Brahmamudi, February 12th episode: రాజ్‌కు షాక్ ఇచ్చిన కావ్య.. బెడిసికొట్టిన అనామిక ప్లాన్!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. శ్వేతకు డివోర్స్ రావడంతో.. పార్టీ చేసుకుందాం అని రాజ్, శ్వేతలు కారులో వెళ్తూ ఉంటారు. అయితే ఇంతలో ఆఫీస్‌లో క్లయింట్స్‌తో మీటింగ్ ఉందని కావ్య కాల్ చేస్తుంది. కానీ రాజ్ లిఫ్ట్ చేయడదు. మనల్ని చూసి కుళ్లుకుంటుంది. నాకు కావాల్సింది అదే అని అంటాడు. ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఏమో.. ఒకసారి లిఫ్ట్ చేయవచ్చు కదా అని శ్వేత చెప్పినా.. రాజ్ వినిపించుకోడు. మరోవైపు సుభాష్ క్లయింట్స్‌తో మీటింగ్ లేట్ అయిపోతూ ఉంటుందని..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. శ్వేతకు డివోర్స్ రావడంతో.. పార్టీ చేసుకుందాం అని రాజ్, శ్వేతలు కారులో వెళ్తూ ఉంటారు. అయితే ఇంతలో ఆఫీస్‌లో క్లయింట్స్‌తో మీటింగ్ ఉందని కావ్య కాల్ చేస్తుంది. కానీ రాజ్ లిఫ్ట్ చేయడదు. మనల్ని చూసి కుళ్లుకుంటుంది. నాకు కావాల్సింది అదే అని అంటాడు. ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఏమో.. ఒకసారి లిఫ్ట్ చేయవచ్చు కదా అని శ్వేత చెప్పినా.. రాజ్ వినిపించుకోడు. మరోవైపు సుభాష్ క్లయింట్స్‌తో మీటింగ్ లేట్ అయిపోతూ ఉంటుందని మండిపోతూ ఉంటాడు. ఇంతలో కళ్యాణ్‌ని పక్కకు తీసుకెళ్లి.. జరిగిన విషయం చెబుతుంది కావ్య. దీంతో కళ్యాణ్.. రాజ్‌కి కాల్ చేస్తాడు. చూశావా దాని డెత్ తెలివితేటలు.. తన కాల్ లిఫ్ట్ చేయలేదని నా తమ్ముడి ఫోన్ నుంచి చేస్తుంది. ఇప్పుడు దానికి మండేలా చేస్తాను చూడు అని కాల్ లిఫ్ట్ చేసి.. ఏంటి కుళ్లుబోతు శ్వేతతో పార్టీ చేసుకుంటానని తెలిసి తట్టుకోలేక.. మా తమ్ముడి ఫోన్ నుంచి చేస్తున్నావా అని అంటాడు.
షికారులో రాజ్.. సీరియస్ అయిన సుభాష్..
ఫోన్ చేసింది వదిన కాదు అన్నయ్యా.. నేను అని చెప్తాడు కళ్యాణ్. దీంతో రాజ్ షాక్ అవుతాడు. ఆ ముంద్ర వాళ్లతో మీటింగ్ పెట్టుకుని అడ్డదారిలో ఎక్కడికి వెళ్తున్నావ్? అన్నయ్యా అని చెప్తాడు కళ్యాణ్. అయ్యో అవును కదా.. వస్తున్న పది నిమిషాల్లో అక్కడ ఉంటా అని రాజ్ చెప్తాడు. దీంతో రాజ్ స్పీడుగా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాల. మరోవైపు శృతి వచ్చి.. సర్.. క్లయింట్స్ కంగారు పడుతున్నారు. ఈ డీల్‌కి సంబంధించిన అన్ని విషయాలూ కావ్యా మేడమ్‌కు తెలుసు సర్ అని చెప్తుంది. మరి ఈ విషయం ముందే చెప్పాలి కదా అని సుభాష్ ఫైర్ అవుతాడు. సర్‌కి తెలీకుండా ఇలా చేస్తే రాజ్ సర్‌కు కోపం వస్తుంది అని అంటుంది. ఏం పర్వాలేదు నేను చూసుకుంటా.. అని కావ్యని పిలుస్తాడు సుభాష్.
కాంట్రాక్ట్ సాధించిన కావ్య..
నీకు ఈ డీల్, డిజైన్స్ గురించి అంతా తెలుసంట కదా.. అయితే పదా వెళ్లి డెమో ఇవ్వు అని చెప్తాడు. కానీ కావ్య ఆలోచిస్తుంది. నేను ఉన్నాను కదా పదా అని తీసుకెళ్తాడు. క్లయింట్స్‌కి కావ్యను పరిచయం చేస్తాడు సుభాష్. ఆ తర్వాత డిజైన్స్ గురించి డీటైల్‌గా ఎక్స్ ప్లెయిన్ చేస్తుంది కావ్య. దీంతో క్లయింట్స్‌కి డిజైన్స్ అనేవి బాగా నచ్చుతాయి. దీంతో డీల్‌ను ఓకే చేస్తారు. అందరూ సంతోష పడతారు. అప్పుడే రాజ్ వస్తాడు. సర్ మీరు ఈ డీల్ మిస్ అయ్యారు. కానీ మీ మిస్సెస్ డెమో ఇచ్చి డీల్ ఓకే చేస్తారు అని చెప్పి ముంద్ర కంపెనీ వాళ్లు వెళ్తారు. ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టుకుని ఎక్కడికి వెళ్లావ్ రాజ్. సమయానికి కావ్య ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే మంచి కాంట్రాక్ట్ మిస్ అయిపోయేది. సరే కానీ ఇంతకూ ఈ అమ్మాయి ఎవరు? అని అడుగుతాడు సుభాష్. ఆ తర్వాత ప్రకాష్ కూడా ఎవరు ఈ అమ్మాయి అని అడుగుతాడు. శ్వేత గురించి చెప్పలేక నీళ్లు నములుతాడు రాజ్. ఇక్కడ కామెడీ ట్రాక్ అదిరిపోతుంది. ఇక ఉక్రోశంలో ఉన్న కావ్య.. మీ ఫ్రెండ్‌ని మీ క్యాబిన్‌కు తీసుకెళ్లి మర్యాదలు చేయండి అని చెప్తుంది. దీంతో రాజ్ కోపంగా చూస్తాడు.
