Ashu Reddy: బిగ్‌ బాస్‌ బ్యూటీ అషు రెడ్డి ఇంట్లో వేణు స్వామి ప్రత్యేక పూజలు.. కారణమిదే.. వీడియో చూశారా?

ఇనయ ఎందుకు వేణు స్వామితో పూజలు చేయించుకుంది? ఆ పూజలతో ఆమెకు లక్‌ ఏమైనా కలిసొచ్చిందో తెలియదు కానీ.. ఇప్పుడు ఆమె బాటలోనే మరో బిగ్‌ బాస్ బ్యూటీ నడిచింది. ఆమె మరెవరో కాదు ఆర్జీవీతో హాట్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న అషూ రెడ్డి. తాజాగా తన ఇంట్లో వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుందీ అందాల తార. చూస్తుంటే బగ్లాముఖిదేవి, రాజ శ్యామలా దేవీ పూజలను అషూ చేయించినట్టుగా తెలుస్తోంది.

Ashu Reddy: బిగ్‌ బాస్‌ బ్యూటీ అషు రెడ్డి ఇంట్లో వేణు స్వామి ప్రత్యేక పూజలు.. కారణమిదే.. వీడియో చూశారా?
Ashu Reddy, Venu Swamy
Follow us
Basha Shek

|

Updated on: Feb 09, 2024 | 6:53 PM

ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సెలబ్రిటీల జాతకాలు, మరీ ముఖ్యంగా సినిమా తారల జాతకాలు చెబుతూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారాయన. సమంత- నాగచైతన్యల జాతకం నిజం కావడంతో వేణు స్వామి పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత రష్మిక మందన్నా, నిధి అగర్వాల్ తదితర తారలంతా వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఇక టాలీవుడ్‌ తారలు కూడా వేణు స్వామినే ఫాలో అవుతున్నారు. మరీ ముఖ్యంగా బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్స్‌. ఆ మధ్యన ఇనయా సుల్తానా.. వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. మరి ఇనయ ఎందుకు వేణు స్వామితో పూజలు చేయించుకుంది? ఆ పూజలతో ఆమెకు లక్‌ ఏమైనా కలిసొచ్చిందో తెలియదు కానీ.. ఇప్పుడు ఆమె బాటలోనే మరో బిగ్‌ బాస్ బ్యూటీ నడిచింది. ఆమె మరెవరో కాదు ఆర్జీవీతో హాట్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న అషూ రెడ్డి. తాజాగా తన ఇంట్లో వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుందీ అందాల తార. చూస్తుంటే బగ్లాముఖిదేవి, రాజ శ్యామలా దేవీ పూజలను అషూ చేయించినట్టుగా తెలుస్తోంది. పూజల అనంతరం దీనికి సంబందించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసిందీ బిగ్‌ బాస్‌ బ్యూటీ. ఇందులో పూజల అనంతరం వేణుస్వామి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం కూడా తీసుకుందీ ముద్దుగుమ్మ. ఈ వీడియోకు ‘ఇది పూజ టైం.. డివైన్ టైం’ అని హ్యాష్ ట్యాగ్ పెట్టింది అషూ రెడ్డి. అలాగే ఎవరి నమ్మకాలు వాళ్లవి బ్రో అని మరో హ్యాష్ ట్యాగ్ కూడా జత చేసింది.

ప్రస్తుతం అషూ రెడ్డి షేర్‌ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారింది. అయితే ఈ వీడియోకి కామెంట్‌ సెక్షన్‌ ను డిసెబుల్‌ చేసిందామె. బహుశా నెగెటివ్ కామెంట్లు వస్తాయని తెలిసే ఇలా చేసిందేమోనని తెలుస్తోంది. కాగా వేణు స్వామితో అషు రెడ్డి పూజలు చేయించడం ఇదేమి మొదటి సారి కాదు. గతంలో కొత్త కారు కొన్నప్పుడు కూడా ఇలాగే ఈ జ్యోతిష్కుడితో ప్రత్యేక పూజలు చేయించింది. మళ్లీ ఇప్పుడు పూజలు చేయించడం హాట్‌ టాపిక్‌ గా మారింది. మరి అషూ రెడ్డి ఎందుకు వేణు స్వామితో పూజలు చేయించిందో తెలియదు కానీ దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజి క మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. కాగా టిక్‌ టాక్‌ వీడియోలతో బాగా క్రేజ్‌ తెచ్చుకున్న అషూ రెడ్డి కొన్ని టీవీ షోలతో బాగా పాపులర్‌ అయ్యింది. బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 కంటెస్టెంట్‌ గా మరింత గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని సినిమాల్లోనూ నటించినా పెద్దగా క్లిక్ కాలేకపోయింది.

ఇవి కూడా చదవండి

అషూ రెడ్డి ఇంట్లో వేణు స్వామి పూజలు..

View this post on Instagram

A post shared by Ashu Reddy (@ashu_uuu)

View this post on Instagram

A post shared by Ashu Reddy (@ashu_uuu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు