Brahmamudi, April 19th episode: చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అందరూ హాలులో కూర్చుని ఉంటారు. నీ కోడలు టీ పెట్టమనొచ్చుగా అని ధాన్య లక్ష్మిని అంటుంది రుద్రాణి. నీ కోడలు కూడా ఇక్కడే ఉంది కదా.. పెట్టి ఇమ్మనొచ్చుగా అని ధాన్య లక్ష్మి అంటుంది. ఏ ఇంటి కోడళ్లంతా టీ మాస్టార్‌లా.. అత్తలకు టీ పెట్టుకోవడం కూడా రాదా? అని స్వప్న అంటుంది. ఏమన్నావ్ అని ధాన్య లక్ష్మి అంటే.. నేను మా అత్తను అన్నాను. అయినా మన మీద మనం ఇలా కల్లాపు చల్లుకోవడం ఎందుకు? వేసుకోవడం ఎందుకు? మా కావ్య రాక ముందు..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అందరూ హాలులో కూర్చుని ఉంటారు. నీ కోడలు టీ పెట్టమనొచ్చుగా అని ధాన్య లక్ష్మిని అంటుంది రుద్రాణి. నీ కోడలు కూడా ఇక్కడే ఉంది కదా.. పెట్టి ఇమ్మనొచ్చుగా అని ధాన్య లక్ష్మి అంటుంది. ఏ ఇంటి కోడళ్లంతా టీ మాస్టార్‌లా.. అత్తలకు టీ పెట్టుకోవడం కూడా రాదా? అని స్వప్న అంటుంది. ఏమన్నావ్ అని ధాన్య లక్ష్మి అంటే.. నేను మా అత్తను అన్నాను. అయినా మన మీద మనం ఇలా కల్లాపు చల్లుకోవడం ఎందుకు? వేసుకోవడం ఎందుకు? మా కావ్య రాక ముందు మీరెవరూ టీ అనే ద్రవ పదార్థం తాగనట్టు మాట్లాడుతున్నారేంటి? అని స్వప్న అంటుంది. ధాన్య లక్ష్మీ నువ్వు టీ కప్పులో తుఫాను పుట్టంచకు. ఈమె నోరు విప్పితే ఇంటి పైకప్పు కూడా లేచి పోతుందని రుద్రాణి అంటుంది.
కరగని మాతృ హృదయాలు..
అప్పుడే బాబు బాగా గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటాడు. రాజ్ ఎత్తుకుని ఊరుకోబెట్టినా బాబు ఏడుస్తూనే ఉంటాడు. అది హాలులో ఉన్న వాళ్లందరూ కింద వింటూ కంగారు పడతారు. ఆకలి వేస్తుందేమో అని ఒకరు.. కింద పడ్డాడేమో అని మరొకరు అంటారు. అప్పుడే రుద్రాణి కావాలని పుల్లలు పెడుతుంది. మనవడు ఏడుస్తుంటే నానమ్మ మనసు కరగడం లేదా.. తాటి చెట్టు లాంటి తాతయ్య కూడా ఏం కానట్టు కూర్చున్నాడని అంటుంది. ఈలోపు అందరికీ చురకలు అంటిస్తుంది స్వప్న. ఈ టైమ్‌లో పంతం ఏంటి? పసివాడి మీద కోపం ఏంటి? అని అడుగుతుంది. అప్పుడే సీతా రామయ్య.. చిట్టీ నువ్వు వెళ్లు వీళ్లెవరూ వెళ్లేలా లేరు అని అంటాడు. వీళ్లలో ఎవరికైనా మాతృ హృదయం కరుగుతుందేమో అనుకున్నా.. అందరూ అలాగే ఉన్నారు. సరే నేనే వెళ్తాను అని పెద్దావిడ అనేలోపు.. అప్పుడే కావ్య వస్తుంది.
బాబుకు జ్వరం.. అల్లాడిన దుగ్గిరాల కుటుంబం..
ఇందకాటి నుంచి బాబు గుక్క పెట్టి ఏడుస్తున్నాడే.. నువ్వు వెళ్లి చూడవే అని స్వప్న చెబుతుంది. హడావిడిగా పైకి వెళ్లిన కావ్య.. ఏమైంది? అని అడుగుతుంది. తెలీడం లేదు.. బాగా ఏడుస్తున్నాడని రాజ్ అంటాడు. వెంటనే కావ్య బాబును ఎత్తుకుని.. అయ్యో ఒళ్లంతా వేడిగా ఉంది. జ్వరం వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి పదండి అని అంటుంది. వెంటనే కిందకు వెళ్తారు. ఏమైందని ఇంట్లోని వాళ్లందరూ కంగారు పడుతూ అడుగుతారు. అమ్మా కావ్య ఏమైంది? అని పెద్దావిడ అంటే.. ఫీవర్ ఉందని రుద్రాణి అంటుంది. అయితే ఆస్పత్రికి తీసుకెళ్దాం అని సుభాష్ కూడా వెళ్తాడు. అక్కడ డాక్టర్ చెక్ చేసి.. టెస్టులు చేస్తుంది.
