AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shobha Shetty: ఫ్రెండ్షిప్ కోసం నాగార్జున ఇచ్చిన గిఫ్ట్ వదిలేసిన శోభా.. అమర్‏కు ఊహించని సర్‏ప్రైజ్..

హౌస్ లో ఉన్న సమయంలో నాగార్జున ధరించిన ఓ టీషర్ట్ ను కావాలని అడిగింది శోభా. బ్లాక్, రెడ్ దారలతో ఎంతో స్టైలీష్ గా ఉన్న టీషర్ట్ తనకు నచ్చిందని... అది కావాలని మనసులో మాట బయటపెట్టింది. ఇక శోభా అడగ్గానే.. షో అయిపోయిన వెంటనే ఆ టీషర్ట్ ఇచ్చేశాడు నాగ్. ఆ తర్వాత ఆ టీషర్ట్ ధరించి ఫోటోషూట్ చేసింది మోనీత. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలోనూ షేర్ చేస్తూ తెగ మురిసిపోయింది.

Shobha Shetty: ఫ్రెండ్షిప్ కోసం నాగార్జున ఇచ్చిన గిఫ్ట్ వదిలేసిన శోభా.. అమర్‏కు ఊహించని సర్‏ప్రైజ్..
Shobha Shetty
Rajitha Chanti
|

Updated on: Feb 10, 2024 | 9:08 AM

Share

శోభా శెట్టి.. బుల్లితెరకు పరిచయం అక్కర్లేని పేరు. కార్తీక దీపం సీరియల్ ద్వారా మోనితగా విలనిజం చూపించింది. ఇక తర్వాత బిగ్‏బాస్ సీజన్ 7లోకి రియల్ క్యారెక్టర్ చూపిస్తానంటూ వెళ్లింది.. కానీ అనుకోకుండానే పూర్తిగా నెగిటివిటీని మూటగట్టుకుంది. ఈసారి బిగ్‏బాస్ షోలో అత్యధిక ట్రోల్స్, నెగిటివిటీ వచ్చిందంటే అది శోభాకు అనే చెప్పాలి. తన ఆట తీరుతో వారెవ్వా అనిపించుకుంది.. కానీ గొడవలు, గట్టిగా అరవడంతో ఆమెపై జనాల్లో వ్యతిరేకత వచ్చింది. అయినా హౌస్ లో దాదాపు 14 వారాల తర్వాత చివరి వారంలో ఎలిమినేట్ అయింది. ఇక బిగ్‏బాస్ ఫినాలే తర్వాత తన పర్సనల్ లైఫ్, కెరీర్ పై మరింత శ్రద్ధ పెట్టింది. ఇటీవలే తన ప్రియుడు యశ్వంత్ రెడ్డితో కలిసి పెళ్లి తంబులాలు మార్చుకున్నట్లు తెలిపింది. అలాగే ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సొంతింటి కలను నిజం చేసుకుంది. అయితే హౌస్ లో తన ప్రవర్తన నెగిటివ్ అయిన శోభా.. ఫ్రెండ్షిప్ కోసం మాత్రం ఏం చేయడానికైనా రెడీ అవుతుంది. గతంలో హౌస్ లో ఉన్న సమయంలో తన స్నేహితుడు అమర్ దీప్ కు సాయం చేసేందుకు ప్రయత్నించింది. అతడిని ఎలాగైనా కెప్టెన్ చేయాలని శయశక్తుల ప్రయత్నించింది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అమర్ దీప్ తో తనకున్న స్నేహం గురించి ఓ నిర్ణయం తీసుకుంది.

హౌస్ లో ఉన్న సమయంలో నాగార్జున ధరించిన ఓ టీషర్ట్ ను కావాలని అడిగింది శోభా. బ్లాక్, రెడ్ దారలతో ఎంతో స్టైలీష్ గా ఉన్న టీషర్ట్ తనకు నచ్చిందని… అది కావాలని మనసులో మాట బయటపెట్టింది. ఇక శోభా అడగ్గానే.. షో అయిపోయిన వెంటనే ఆ టీషర్ట్ ఇచ్చేశాడు నాగ్. ఆ తర్వాత ఆ టీషర్ట్ ధరించి ఫోటోషూట్ చేసింది మోనీత. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలోనూ షేర్ చేస్తూ తెగ మురిసిపోయింది. అయితే నాగార్జున ఎంతో ప్రేమగా ఇచ్చిన ఆ టీషర్టును ఇప్పుడు స్నేహం కోసం వదిలేసుకుంది. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన అమర్ కు ఆ టీషర్ట గిఫ్ట్ ఇచ్చేసింది.

ఇటీవల బుల్లితెరపై స్టార్ మా బిగ్‏బాస్ ఉత్సవ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది. బిగ్‏బాస్ సీజన్ 7లో పాల్గొన్న కంటెంస్టెంట్స్ అందరూ ఈ వేదికపై సందడి చేశారు. ఈ క్రమంలోనే తన స్నేహితుడు అమర్ దీప్ కోసం ఊహించని గిఫ్ట్ ఇచ్చింది శోభా. నాగార్జున తనకు ఎంతో ప్రేమగా ఇచ్చిన టీషర్ట్ ను అమర్ కు గిఫ్ట్ ఇచ్చింది. నిజానికి బిగ్‏బాస్ హౌస్ లో ఉన్నప్పుడు నాగార్జున ధరించిన ఎల్లో టీషర్ట్ కావాలని అడిగాడు అమర్. కానీ అప్పుడు నాగ్ అతడికి ఇవ్వలేదు. ఇక అదే విషయం గుర్తుపెట్టుకుని.. నాగ్ తనకు ఇచ్చిన కానుకను తన స్నేహితుడికి ఇచ్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ‘ఇది నాకెంతో విలువైన బహుమతి.. కానీ ఆరోజు అమర్ నాగ్ సర్ ను అడిగాడు. కాబట్టి ఇది తనకు ఇచ్చేస్తున్నా ‘ అంటూ చెప్పుకొచ్చింది శోభా. ఇక టీషర్ట్ చూసి మురిసిపోయిన అమర్ స్టేజీ పైనే దాన్ని ధరించి సంబరపడ్డాడు. స్నేహం కోసం శోభా చేసిన పని చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. ఫ్రెండ్ అంటే నీలా ఉండాలని.. కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి