Brahmamudi, April 20th episode: ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. ఇంట్లోంచి బయటకు రాజ్‌.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్ నిజం చెప్పక పోవడంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపొమ్మంటుంది అపర్ణ. దీంతో ఒక్కసారి షాక్ అవుతారు. ధాన్య లక్ష్మి, సుభాష్, పెద్దావిడ అపర్ణను నిలదీస్తారు. ఆంటీ.. రాజ్ అసలు తప్పు చేసే మనిషే కాదు. రాహుల్ లాంటి వాడినే ఈ ఇల్లు క్షమించింది. అలాంటిది రాజ్‌కి ఎందుకు శిక్షవేయాలి? ఇప్పటికప్పుడు ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే ఎలా.. నిజం చెప్పేందుకు సమయం కూడా ఇవ్వాలి కదా అని స్వప్న అంటుంది. చిన్నదానివైనా బాగా..

Brahmamudi, April 20th episode: ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. ఇంట్లోంచి బయటకు రాజ్‌.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్!
Brahmamudi
Follow us

|

Updated on: Apr 20, 2024 | 11:23 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్ నిజం చెప్పక పోవడంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపొమ్మంటుంది అపర్ణ. దీంతో ఒక్కసారి షాక్ అవుతారు. ధాన్య లక్ష్మి, సుభాష్, పెద్దావిడ అపర్ణను నిలదీస్తారు. ఆంటీ.. రాజ్ అసలు తప్పు చేసే మనిషే కాదు. రాహుల్ లాంటి వాడినే ఈ ఇల్లు క్షమించింది. అలాంటిది రాజ్‌కి ఎందుకు శిక్షవేయాలి? ఇప్పటికప్పుడు ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే ఎలా.. నిజం చెప్పేందుకు సమయం కూడా ఇవ్వాలి కదా అని స్వప్న అంటుంది. చిన్నదానివైనా బాగా చెప్పావ్. కాబట్టి రాజ్‌కి వారం రోజులు సమయం ఇచ్చాను. ఈలోపు రాజ్ నిజం చెప్పాలి. అజ్ఞాతంలో ఉండే ఆ తల్లి బయటకు రావాలి. లేదంటే మాత్రం ఇంట్లో నుంచి వెళ్లి పోవాలి అని చెప్పి వెళ్లి పోతుంది.

దుగ్గిరాల ఇంటిని పడగొట్టేందుకు రుద్రాణి స్కెచ్..

ఈ సీన్ కట్ చేస్తే.. రుద్రాణి శివతాండవ చేస్తుంది. శివుడి పాటలు పెట్టుకుని.. ఎంతో ఆనందంగా డ్యాన్స్ చేస్తుంది. అప్పుడే రాహుల్ వచ్చి చూసి షాక్ అయి.. పాటలు ఆపుతుంది. ఏంట్రా ఎందుకు పాటలు ఆపావు అని రుద్రాణి అడిగితే.. ఏమైంది మామ్ నీకు.. పూజ అంటేనే చిరాకు పడేదానివి.. ఇప్పుడు ఏకంగా డ్యాన్సే చేస్తున్నావ్ అని రాహుల్ అడుగుతాడు. ఆనందం కలిగింది.. శివుడు భోళా శంకరుడు. రాక్షసుడికి కూడా వరాలు ఇస్తాడంటే ఏంటో అనుకున్నా. కానీ ఇప్పుడు నేను కోరుకున్న నిజాలు చేస్తున్నాడంటే నిజమే అనిపిస్తుందని రుద్రాణి అంటుంది. అదేంటి మామ్? అని రాహుల్ అడిగితే.. నువ్వు రాజ్ స్థానంలోకి వెళ్లాలని కోరుకున్నా. ఇప్పుడు మా వదిన ఇచ్చిన ట్విస్ట్‌తో ఇంట్లో నుంచే వెళ్లి పోతున్నాడు. రాజ్ గురించి నాకు బాగా తెలుసు. ఒక్కసారి అనుకున్నాడంటే ఎవ్వరు చెప్పినా వినడు. నోరు తెరిచి నిజం చెప్పడు. వదిన ఇంట్లో ఉండటానికి ఒప్పుకోదు. సో రాజ్ వెళ్లిపోతే.. కావ్య ఎందుకు ఉంటుంది? వెళ్లి పోతుంది? ఆ తర్వాత కళ్యాణ్‌ ని ఓ ఆట ఆడించుకోవాలి. ఇంకేం ఉంది? ఎండీ సీట్ నీదే అని సంతోష పడతారు. అలాగే ఆ స్వప్నని ఇరికించి ఆస్తి పేపర్స్ ఇస్తే చాలు. ఆ తర్వాత అది కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. దసరా, దీపావళి ఒక్కటే సారి చేసుకున్నట్టు ఉందిరా నాకు. ఒకవైపు రాజ్, కావ్యలు, మరోవైపు స్వప్న, కళ్యాణ్‌ని తొక్కేస్తాం. అప్పుడు ఈ రుద్రాణి ఏంటో ఇంట్లో అందరికీ చూపిస్తాను అని అంటుంది రుద్రాణి.

మారని అపర్ణ నిర్ణయం.. ఏం జరుగుతుందో..