బాబు జరగరానిదిజరిగితే.. జైలులో ఉంటాం..
ఈలోపు దుగ్గిరాల ఇంట్లో.. నాకు ఏదో కీడు శంకిస్తుంది. బాబుకు ఏదైనా జరగరానిది జరిగితే ఏంటి? అని రుద్రాణి అంటే.. చాల్లే ఆపు ఎప్పుడూ చెడుగానే ఆలోచిస్తావేంటి? నువ్వు మంచి ఆలోచనలు రావా? అని పెద్దావిడ చివాట్లు పెడుతుంది. నువ్వే చెప్తావుగా కీడు ఎంచి మేలు ఎంచాలని ఒక వేళ బాబుకు ఏదన్నా జరిగితే.. ఆ బిడ్డను కన్న తల్లి ఎక్కడో ఉంటుంది కదా? నా బిడ్డను దుగ్గిరాల కుటుంబం మొత్తం చంపేశారు అని పోలీస్ కేసు పెడితే.. అందర్నీ కలిసి జైలులో పెడతారు. ఈలోపు మీడియాకు కూడా ఈ వార్త వెళ్లి.. ఆ బిడ్డ ఎవరు? అని ఆరాలు అడిగితే అప్పుడు మనం రోడ్డు మీద ఉంటాం అని రుద్రాణి అంటుంది. రుద్రాణి చెబుతుంటే.. నాకు కూడా నిజం అనే అనిపిస్తుందని ధాన్య లక్ష్మి అంటుంది. ఎలాంటి అనర్థాలు జరగవు. ఆ పసి వాడి ప్రాణం ముందు నేను ఏమీ లెక్క చేయను అని అపర్ణ అంటుంది.
తల్లి ప్రేమ కావాలి..
ఈలోపు టెస్టులు చేసిన డాక్టర్.. రాజ్ వాళ్లను లోపలికి పిలుస్తుంది. టెస్టులు అన్నీ నార్మల్ గానే ఉన్నాయని చెబుతుంది. మీరు అసలు బాబుకు తల్లి పాలు ఇవ్వడం లేదా? ఎందుకు ఇవ్వడం లేదని? డాక్టర్ కావ్యని ప్రశ్నిస్తుంది. నేను వీడి కన్న తల్లిని కాదు కాబట్టి.. అని కావ్య చెప్తుంది. మరి బాబు తల్లి ఎక్కడ ఉంది? అని డాక్టర్ అడుగుతుంది. కొన్ని పరిస్థితుల వల్ల బాబు తల్లి దూరంగా ఉందని సుభాష్ చెప్తాడు. అదీ సంగతి.. బాబుకు ఎన్ని టెస్టులు చేసినా.. ఎవరి దగ్గరకు తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. బాబు తల్లి కావాలి. తల్లి ప్రేమ.. తల్లి పాలు కావాలి. తల్లిని బాగా మిస్ అవుతున్నాడు. బాబును తల్లికి అప్పగిస్తేనే క్షేమంగా ఉంటాడు అని డాక్టర్ చెబుతుంది.
నిజం చెప్పు రాజ్..
బాబుకు ఏం జరిగిందోనని ఇంట్లోని అందరూ టెన్షన్ పడతారు. ఇంట్లోకి రాజ్ వాళ్లు రాగానే.. ఆగండి అని అపర్ణ అడుగుతుంది. బాబుకు ఎలా ఉంది? డాక్టర్ గారు ఏం చెప్పారు? అని అపర్ణ అడుగుతుంది. బాబుకు తల్లి కావాలి అని చెప్పారు అని చెప్పారు అని చెబుతుంది. రాజ్ ఈ అమానుషత్వానికి ఎవరు కారణం? ఈ పసి బిడ్డను బలి చేయాలనుకున్నావా? చెప్పు సమాధానం చెప్పు? వాడి తల్లి ఎవరో చెప్పు అని అపర్ణ అంటే.. ఇప్పుడు కూడా మీరు నోరు విప్పకపోతే.. మీరసలు కన్న తండ్రే కాదు అని కావ్య అంటుంది. ఇంత జరిగినా నువ్వు నిజం చెప్పకపోతే.. ఆ పసివాడు ఫలితం అనుభవిస్తాడు అని పెద్దావిడ అంటుంది. ఆ తర్వాత ఒకరి తర్వాత మరొకరు రాజ్ ని ప్రశ్నిస్తూ ఉంటారు. అయినా రాజ్ మౌనంగా నిలబడి ఉంటాడు. క్షమించు నానమ్మా.. ఇప్పుడు నేనేమీ చెప్పలేను. అన్నీ నేనై చూసుకుంటాను అని రాజ్ వెళ్లి పోతాడు. ఇవాళ్టితో ఇక్కడి ఎపిసోడ్ ముగుస్తుంది.