AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: బుల్లితెర నటికి రోడ్డు ప్రమాదం.. ఎముకలు విరిగిపోయాయి.. పోస్ట్ వైరల్..

ఈ సమాచారాన్ని దివ్యాంక భర్త వివేక్ దహియా అండ్ పీఆర్ టీమ్ సోషల్ మీడియాలో తెలియజేసింది. ప్రస్తుతం ఆమె వైద్యుల సంరక్షణలో ఉంది. రోడ్డు ప్రమాదంలో దివ్యాంకకు తీవ్రగాయాలు అయ్యాయని.. చేతి రెండు ఎముకలు విరిగిపోయినట్లు సమాచారం. వివేక్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో దివ్యాంక చేతికి సంబంధించిన ఎక్స్-రేను కూడా పంచుకున్నాడు. ప్రస్తుతం నటి ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. దివ్యాంక ప్రమాద వార్త తెలిసిన వెంటనే వివేక్ తన లైవ్ సెషన్‌ను రద్దు చేసుకుని వెంటనే ఆసుపత్రికి చేరుకున్నాడు.

Tollywood: బుల్లితెర నటికి రోడ్డు ప్రమాదం.. ఎముకలు విరిగిపోయాయి.. పోస్ట్ వైరల్..
Divyanka Tripathi
Rajitha Chanti
|

Updated on: Apr 19, 2024 | 3:00 PM

Share

ప్రముఖ హిందీ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. తన నటనతో పాటు ఆమె స్వభావానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమెకు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. యై హై మొహబ్బతీన్ సీరియల్ ద్వారా నటిగా ఫేమస్ అయ్యింది. ఈ ధారవాహికను అప్పట్లో తెలుగులోకి డబ్ చేశారు. ఇదిలా ఉంటే దివ్యాంక త్రిపాఠి రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో వెంటనే ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారాన్ని దివ్యాంక భర్త వివేక్ దహియా అండ్ పీఆర్ టీమ్ సోషల్ మీడియాలో తెలియజేసింది. ప్రస్తుతం ఆమె వైద్యుల సంరక్షణలో ఉంది. రోడ్డు ప్రమాదంలో దివ్యాంకకు తీవ్రగాయాలు అయ్యాయని.. చేతి రెండు ఎముకలు విరిగిపోయినట్లు సమాచారం. వివేక్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో దివ్యాంక చేతికి సంబంధించిన ఎక్స్-రేను కూడా పంచుకున్నాడు. ప్రస్తుతం నటి ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. దివ్యాంక ప్రమాద వార్త తెలిసిన వెంటనే వివేక్ తన లైవ్ సెషన్‌ను రద్దు చేసుకుని వెంటనే ఆసుపత్రికి చేరుకున్నాడు.

ఆ తర్వాత పీఆర్ టీమ్ పోస్ట్ చేసింది, ‘రేపు జరగాల్సిన వివేక్ లైవ్ సెషన్ వాయిదా పడిందని తెలియజేయడానికి మాకు బాధగా ఉంది. కొన్ని గంటల క్రితం దివ్యాంకకు యాక్సిడెంట్ అయింది. ప్రస్తుతం ఆమె వైద్యుల సంరక్షణలో ఉంది. ఆమె కోలుకునే వరకు వివేక్ ఆమెతోనే ఉంటాడు. మీరు అర్థం చేసుకుంటారని.. మద్దతు ఇస్తారని భావిస్తున్నాం. ధన్యవాదాలు. దివ్యాంక త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ప్రార్థించండి. వివేక్ త్వరలో మీ అందరి ముందుకు వస్తాడు ” అంటూ ట్వీట్ చేశారు.

Divyanka Tripathi Accident

Divyanka Tripathi Accident

దివ్యాంక, వివేక్ వారి ప్రసిద్ధ సీరియల్ యే హై మొహబ్బతేన్ సెట్స్‌లో కలుసుకున్నారు. ఈ సీరియల్‌లో దివ్యాంక ప్రధాన పాత్రలో నటించింది. ఆమె పాత్రకు ప్రేక్షకుల నుండి చాలా ప్రేమను పొందింది. ఈ షోలో వివేక్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ వీరిద్దరూ తొలిసారి కలుసుకున్నారు. అదే సమయంలో మొదలైన ప్రేమ పెళ్లి బంధం వరకు చేరుకుంది. వీరిద్దరి వివాహం 8 జూలై 2016న ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో జరిగింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.