ఆ తర్వాత అపర్ణ బయట తిరుగుతూ ఉంటుంది. అపర్ణ దగ్గరకు పెద్దావిడ, కావ్యలు వచ్చి నువ్వు ఏం చేస్తున్నావో.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నావో అర్థం అవుతుందా? రాజ్ అంటే అందరికీ ప్రేమ ఉంది కానీ.. నీకు ప్రాణం కదా? అలాంటి వాడిని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని ఎలా అనగలిగావ్? వాడిని దూరం చేసుకుని నువ్వు ఉండగలవా? అని పెద్దావిడ అడిగితే.. అది వాడు ఆలోచించుకోవాలి అత్తయ్యా. తల్లి అయినందుకు భరించక తప్పదు. ఆ పరిస్థితి వాడు తీసుకొచ్చాడు. వాడి తప్పు సరిదిద్దే మనసు నాకున్నా.. వినే వయసు వాడు దాటి పోయాడని అపర్ణ అంటుంది. అంటే వదిలేయాలనే నిర్ణయించుకున్నావా? అని ఇందిరా దేవి అడుగుతుంది. వాడు నోరు తెరిచి నిజం చెప్తే.. వాడు ఇల్లు వదిలే పరిస్థితి రాదు కదా? అని అపర్ణ అంటుంది. అలా చెప్పే మనిషే అయితే.. ఇప్పటికే చెప్పేవారు కదా అని కావ్య అంటుంది. అలా చెప్పకపోవడానికి కారణం నువ్వే.. సరే ఏం చేయాలో చెప్పు? వాడికి నేను కావాలో.. ఆ బిడ్డ కావాలో వాడే తేల్చుకోవాలి. గడప దాటి వెళ్లి పోతే.. తల్లిగా చచ్చిపోతా.. అని అపర్ణ అంటుంది.

ఇవి కూడా చదవండి

ఇప్పటికైనా నిజం చెప్పు రాజ్..

మరోవైపు బాబు ఏడి కనిపించడం లేదు? కళావతి ఏమన్నా బయటకు తీసుకెళ్లిందా.. అని బయటకు వచ్చి చూస్తాడు. అప్పుడే సుభాష్ ఇంట్లో ఎవరికీ తెలియకుండా బాబును తీసుకుని కారులో వెళ్తాడు. ఇది పైనుంచి రాజ్.. పక్క నుంచి కావ్యా చూస్తారు. ఆ తర్వాత వెంటనే రాజ్ కూడా కారు వేసుకుని సుభాష్‌ని ఫాలో అవుతాడు. ఆ నెక్ట్సే.. కావ్య కూడా రాజ్ కారును ఫాలో చేస్తుంది. రాజ్ ఫాస్ట్‌గా వెళ్తూ.. సుభాష్ కారును ఫాలో అయ్యి.. అడ్డంగా బండి ఆపుతాడు. కొంచెం దూరంలో కావ్య కూడా ఆపి.. పక్క నిల్చుని వింటుంది. బాబును ఎక్కడికి తీసుకెళ్తున్నారు డాడ్? అని రాజ్ అడుగుతాడు. నేను స్వార్థ పరుడివి రా. తప్పు చేసినా.. ఒప్పు చేసినా.. ఇంట్లో అందరితో కలిసి ఉండాలి. చూస్తూ చూస్తూ నిన్ను దూరం చేసుకోలేను అని సుభాష్ అంటే.. నాకు ఆ బిడ్డ ముఖ్యం అని రాజ్ అంటాడు.

ఆ బిడ్డను ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడే ఇచ్చేయ్..

ఆ బిడ్డను ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడే ఇచ్చేయ్. లోకం తెలీని పసివాడి కోసం నీ భవిష్యత్తును దూరం చేసుకుంటే నేను చూడలేను. అందరికీ దూరమై నువ్వు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. ఇంకా ప్రేక్షకుడిలా చూడలేను. నువ్వు ఇప్పుడు నిజం బయట పెట్టాల్సిన సమయం వచ్చిందని సుభాష్ అంటాడు. నిజం బయట పెట్టాల్సిన అవసరం వచ్చిందనే.. ఇంట్లోంచి బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నా అని రాజ్ అంటాడు. నువ్వు బయటకు వెళ్తే.. ఆ నిజం ఏంటో నేనే చెప్పాల్సి వస్తుంది. నా కొడుకుని అనామకుడిలా చూస్తూ ఉంటే ఆ నిజాన్ని నేను బయట పెట్టక తప్పదు. శ్రీరామ చంద్రుడు అడవులకు వెళ్లగానే.. దశరథుడు ప్రాణాలే వదిలాడు. నేను కూడా అలాంటి తండ్రినేరా అని సుభాష్ అంటాడు. ఇంత కంటే నాకు ఇంకేం కావాలి డాడ్. మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిజం చెప్పరని నాకు తెలుసు. మీరు మాట ఇస్తే.. మీలోనే దాచుకుంటారు అని బిడ్డను తీసుకుని వెళ్లి పోతాడు రాజ్.

స్వప్నను ఇరికించేసిన రాహుల్..

ఆ నెక్ట్స్ రాహుల్ ప్లాన్ ప్రకారం స్వప్నను ఇరికించడానికి ట్రై చేస్తాడు. ఆస్తి పేపర్స్‌ను తీసుకొచ్చి మార్వాడీ చేతికి ఇచ్చి.. కోటి రూపాయలు ఇవ్వు. ఈ నిజం ఎవరికీ తెలీదు. నెక్ట్స్ మనం అనుకున్నట్టు ఇంటికి వచ్చి గొడవ చెయ్ సరిపోతుంది. అలాగే నువ్వు మరో రూ.25 లక్షలు ఎక్కువగా రాసుకో అని రాహుల్ చెప్తాడు. దీంతో ఆ వడ్డీల వ్యాపారి సరే అని అంటాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.