Brahmamudi, September 20th episode: రుద్రాణి మాస్టర్ ప్లాన్.. కావ్యకు షాక్.. విగ్రహాలన్నీ మాయం! రాజ్ హెల్ప్ చేస్తాడా?

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో ట్విస్టులే ట్విస్టులు ఉండబోతున్నాయి. కావ్యకి పెద్ద షాక్ ఇవ్వనుంది రుద్రాణి. అపర్ణ చేత మాట్లాడించి.. అందరినీ కలిపేసిన కావ్య పనికి రుద్రాణి ఉక్రోశంతో, ఆవేశంతో రగిలిపోతుంది. దీంతో కావ్య సంతోషాన్ని పాడు చేయాలని ప్లాన్ రెడీ చేస్తుంది. అనుకున్నట్టుగానే తన మాస్టర్ ప్లాన్ ని సిద్ధం చేస్తుంది రుద్రాణి. ఇంతకీ రుద్రాణి ఏం చేయబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Brahmamudi, September 20th episode: రుద్రాణి మాస్టర్ ప్లాన్.. కావ్యకు షాక్.. విగ్రహాలన్నీ మాయం! రాజ్ హెల్ప్ చేస్తాడా?
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Sep 20, 2023 | 10:48 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో ట్విస్టులే ట్విస్టులు ఉండబోతున్నాయి. కావ్యకి పెద్ద షాక్ ఇవ్వనుంది రుద్రాణి. అపర్ణ చేత మాట్లాడించి.. అందరినీ కలిపేసిన కావ్య పనికి రుద్రాణి ఉక్రోశంతో, ఆవేశంతో రగిలిపోతుంది. దీంతో కావ్య సంతోషాన్ని పాడు చేయాలని ప్లాన్ రెడీ చేస్తుంది. అనుకున్నట్టుగానే తన మాస్టర్ ప్లాన్ ని సిద్ధం చేస్తుంది రుద్రాణి. ఇంతకీ రుద్రాణి ఏం చేయబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

నిన్నటి బ్రహమ్ముడి ఎపిసోడ్ లో అపర్ణ ఉడుకుబోతనానికి ధీటుగా మాట్లాడుతుంది. అతయ్యా.. ఇప్పటివరకూ మీరు అనుకున్నది ఏదీ నేను చెయ్యలేదు.. కానీ ఇక ముందు అలా జరగదని మాత్రం నేను గ్యారెంటీ ఇవ్వలేను.. అంటూ అపర్ణలో ఇగోను రెచ్చగొడుతుంది కావ్య. దీనికి ఏంటి నాతోనే సవాల్ విసురుతున్నావా? అంటూ అపర్ణ అంటుంది. అయ్యో అత్తయ్య.. నాకు ఆ ధైర్యం జన్మలో రాదు.. కాకపోతే మీరు ఎవరితోనూ మాట్లాడకుండా.. వేరే కుంపటి పెడితే మాత్రం ఇకపై మీ మాట ఈ ఇంట్లో చెల్లదు.

ఇక అందరూ నాకు దగ్గరైపోతారు. మొత్తం అధికారాన్ని నాకే అప్పజెప్పుతారు. నాకు సానుభూతి ఎక్కువ అవుతుంది. అలాగే మీ అబ్బాయి కూడా నాకే సపోర్ట్ చేస్తున్నారు. దీంతో ఇంట్లోని వారంతా మీకు దూరమైపోతారు కదా? ఈ విషయం మీరు ఎందుకు ఆలోచించలేదు అంటూ చురకలు వేస్తుంది కావ్య. కావ్య మాటలను ఆలోచించిన అపర్ణలో భయం మొదలవుతుంది. బిత్తర చూపులు చూస్తూ కావ్య వైపు చూస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇక తెల్లవారగానే కావ్య లేచి పనులు చేస్తుండగా.. అపర్ణ వచ్చి కావ్యా అని పిలుస్తుంది. దీంతో మళ్లీ ఏం జరుగుతుందో అని అందరూ భయపడతారు. కానీ అపర్ణ కావ్యని కాఫీ తెమ్మని, టిఫిన్ చేసి పెట్టమని ఆజ్ఞలు జారీ చేసి వెళ్లిపోతుంది. ఇదంతా చూసి రుద్రాణి కుళ్లుకుంటుంది ఏంటి వదినా నువ్వేనా అంటూ అడుగుతుంది. ఇది విన్న ఇందిరా దేవి నీకు గొడవలు కావాలా? అని ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత రాజ్ తో అపర్ణ మాట్లాడినందుకు హ్యాపీ ఫీల్ అవుతాడు రాజ్. నెక్ట్స్ అపర్ణ దగ్గరకు వెళ్లి పుల్లలు పెడుతుంది రుద్రాణి. కానీ అపర్ణ మాత్రం.. కావ్య తప్పు చేస్తే నేనెందుకు శిక్ష వేసుకోవాలి.. తనకే శిక్ష వేస్తాను అంటూ సమాధానం ఇస్తుంది.

టుడే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్:

ఇక కావ్య ఇంటి పనులన్నీ ముగించుకుని.. సీతారామయ్య దగ్గరకు ఇవాళ నాకు మీ ఆశీర్వాదం కావాలి తాతయ్య అంటూ చెప్తుంది. ఎందుకు? ఇవాళ ఏం స్పెషల్ అని అడుగుతుంది ధాన్య లక్ష్మి. ఈ రోజుతో కాంట్రాక్ట్ గడువు ముగుస్తుంది. ఇది పూర్తి అయితే మా నాన్న అప్పులు అన్నీ తిరిపోతాయి. ఇల్లు మావాళ్ల సొంతం అవుతుంది అంటూ సంబర పడిపోతుంది కావ్య. ఇదంతా పైన నుంచి వస్తున్న రాజ్ వింటాడు.

ఇక అక్కడే ఉన్న రుద్రాణి కూడా కావ్య మాటలను వింటుంది. నిన్ను చూడు ఎలా ఏడిపిస్తానో.. నాకే కౌంటర్స్ వేస్తావా.. నా ప్లాన్సే రివర్స్ చేస్తావా.. ఈసారి నేను వేసిన ప్లాన్ తో నువ్వూ, మీ ఇంట్లోని వారందరూ ఏడుస్తూనే ఉంటారు. వెంటనే రాహుల్ కి కాల్ చేస్తుంది రుద్రాణి. ఆ కావ్య కాంట్రాక్ట్ పూర్తి కాకూడదు.. ఆ విగ్రహాలన్నీ మాయం కావాలి. ఇది విన్న రాహుల్.. సరే మమ్మీ.. నువ్వు అన్నట్టే ఆ కావ్య తయారు చేసిన విగ్రహాలన్నీ మాయం చేయిస్తా అంటూ సమాధానం ఇస్తాడు.

దీంతో దొంగలు వినాయక విగ్రహాలు తయారు చేసిన చోటికి వచ్చి.. విగ్రహాలను దొంగిలించాలని ప్లాన్ చేస్తారు. ఇప్పుడే అసలైన ట్విస్ట్ నెలకొంది. నిజంగానే ఆ విగ్రహాలు దొంగలు ఎత్తుకెళ్తారా? మరి కావ్య ఏం చేస్తుంది? రాజ్ ఏమైనా హెల్ప్ చేస్తాడా? ఇది తెలియాలంటే ఈ రోజు రాత్రి ఎపిసోడ్ ప్లే అయ్యాదాకా వెయిట్ చేయాల్సిందే.