AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guppedantha Manasu Jagati: భర్త గురించి ఆసక్తికర పోస్ట్ చేసిన జగతి మేడమ్.. కలిసి ఏడాది అయ్యిందంటూ..

ప్రస్తుతం వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ది ప్రెట్టీ గర్ల్ వెబ్ సిరీస్ చేస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఎంతగా వైరలయ్యాయో చెప్పక్కర్లేదు. అలాగే ఏ మాస్టర్ పీస్ అనే సినిమాలో జగతి మేడమ్ నటిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో దర్శకుడు సురేష్ కుమార్ (సుకు పుర్వాజ్)తో ప్రేమలో పడింది. గతేడాది వీరిద్దరు పెళ్లి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆరు నెలల్లోనే ప్రేమ, పెళ్లి వంటివి అన్ని జరిగిపోయినట్లుగా తెలుస్తోంది.

Guppedantha Manasu Jagati: భర్త గురించి ఆసక్తికర పోస్ట్ చేసిన జగతి మేడమ్.. కలిసి ఏడాది అయ్యిందంటూ..
Jyothi Rai
Rajitha Chanti
|

Updated on: Feb 13, 2024 | 7:00 AM

Share

గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి జగతి మేడమ్.. అలియాస్ జ్యోతిరాయ్. సంప్రదాయ చీరకట్టులో ఎంతో హుందాతనంతో.. సహజ నటనతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ కొన్నాళ్లుగా ఆమె పేరు నిత్యం వార్తలలో నిలుస్తుంది. లేటు వయసులో యువ దర్శకుడితో ప్రేమలో పడి అతడిని రెండో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆమె సోషల్ మీడియాలో ఎంత చురుకుగా ఉంటూ గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు షాకిచ్చింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ది ప్రెట్టీ గర్ల్ వెబ్ సిరీస్ చేస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఎంతగా వైరలయ్యాయో చెప్పక్కర్లేదు. అలాగే ఏ మాస్టర్ పీస్ అనే సినిమాలో జగతి మేడమ్ నటిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో దర్శకుడు సురేష్ కుమార్ (సుకు పుర్వాజ్)తో ప్రేమలో పడింది. గతేడాది వీరిద్దరు పెళ్లి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆరు నెలల్లోనే ప్రేమ, పెళ్లి వంటివి అన్ని జరిగిపోయినట్లుగా తెలుస్తోంది.

తన సోషల్ మీడియా ఖాతాలన్నింటిలోనూ తన భర్త ఇంటి పేరును తన పేరుగా మార్చుకుంది జ్యోతిరాయ్. ఇక ఇప్పుడు తన భర్త సురేష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా జ్యోతిరాయ్ చేసిన పోస్ట్ వైరలవుతుంది. అందులో తన భర్తపై ప్రేమను కురిపించింది. “నా జీవితం మొత్తం మారిపోయింది. నాకు ఎప్పుడు ఎంత ఆనందంగా ఉందనేది మాటల్లో చెప్పలేకపోతున్నాను. నాపై నువ్వు చూపిస్తున్న ప్రేమ, ఇచ్చే హగ్స్, కిస్సులు, సపోర్ట్, ఎంకరేజ్ మెంట్, నీ పాజిటివ్ థాట్స్.. ఇలా అన్నింటికి థాంక్స్. నీ సహనం నాపై చూపించే ప్రేమ, కేరింగ్, విధేయత ఇలా అన్నింటికీ థాంక్స్” అంటూ రాసుకొచ్చింది.

Jyothirai Post

Jyothirai Post

సురేష్ కుమార్ వల్ల తన జీవితం సంపూర్ణమైందని.. అతడు తన భర్తగా దొరకడం అదృష్టమని.. హ్యాప్పీ బర్త్ డే డార్లింగ్.. లవ్యూ అన్ కండీషనల్లీ అంటూ భర్తపై ప్రేమలు కురిపిస్తూ పోస్ట్ చేసింది జ్యోతిరాయ్. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. ఏడాదిలోనే ప్రేమ.. రెండో పెళ్లి.. అప్పుడే భర్తపై ఇంత ప్రేమా ? అంటూ షాకవుతున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.