Jabardasth Pavithraa: త్వరలో పెళ్లనుకుంటే.. వేలంటైన్స్‌డే రోజే ప్రియుడికి బ్రేకప్‌ చెప్పిన జబర్దస్త్‌ పవిత్ర

బుల్లెట్‌ భాస్కర్, హైపర్ ఆది, మంకీ వెంకీ, రాఘవ టీమ్స్‌లో కంటెస్టెంంట్‌గా నవ్వుల పువ్వులు పూయించింది. అడపాదడపా కొన్ని సినిమాల్లోనూ కనిపిస్తోంది. టీవీ షోస్ సంగతి పక్కన పెడితే.. గతేడాది నవంబర్‌లో తన ప్రియుడితో గ్రాండ్‌ గా నిశ్చితార్థం చేసుకుంది పవిత్ర. పనిలో పనిగా తనకు కాబోయే భర్త అంటూ సంతోషన్‌ను అందరికీ పరిచయం చేసింది

Jabardasth Pavithraa: త్వరలో పెళ్లనుకుంటే.. వేలంటైన్స్‌డే రోజే ప్రియుడికి బ్రేకప్‌ చెప్పిన జబర్దస్త్‌ పవిత్ర
Jabardasth Pavithraa
Follow us
Basha Shek

|

Updated on: Feb 15, 2024 | 11:10 AM

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర కూడా ఒకరు. చూడ్డానికి బొద్దుగా కనిపించే లేడీ కమెడియన్ల తన పంచులతో బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరించింది. మొదట టిక్‌ టాక్‌ వీడియోలు, యూట్యూబ్‌లో షార్ట్‌ఫిల్మ్స్‌ చేసుకునే పవిత్ర జబర్దస్త్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బుల్లెట్‌ భాస్కర్, హైపర్ ఆది, మంకీ వెంకీ, రాఘవ టీమ్స్‌లో కంటెస్టెంంట్‌గా నవ్వుల పువ్వులు పూయించింది. అడపాదడపా కొన్ని సినిమాల్లోనూ కనిపిస్తోంది. టీవీ షోస్ సంగతి పక్కన పెడితే.. గతేడాది నవంబర్‌లో తన ప్రియుడితో గ్రాండ్‌ గా నిశ్చితార్థం చేసుకుంది పవిత్ర. పనిలో పనిగా తనకు కాబోయే భర్త అంటూ సంతోషన్‌ను అందరికీ పరిచయం చేసింది. త్వరలోనే వీరిద్దరూ మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడతారని అందరూ భావించారు. అయితే ఎవరూ ఊహించని ట్విస్ట్‌ ఇచ్చింది పవిత్ర. వాలెంటైన్స్‌ డే రోజునే తన ప్రియుడు సంతోష్‌కు బ్రేకప్‌ చెప్పేసి అందరికీ షాకిచ్చింది. ఈ విషయాన్ని పవిత్రనే సోషల్‌ మీడియా ద్వారా అందరితో పంచుకుంది.

‘మా శ్రేయోభిలాషులందరికీ ఒక విషయం చెబుదామనుకుంటున్నాను. సంతోష్, నేను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. మా ఇద్దరి పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. మా మార్గాలు వేరుగా ఉన్నా.. మేము పంచుకున్న క్షణాలు మాత్రం మా జీవితంలో చాలా ప్రత్యేకం. మా వ్యక్తిగత ప్రయాణాల్లో ఇద్దరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాను. ఈ కఠిన పరిస్థితుల్లో మాకు మీ మద్దతు ఉంటుందనుకుంటున్నాను. అదే సమయంలో మాకు కొంచెం ప్రైవసీ ఇవ్వాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం. మేము జీవితంలో ముందుకు సాగేందుకు మీ ప్రేమ, మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు’ అని తన పోస్ట్‌ లో రాసుకొచ్చింది పవిత్ర. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారింది. దీంతో అభిమానులు, నెటిజన్లు ఇద్దరికీ మంచి జరగాలని కోరుకుంటున్నారు. గతాన్ని వదిలేసి ముందుకు సాగాలంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా గతంలో సంతోష్ దిగిన ఫొటోలన్నింటినీ తన సామాజిక మాధ్యమాల అకౌంట్ల నుంచి తొలగించింది పవిత్ర.

ఇవి కూడా చదవండి

జబర్దస్త్ పవిత్ర ఎమోషనల్ పోస్ట్..

మెగాస్టార్ చిరంజీవితో జబర్దస్త్ పవిత్ర..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..