా నీలాగే కోపం వచ్చింది. కానీ ఆయన నిజంగానే మరో అమ్మాయితో తిరగడం అబద్ధం. నన్ను నమ్మించి.. నా నుంచి విడిపోవాలి అనుకుంటున్నారు అని అంటుంది. అసలు ఆయన నాతో కలిసి ఉండాలి అనుకోలేదు. అవకాశం దొరికితే విడిపోవాలి అనుకున్నారు. ఆయన నా నుంచి విడిపోవాలి అనుకుంటున్నారని చెప్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నావే అని కనకం అడుగుతుంది.

ఇవి కూడా చదవండి

కావ్య డబ్బులు తీసేసిందని.. ధాన్య లక్ష్మి రాద్ధాంతం..

ఈ సీన్ కట్ చేస్తే.. సుభాష్, రాజ్, ప్రకాష్‌లు ఇంటికి చేరుకుంటారు. వాళ్లను చూడగానే ధాన్యలక్ష్మి గొడవ మొదలు పెడుతుంది. ఈ ఇంటి పెద్ద కోడలికి మీ అమ్మ కీర్తి కిరీటం పెట్టింది. మన ఇంటి మహా లక్ష్మి అని కావ్య కోసం అత్తయ్య ఓ సింహాసనం వేసింది అంటూ వెటకారం చేస్తుంది. ఇంటి తాళాలు ఇచ్చి ఎంత సేపు కూడా కాలేదు.. అప్పుడే దొంగ బుద్ధి చూపించిందని ధాన్య లక్ష్మి అంటుంది. ఏమైంది నీకు అంత వెటకారంగా మాట్లాడుతున్నావేంటి.. అని ప్రకాష్ అడుగుతాడు.

కావ్యను దొంగ అన్నందుకు సీరియస్ అయిన రాజ్..

దీంతో ఏం జరిగిందో చెప్పు పిన్నీ అని రాజ్ అడుగుతాడు. ఏమీ లేదు రాజ్.. మార్నింగ్ మీ అమ్మ లాకర్ కీస్ ఇచ్చింది. తనేమో ఎవరికీ చెప్పకుండా రెండు లక్షలు తీసుకుని వెళ్లింది అని రుద్రాణి అంటుంది. ఇంట్లో నుంచి రెండు లక్షలు తీసుకెళ్లిన మనిషి ఏమనాలి మీరే చెప్పండి అని ధాన్య లక్ష్మి రాద్ధాంతం చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావ్ పిన్నీ.. కళావతికి రెండు లక్షలు తీసుకెళ్లాల్సిన పని ఏంటి? అని రాజ్ అడుగుతాడు. సుభాష్, ప్రకాష్‌లు షాక్ అవుతారు. ఆ రెండు లక్షల కోసమా ఇంత రాద్ధాంతం. ఏదో అవసరం ఉందేమో అందుకే తీసుకెళ్లింది అని సుభాష్ అంటాడు. ఆ అవసరం ఏంటో తెలుసుకోవాలి బావగారు. లేదంటే ఇలా విచ్చల విడిగా డబ్బు తీసుకెళ్తే.. అందరికీ అలవాటుగా మారిపోతుంది. అసలు ఎక్కడికి వెళ్లింది అని ధాన్య లక్ష్మి అడుగుతుంది. పుట్టింటికి వెళ్లిందని రాజ్ చెప్తాడు.

