Brahmamudi, February 10th episode: శాడిస్ట్‌లా మారిన రాజ్.. రుద్రాణి కంటే డేంజర్‌లా తయారైన అనామిక!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. పై నుంచి కిందకు దిగుతాడు. ఫైల్ మీద సంతకం చేయలేదని అడుగుతాడు. అప్పుడే కావ్య కూడా వస్తుంది. ఆ నెక్ట్ అనామిక, కళ్యాణ్‌లు వస్తారు. కళ్యాణ్‌ని చూసిన ఇంట్లోని వాళ్లందరూ షాక్ అవుతారు. సూట్‌లోఅందంగా కనిపిస్తాడు కళ్యాణ్. నువ్వేనారా కళ్యాణ్.. పెన్ గన్‌లా మారినట్టు ఉంది అని రుద్రాణి అంటుంది. అబ్బా అచ్చం నా కొడుకు మేనేజింగ్ డైరెక్టర్‌లా ఉన్నాడు అని ధాన్య లక్ష్మి సంబరపడిపోతాడు. కళ్యాణ్ కూడా ఆఫీస్‌కు..

Brahmamudi, February 10th episode: శాడిస్ట్‌లా మారిన రాజ్.. రుద్రాణి కంటే డేంజర్‌లా తయారైన అనామిక!
Brahmamudi
Follow us

|

Updated on: Feb 10, 2024 | 11:45 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. పై నుంచి కిందకు దిగుతాడు. ఫైల్ మీద సంతకం చేయలేదని అడుగుతాడు. అప్పుడే కావ్య కూడా వస్తుంది. ఆ నెక్ట్ అనామిక, కళ్యాణ్‌లు వస్తారు. కళ్యాణ్‌ని చూసిన ఇంట్లోని వాళ్లందరూ షాక్ అవుతారు. సూట్‌లోఅందంగా కనిపిస్తాడు కళ్యాణ్. నువ్వేనారా కళ్యాణ్.. పెన్ గన్‌లా మారినట్టు ఉంది అని రుద్రాణి అంటుంది. అబ్బా అచ్చం నా కొడుకు మేనేజింగ్ డైరెక్టర్‌లా ఉన్నాడు అని ధాన్య లక్ష్మి సంబరపడిపోతాడు. కళ్యాణ్ కూడా ఆఫీస్‌కు వెళ్తున్నాడు అత్తయ్యా అని అనామిక చెప్తుంది. రేయ్ ఏంట్రా నువ్వు ఆఫీస్‌కి వస్తున్నావా.. నమ్మ లేక పోతున్నా అని రాజ్ అంటే.. మగవాళ్లు నమ్మలేని నిజాలన్నీ వాడి పెళ్లి అయ్యాకే చూస్తారు అన్నయ్యా అని కళ్యాణ్ అంటాడు. అవునూ నువ్వు మనస్ఫూర్తిగానే వస్తున్నావా అని రాజ్ అంటే.. ఏ రాకూడాదా.. నువ్వూ నీ భార్యే ఆఫీస్‌కి వెళ్లాలా అని ధాన్య లక్ష్మి కోపంగా అంటుంది. అది విన్న ఇంట్లోని వాళ్లందరూ ఆశ్యర్యపోతారు.

ఆఫీస్‌కి కళ్యాణ్.. ధాన్య లక్ష్మి రచ్చ..

ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడే అవసరం ఏం వచ్చింది. కవి గారూ కవిత్వం మీద తప్ప బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేదన్న సంగతి ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికీ తెలుసు. అందుకే మా ఆయన ఆశ్చర్యపడ్డారు అని కావ్య సమాధానం ఇస్తుంది. నేనూ నా భార్య తప్ప ఆఫీస్‌కి రాకూడదని ఎవరు అన్నారు పిన్నీ.. నువ్వు కూడా రా అని రాజ్ పిలుస్తాడు. ఆవిడ గారు వచ్చి ఏం వెలగబెడుతుంది. ఆఫీస్ ముందు కల్లాపు చల్లి ముగ్గు పెడుతుందా.. ఏంటి? అని ఇందిరా దేవి అంటే.. ఆ ముగ్గు వేయడానికైనా నడుం వంచాలి కదా అని ప్రకాష్ అంటాడు. కళ్యాణ్ కూడా ఈ ఇంటి వారసుడే. వాడు ఆఫీస్‌కి బిజినెస్ చూసుకునే తెలివితేటలు ఉన్నాయి. ఎవరేమీ ఎద్దేవా చేయాల్సిన పని లేదని ధాన్య లక్ష్మి అంటుంది. చాలా మంది నిర్ణయం కవి గారూ. మంచి నిర్ణయం తీసుకున్నారని కావ్య అంటే,. నేను ఎక్కడ నిర్ణయం తీసుకున్నా.. కొన్ని కావాలంటే కొన్ని వదులు కోవాలి అని కళ్యాణ్ ఇన్ డైరెక్ట్‌గా సమాధానం చెప్తాడు. ఎలా అయితేనే కళ్యాణ్ కూడా ఆఫీస్‌కి వస్తే మరింత ముందుకు వెళ్తాం అని సుభాష్ అంటాడు.

