Tollywood: ఒకప్పుడు చిత్రం శ్రీనుకు మేకప్ వేసేవాడు.. ఆపై టాప్ యాక్టర్.. ఇప్పుడు సంచలన దర్శకుడు
నటుడు, దర్శకుడు వేణు యెల్దండి తన సినీ ప్రస్థానంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చిత్రం శ్రీను వద్ద టచప్ బాయ్‌గా, అసిస్టెంట్‌గా ప్రారంభమైన తన కెరీర్, రోజుకు కేవలం 50 రూపాయల జీతంతో సాగిందని వివరించారు. తోటివారితో అప్పటి, ఇప్పటి బంధాలను, నటుడిగా, దర్శకుడిగా మారిన తర్వాత వచ్చిన మార్పులను ఆయన ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.

ప్రముఖ నటుడు, బలగం సినిమా వేణు యెల్దండి తన సినీ ప్రస్థానంలోని కీలకమైన, ఆసక్తికరమైన అంశాలను గతంలో ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముఖ్యంగా, చిత్రం శ్రీను వద్ద తాను టచప్ బాయ్‌గా పనిచేసిన రోజుల నుంచి నటుడిగా ఎదిగిన తీరును వివరించారు. సినిమా రంగంలో అసిస్టెంట్ల నుంచి నటుడిగా, ఇప్పుడు దర్శకుడిగా మారిన తన ప్రయాణం అనేక అనుభవాలతో నిండి ఉందని ఆయన తెలిపారు. వేణు తన కెరీర్ ప్రారంభంలో కేవలం టచప్ బాయ్‌గా విధులు నిర్వహించేవాడని, మొదటి సినిమాలో రోజుకు 50 రూపాయలు, ఆ తర్వాత 75, 100 రూపాయల చొప్పున వేతనం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 2001 నుంచి 2002 మధ్య కాలంలో నెలకు 1000 రూపాయల జీతం తీసుకున్నానని, పెద్ద కంపెనీల్లో అయితే 100 రూపాయల రోజువారీ వేతనం కూడా ఇచ్చేవారని గుర్తుచేసుకున్నారు. చిత్రం శ్రీను దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్నప్పుడు, ఆయనకు తెలియకుండా డైరెక్టర్లతో, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లోని వారితో మాట్లాడి పాత్రల కోసం అడిగేవాడినని, నటన పట్ల ఉన్న ఆసక్తితోనే అలా చేసేవాడినని వేణు వివరించారు. అసిస్టెంట్‌గా ఉన్న సమయంలో.. ప్రొడక్షన్ టెక్నీషియన్లు, కెమెరా అసిస్టెంట్‌లు, తోటి అసిస్టెంట్‌లతో “ఒరేయ్, తోరేయ్” అని పిలుచుకునేంత స్నేహం ఉండేదని వేణు తెలిపారు. మణి అనే వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తుండగా, తాను చిత్రం శ్రీను వద్ద అసిస్టెంట్‌గా దాదాపు పది సినిమాల్లో కలిసి పని చేసినట్లు తెలిపాడు. అప్పుడు ఒకరినొకరు “ఒరేయ్, తోరేయ్” అని పిలుచుకున్న వారే, ఇప్పుడు వేణు నటుడిగా, దర్శకుడిగా మారిన తర్వాత “వేణు అన్నా”, “వేణు గారు” అని సంబోధిస్తున్నారని చెప్పారు. కొందరు ఈ మార్పును సహజంగా తీసుకోగా, మరికొందరు ఈగో ఫీల్ అయ్యేవారని, ఇంకొందరు వేణును ఆదర్శంగా తీసుకుని నటులుగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు.
నటుడిగా, దర్శకుడిగా మారిన తర్వాత కూడా పాత మిత్రులతో అదే అనుబంధాన్ని కొనసాగించేందుకు తాను ప్రయత్నిస్తానని, వారితో కలిసి దావత్‌లు, పార్టీలు చేసుకుంటానని వేణు చెప్పారు. అయితే, తన స్నేహితుల్లో కొందరు ఇప్పుడు తనను నటుడిగా చూస్తూ, ఆ గౌరవంతో వ్యవహరిస్తుంటారని, లొకేషన్లో తామిద్దరం అప్పటిలా చనువుగా ఉండటం బాగుండదని భావిస్తారని ఆయన వెల్లడించారు. కొందరితో అప్పటి చనువు ఇప్పటికీ ఉందని, కాలక్రమేణా గ్యాప్‌లు వచ్చినా, ఆ బంధాలు పూర్తిగా తెగిపోలేదని ఆయన వివరించారు. ఈ ప్రయాణం ద్వారా సినీ పరిశ్రమలో బంధాలు ఎలా పరిణామం చెందుతాయో వేణు తనదైన శైలిలో స్పష్టం చేశారు.
కాగా నటుడుగా కెరీర్‌కు గ్యాప్ ఇచ్చి బలగంతో దర్శకుడిగా సంచలన విజయం అందుకున్న వేణు.. త్వరలో తన మరో ప్రాజెక్ట్ ఎల్లమ్మతో ప్రేక్షకులను అలరించేందుకు కసరత్తులు చేస్తున్నాడు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




