Bigg Boss Telugu 9: హౌస్‌లోని ఆ కంటెస్టెంట్ నాకు నచ్చడు..వచ్చీ రాగానే బాంబు పేల్చిన రమ్య మోక్ష
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్లు ఒక్కొక్కరు అడుగుపెడుతున్నారు. మొదటి కంటెస్టెంట్ గా పచ్చళ్ల పాప గా గుర్తింపు పొందిన అలేఖ్య చిట్టి పికెల్స్ ఫేమ్ రమ్య మోక్ష హౌస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.

పచ్చళ్ల పాప గా గుర్తింపు తెచ్చుకున్న అలేఖ్య చిట్టి పికెల్స్ ఫేమ్ రమ్య మోక్ష బిగ్‌బాస్ 9లోకి తొలి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టింది. ఈ సందర్భంగా తన జర్నీ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది. రాజమండ్రిలో రోజ్ మిల్క్ ఎంత ఫేమస్సో తాను అంతే ఫేమస్ అని హోస్ట్ నాగార్జున ముందు హొయలు పోయింది. మొదట ఫిట్‌నెస్ వీడియోలతో సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్నానని, తర్వాత అక్కలతో కలిసి పికెల్స్ బిజినెస్ ప్రారంభించానని రమ్య చెప్పుకొచ్చింది. ఒక రోజు షూటింగ్ కోసం కొడైకెనాల్ వెళ్లాను.. ఉదయానికల్లా నాన్న చనిపోయారనే వార్త తెలిసింది. దీంతో త్వరగా ఇంటికొచ్చినా 2 నిమిషాలు మాత్రమే తండ్రిని చూసుకోగలిగానని రమ్య కన్నీళ్లు పెట్టుకుంది.
‘ఇప్పుడు బిగ్‌బాస్‌లోకి రావడం ఆనందంగా ఉంది.. హౌస్‌లో ఎంటర్ టైన్‌మెంట్ అనేది లేదని, నేను వెళ్లి అసలు ఎంటర్‌టైన్ అంటే చూపిస్తాను. ప్రస్తుతం బిగ్ బాస్ హౌసులో తనకు నచ్చిన కంటెస్టెంట్ ఒక్కరూ లేరు. కానీ నచ్చని కంటెస్టెంట్ మాత్రం భరణి’ అని బాంబు పేల్చింది రమ్య మోక్ష. ఈ సందర్భంగా ఆమెకు లగ్జరీ ఫుడ్ అనే అవకాశం ఇస్తున్నట్లు హోస్ట్ నాగార్జున తెలిపారు.కాగా ఎప్పటికైనా మూగ జీవాల కోసం షెల్టర్ హోమ్ ఏర్పాటు చేసి, దాన్ని అమల గారితో ఓపెన్ చేయించాలనే కోరిక ఉందని రమ్య తెలిపింది.
ఈ సందర్భంగా ప్రస్తుతం హౌస్‌లోని ఐదుగురికి రకరకాల పచ్చడి ఇవ్వాలని రమ్యకు టాస్క్ ఇచ్చారు. ఇక్కడ కూడా రమ్య తన అగ్రెసివ్ నెస్ ను చూపించింది. ఓవరాక్టింగ్ పచ్చడి (శ్రీజ) అని, సెల్ఫీష్ పచ్చడి (పవన్) అని, సేఫ్ గేమ్ పచ్చడి (భరణి), ఫేక్ పచ్చడి (దివ్య నికితా) అని, మ్యానిప్యులేటర్ పచ్చడి (రాము రాథోడ్) అని ఏకిపారేసింది. మొత్తానికి హౌస్ లోకి వచ్చీ రాగానే కంటెస్టెంట్లకు బాగానే చురకలు అంటించింది రమ్య మోక్ష. మరి ఆటలో ఏ మాత్రం ట్యాలెంట్ చూపిస్తుందో చూడాలి.
ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా.. అమల గారితో ఓపెన్ చేయిస్తా..
Bold. Blazing. Unbreakable.💥#RamyaMoksha enters the Bigg Boss house with fire in her heart and storm in her soul! 🌪️🔥#BiggBossFireStorm
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar pic.twitter.com/Q0vNd3czoB
— Starmaa (@StarMaa) October 12, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