నీ సంస్కారం ఏమైంది ధాన్య లక్ష్మి: ఇందిరా దేవి

ఆ తర్వాత కళ్యాణ్ అపర్ణ దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు. మంచిది నాన్నా అన్నయ్యకు తోడుగా ఉండు అని చెప్తుంది. అంటే నా కొడుకును అసిస్టెంట్‌గా ఉండమంటావా అక్కా? ధాన్య లక్ష్మి అంటుంది. దీంతో ప్రకాష్ ధాన్య లక్ష్మికి వార్నింగ్ ఇస్తాడు. రాముడితోపాటు లక్ష్మణుడు కూడా అడవిలోకి వెళ్లాడు. అది అవమానం కాదు.. అన్నదమ్ముల అనుబంధం. దీన్ని కూడా వక్రీకరిస్తున్నావ్ అంటే నీ సంస్కారం ఏమైపోయింది ధాన్య లక్ష్మి అని ఇందిరాదేవి అంటుంది. ఇక్కడ జరిగే కొన్ని సంఘటనలతో నా సంస్కారం పోయిందని ధాన్యలక్ష్మీ అంటుంది. అసలు నీకు సంస్కారం ఉంటే కదా అని అపర్ణ సెటైర్ వేస్తుంది. మమ్మీ ఏంటిది.. కల్యాణ్ నువ్ నేరుగా ఆఫీస్‌కు వెళ్లురా. నాకు బయట పని ఉందని రాజ్ వెళ్లిపోతాడు. కావ్య కూడా వెళ్లిపోతుంటే కళ్యాణ్ వస్తానంటాడు. నేను మీ అన్నయ్యను ఫాలో అవుతాను అని కావ్య.. కవి చెవిలో చెప్తుంది. సరే అయితే నేను క్యాబ్ లో వెళ్తాను అంటాడు కళ్యాణ్. లేదు నువ్వు మీ నాన్న కారులో వెళ్లు అని కారు కీస్ ఇస్తుంది ధాన్య లక్ష్మి.

ఇవి కూడా చదవండి

రాజ్ మాటలు విని ఏడుస్తూ వెళ్లిపోయిన కావ్య..

ఈ సీన్ కట్ చేస్తే.. రాజ్ కారును ఫాలో చేస్తూ ఉంటుంది కావ్య. ఆ కారును చూసిన రాజ్.. చెప్తానే ఉండు నీకు అదిరిపోయే షాక్ ఇస్తాను అని రాజ్ చెప్తాడు. ఇలా రాజ్ శ్వేత ఇంటికి చేరుకోగానే.. శ్వేత వచ్చి నా భర్త విడాకులకు ఒప్పుకున్నాడు అని చెప్తుంది. హేయ్ గుడ్ న్యూస్ అని రాజ్ సంతోష పడతాడు. కావ్యను చూడగానే శ్వేతను ఎత్తుకుని తిప్పుతాడు. ఇక మనకు ఎలాంటి అడ్డూ లేదు. నీకూ విడాకులు వచ్చాయి. నేను త్వరలోనే విడాకులు తీసుకుంటాను. ఇక మనం హ్యాపీగా ఉండొచ్చు అని రాజ్ కావాలనే అంటాడు. దీంతో కావ్య ఏడుస్తూ వెళ్లిపోతుంది.

కావ్యా లాంటి అమ్మాయి దొరకదు: శ్వేత

ఆ తర్వాత ఏంటి రాజ్ ఇది.. కావ్యకు విడాకులు ఇవ్వకు. నా భర్త శాడిస్ట్ అయినా విడాకులు తీసుకుంటే బాధగా ఉంది. నీకు ఎలాంటి అలవాట్లు లేవు. నిన్ను కావ్య ఎలా వదులుకుంటుంది. కావ్య లాంటి మంచి అమ్మాయి నీకు మళ్లీ కావాలి అనుకున్నా దొరకదు. ఒక్కసారి ఆలోచించు రాజ్ అని శ్వేత నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ రాజ్ అస్సలు ఒప్పుకోడు. సరే ఈ సంగతి వదిలేయ్. నాకు పార్టీ ఎప్పుడు ఇస్తున్నావ్ అని అంటాడు రాజ్. సరే పదా అని ఇద్దరూ కారులో వెళ్తారు.

కావ్యను దొంగగా చేసిన రుద్రాణి, అనామికలు:

లాకర్ కీస్ చూసి అనామిక, రుద్రాణిలు సంతోష పడుతూ ఉంటారు. కావ్యను ఇరికించడానికి మంచి అవకాశం దొరికింది. వెళ్లి లాకర్‌లో డబ్బు తీసేసి.. కావ్య మీద నెట్టేద్దాం అని ప్లాన్ వేస్తారు. అన్నట్టుగానే రుద్రాణి వెళ్లి డబ్బు తీసుకొస్తుంది. ఆ డబ్బు మీ దగ్గరే ఉంచండ ఆంటీ.. కీస్ నేను తీసుకుంటా. దాన్ని కావ్య దగ్గర పెట్టేస్తా అని చెప్తుంది.

రాజ్‌పై సుభాష్ ఫైర్..

మరికాసేపట్లో క్లయింట్‌తో మీటింగ్ ఉంది. రాజ్ ఎక్కడికి వెళ్లాడు. ఇంకా రాలేదు అని సీరియస్ అవుతాడు సుభాష్. శృతిని అడిగినా నాకు తెలీదు సర్. ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా రిప్లై లేదు అని చెప్తుంది. అప్పుడే కావ్య బాధగా ఆఫీస్‌కి వస్తుంది. అమ్మా కావ్య.. రాజ్ ఎక్కడ? మీరిద్దరూ కలిసే కదా బయలు దేరారు అని సుభాష్ అడుగుతాడు. కలిసే బయలు దేరాం. కానీ ఆయన అడ్డదారిలో వెళ్లారు. నేను నేరుగా వస్తున్నా అని చెప్తుంది. అడ్డ దారిలో వెళ్లి ఏం అడ్డమైన పనులు చేస్తున్నాడు? ఫోన్ చేయ్ అని సుభాష్ ఆవేశంగా అంటాడు. కావ్య ఫోన్ చేసినా రాజ్ లిఫ్ట్ చేయడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.