కావ్యపై దొంగ అనే ముద్ర వేడయం సరి కాదు: రాజ్

ఇప్పుడు అంత అర్జెంట్‌గా అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఈ డబ్బును అక్కడ దోచి పెట్టడానికి వెళ్లిందని ధాన్య లక్ష్మి అంటుంది. పిన్నీ.. నాకు సంస్కారం నేర్పేదానివి.. నువ్వు సంస్కారం వదిలేసి మాట్లాడతావేంటి? తన పుట్టింటికి అవసరం వస్తే.. తన అత్తింటి నుంచి డబ్బు తీసుకెళ్లి ఇస్తే అది తప్పు ఎలా ఉంటుంది? మా బెడ్ రూమ్‌లో కావాల్సినంత డబ్బు పెట్టాను. కానీ ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా తీయలేదు. ఇప్పుడు ఏదో అవసరం ఉండి స్వతంత్రంగా డబ్బు తీసుకుంటే తప్పేంటి? ఇంత మందిలో కళావతి పరువు తీసి.. దొంగ అని ముద్ర వేయాలా అని సీరియస్ అవుతాడు రాజ్. ఏంటి మమ్మీ నువ్వేం మాట్లాడవేంటి? అని రాజ్ అడిగితే.. ఆవిడ గుర్రం ఎక్కింది. దానికి పగ్గాలు లేవు. అడ్డదిడ్డంగా వెళ్తోంది అని అపర్ణ సీరియస్ అవుతుంది. ఈ సారి ఎవరు ఏం అనుకున్నా.. నిజ నిజాలు బయట పడాల్సిందే. చేసిన దొంగతనం అందరి ముందూ రుజువు చేయాల్సిందే అని ధాన్య లక్ష్మి తగ్గదు. నోరు మూయ్.. ఇంటి కోడల్ని దొంగ అన్నావంటే మర్యాదగా ఉండదు. నువ్వు నా పర్సు నుంచి డబ్బు తీసే దానివి కదా.. అలా అయితే నువ్వు కూడా దొంగవే కదా అని ప్రకాష్ అంటాడు. ధాన్య లక్ష్మి మాట్లాడిన దాంట్లో తప్పేం ఉంది? అని రుద్రాణి అంటుంది.

ధాన్య లక్ష్మికి వార్నింగ్ ఇచ్చిన సుభాష్..

నా భార్యను దొంగ అనడం తప్పు. కళావతిని అడిగే అధికారం ఈ ఇంట్లో ఎవరికీ లేదు అని చెప్పి కోపంగా వెళ్లిపోతాడు రాజ్. అయినా ధాన్య లక్ష్మి అస్సలు తగ్గదు. తమ్ముడి భార్యని మందలించడం తప్పు కాబట్టి.. నేను మర్యాదగానే చెప్తున్నా. అనుమానం ఎక్కువైతే మాత్రం.. మా పెద్దరికం జోక్యం చేసుకోవాల్సి వస్తుంది అని సుభాష్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు.

ఆయన జీవితం నుంచి తప్పుకుంటాను: కావ్య

ఈ సీన్ కట్ చేస్తే.. బాధతో కుమిలిపోతూ ఉంటుంది కావ్య. బావని కడిగి పారేస్తానని వెళ్తుంది అప్పు. ఆయన మనసులోనే నేను లేనప్పుడు.. ఏం చేసినా ఏం లాభం అని అంటుంది కావ్య. అక్కా నువ్వెందుకు ఏడుస్తున్నావ్.. స్పప్న అక్కని చూసి నేర్చుకోవచ్చు కదే. అది తప్పు చేసి కూడా మోసం చేసిన వాడికి బుద్ధి చెప్పి పెళ్లి చేసుకుంది. నువ్వు ఏ తప్పూ బావ వదిలేస్తాను అంటే.. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడుగుతుంది. భర్త మనసులో భార్యకు స్థానం లేనప్పుడూ.. ఏ చట్టాలూ ప్రేమను పుట్టించలేవు అని అంటుంది కావ్య. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావ్ అమ్మా.. అని కనకం అడుగుతుంది. ఆయన జీవితం నుంచి తప్పుకుంటాను అని కావ్య చెప్తుంది. తప్పుకుని.. తప్పు నీ మీద వేసుకుంటావా.. అని అప్పుడే ఇందిరా దేవి ఎంట్రీ ఇస్తుంది. పెద్దావిడను చూసి అందరూ షాక్ అవుతారు.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!