AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Career Astrology: ఈ రాశులకు విపరీత రాజయోగం..ఉద్యోగ పదోన్నతులు పక్కా..!

Vipareeta Raja Yoga 2026: జ్యోతిషశాస్త్రం ప్రకారం 6, 8, 12 స్థానాధిపతులు ఒకరి రాశిలో మరొకరు ఉన్నప్పుడు విపరీత రాజయోగం ఏర్పడుతుంది. ఈ స్థానాధిపతులు ఎవరి రాశుల్లో వారున్నా విపరీత రాజయోగం పడుతుంది. ఈ విపరీత రాజయోగం వల్ల ఉద్యోగంలో అధికార యోగం, ప్రముఖులతో సాన్నిహిత్యం, సంపన్నులు కావడం, విదేశీ అవకాశాలు లభించడం, పలుకుబడి పెరగడం, ప్రతిభాపాటవాలు వృద్ధి చెందడం వంటివి చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ప్రస్తుత గ్రహ సంచారం రీత్యా వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం రాశులకు ఈ యోగం పడుతోంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 11, 2026 | 7:35 PM

Share
వృషభం: ఈ రాశికి 12వ స్థానాధిపతి అయిన కుజుడు ఈ నెల 12వ తేదీ నుంచి జూన్ 20 వరకు 12వ స్థానంలోనే సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి విపరీత రాజయోగం కలిగింది. దీనివల్ల నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. ఆస్తి లాభం, భూలాభం కలుగుతుంది. సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

1 / 5
కర్కాటకం: ఈ రాశికి షష్ట స్థానాధిపతి అయిన గురువు 12వ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల జీవితం రాజసంతో సాగిపోతుంది. ప్రభుత్వపరంగా ఆశించిన గుర్తింపు లభిస్తుంది. రాజపూజ్యాలు కలుగు తాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. విదేశీ ఉద్యోగాలు లభిస్తాయి. విదేశీ సంబంధం ఖాయమవుతుంది. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. రియల్ ఎస్టేట్, వడ్డీ వ్యాపారం, లిక్కర్ వ్యాపారం వంటివి  బాగా సక్సెస్ అవుతాయి.

2 / 5
సింహం: ఈ రాశికి ఆరవ స్థానాధిపతి అయిన శనీశ్వరుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తున్నందు వల్ల వ్యక్తిగత జీవితంలో ఆకస్మిక శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. సగటు వ్యక్తి సైతం సంపన్నుడయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో బాగా ప్రాభవం పెరుగుతుంది. ఎటువంటి లక్ష్యమైనా విజయవంతంగా పూర్తవుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అనేక అవకాశాలు అంది వస్తాయి.

3 / 5
వృశ్చికం: ఈ రాశివారికి ఆరవ స్థానాధిపతి అయిన కుజుడు ఈ నెల 12 నుంచి ఆరవ స్థానంలోనే సంచారం చేస్తున్నందు వల్ల విపరీత రాజయోగం ఏర్పడింది. ఫలితంగా శత్రు, రోగ, రుణ బాధల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం ఉంటుంది. ఆదా యం కలిసి వస్తుంది. సంపద వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులకు ఏమాత్రం ఊహించని మంచి ఆఫర్లు అందుతాయి. విదేశీయాన సమస్యలు తొలగిపోతాయి.

4 / 5
మకరం: ఈ రాశికి 12వ స్థానాధిపతి అయిన గురువు ఆరవ ఉన్నందువల్ల విపరీత రాజయోగం కలిగింది. దీనివల్ల వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు లేదా యాజమాన్యాల నుంచి కనీవినీ ఎరుగని రీతిలో ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. అధికార యోగానికి లేదా పదోన్నతికి అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలం కావడం, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం కావడం జరుగుతుంది. శుభవార్తలు ఎక్కువగా వినే అవకాశం ఉంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

5 / 5
Follow Us