అపర్ణను ఆడిపోసుకున్న ధాన్య లక్ష్మి..
ఈ సీన్ కట్ చేస్తే.. కావ్యను ఎలాగైనా బుక్ చేయాలని కంకణం కట్టుకుంటారు రుద్రాణి, అనామికలు. అనుకున్నట్టుగానే డబ్బులు కాజేస్తారు. ఆ తర్వాత లాకర్ తాళం తీసుకున్న అనామిక.. అపర్ణకు తీసుకెళ్లి.. ఇవి కావ్య అక్కకి మీరు ఇచ్చిన తాళం చెవిలే కదా పెద్ద అత్తయ్యా అని అడుగుతుంది. వాటిని చూసిన అపర్ణ షాక్ అవుతుంది. అవును నీ దగ్గరకి ఎక్కడి నుంచి వచ్చాయి అని అపర్ణ అడుగుతుంది. ఇందాక కావ్య అక్క బెడ్ రూమ్ ఉంది దొరికాయి అత్తయ్యా అని చెబుతుంది. మా అక్క బాగా దొరికిపోయింది అని సంతోష పడుతుంది ధాన్య లక్ష్మి. ఏం కోడలు.. ఇంటికి దీపం.. కంటికి రూపం.. నేల మీద నిలబడనిచ్చారా.. ఆవిడ మీద మాట పడనిచ్చారా.. ఆఫీస్‌కి వెళ్లి చక్రం తిప్పమన్నారే. ఇలాంటి కోడలు ఎక్కడా దొరుకుతుందా? పెత్తనం ఇచ్చి ఒక్క పూటైనా గడవలేదు.. అప్పుడే తాళాలను పడేసుకుందంటే.. అని దీర్ఘాలు తీస్తుంది ధాన్య లక్ష్మి.
ఈ ఇంటి పెత్తనం పెద్ద కోడలిదే అన్న అపర్ణ.. బెడిసికొట్టిన అనామిక ప్లాన్..
ఆ మాటలకు మండిపోతుంది అపర్ణ. అనుకున్నాను. నువ్వు ఇలాగే తిప్పుకుంటూ వస్తావని.. నీకు బాగా మేత దొరికినట్టు ఉంది కదా.. వెళ్లి నెమరేసుకో. దీర్ఘాలు తీసుకుంటూ వచ్చావేంటి? అసలు ఎగతాళికి అయితే అంతే లేదు. ఈ తాళాల రూంలో దొరికింది కదా. మా ఆయన ఎంతో ఇంపార్టెంట్ సమాచారాన్ని సేవ్ చేయమని చెప్తే.. మీ ఆయన ప్రకాశం.. అన్నీ డిలీట్ కొట్టి అయ్యో మర్చిపోయాను అన్నయ్యా.. అని నెత్తి కొట్టుకున్నప్పుడు నేను ఇంత దీర్ఘాలు తీయలేదే.. కొడుకు కోటీశ్వరుడు అని చెప్పుకుని కొడుకు.. పీటల మీద నుంచి లేవదీసుకు పోయినప్పుడు నేను ఇంత దీర్ఘాలు తీయలేదే. ఇక నువ్వు బ్యూటీ పార్లర్‌కి వెళ్లి అక్కడే పది తులాల హారాన్ని మర్చిపోయినప్పుడు.. నీకు ఇంకో హారం కొనిపెట్టాను కానీ.. ఇలా దీర్ఘాలు తీయలేదె. నా కోడలు తప్పు ఎప్పుడు దొరుకుతుందా అని.. ఎప్పుడు ఇరికించాలా అని పక్కనే కాచుకు కూర్చుని.. తయారైపోయావ్. నీకూ నీ కోడలికి.. ఆ పై నుంచి వినోదం చూస్తున్న వింత జీవికి.. ఇవాళ చాలా డిసపాయింట్ చేయబోతున్నా. పొరపాటున పడేసుకుందేమో కానీ.. నా కోడలు పొరపాట్లు చేసే మనిషి కాదు. ఇంటి పెత్తనం ఎప్పటికీ పెద్ద కోడిలదే కదా.. అని కావ్యను వెనకేసుకు వస్తుంది అపర్ణ. దీంతో ధాన్య లక్ష్మి, అనామిక, రుద్రాణిలు షాక్ అవుతారు. ఇప్పుడు నీకు అర్థం కాదు అక్కా.. అర్హత లేని వాళ్లను అందలం ఎక్కించుకున్నందుకు నువ్వే బాధ పడతావ్ అక్కా.. అని ధాన్యలక్ష్మి అంటే.. అయితే ఈ దీర్ఘాలు అన్నీ ఆ రోజు తీయి. అప్పటి వరకూ దాచి పెట్టుకో అని చెప్పేసి వెళ్తుంది అపర్ణ. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.