Bigg Boss Season 7: బెల్టు పట్టుకుని.. కంటెస్టెంట్స్ తోలు తీసిన నాగ్..! శివాజీకైతే చుక్కలే.. దెబ్బకు డీమోషనే..
Bigg Boss Season 7 Telugu: హా... ఇదే కావాలి..! బిగ్ బాస్ చూస్తే.. ఇలాంటి మజానే రావాలి! నాగ్ కోటింగ్ ఇస్తుంటే.. కంటెస్టెంట్స్ బిత్తరపోయి మరీ.. తలకిందులైపోవాలి. చెమటలు పట్టాలి. ఒక్కొక్క కంటెస్టెంట్‌ను కడిగేస్తుంటే.. చూస్తున్న మనకు గూస్ బంప్స్ రావాలి. టీవీకి.. మొబైల్‌కు అతుక్కొని కూర్చునేలానే చేయాలి. అయితే తాజాగా జరిగిన బిగ్ బాస్ సీజన్ 7, 28th ఎపిసోడ్ కూడా చేసింది ఇదే..! 'ఉల్టా పల్టా' అని బీబీ మేకర్స్ అనౌన్స్ చేసిన ఈ సీజన్ ట్యాగ్ లైన్‌కు.. జెస్టిఫికేషన్ ఈ ఎపిసోడే..!
Bigg Boss Season 7: మాస్టారూ.. మాస్టారు సాంగ్‌తో.. అంతే ఎనర్జటిక్‌గా.. అంతే స్టైలిష్‌గా… షోలోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. ఎప్పటిలానే శుక్రవారం హౌస్‌లో జరిగిన విశేషాలేంటో చూపించారు. స్టార్ మా టీం పాలిటిక్స్, శివాజీ కంటెస్టెంట్స్‌కు ఇచ్చే సలహాలు సూచనల మధ్యలో.. హౌస్ సాగుతుండగా.. స్టేజ్‌పై ఉన్న కింగ్ నాగ్ కాస్త సీరియస్‌గా చూస్తుంటారు. ఇవ్వాళ హౌస్ మేట్స్‌కు మూడిందనే హింట్ ఇస్తారు.
ఇక ఆ తరువాత శాస్త్రిబామ్.. టాస్క్ ఆడిన కంటెస్టెంట్స్.. స్ట్రెస్ రిలీఫ్ ఎవరో.. తలనొప్పి ఎవరో ఒక్కొక్కరు వచ్చి చెబుతుంటారు. అయితే అందులో ఎక్కువ మంది రతికను తలనొప్పి అంటూ నామినేట్ చేయగా.. శివాజీని, శోభను ఇద్దరి ఇద్దరి చొప్పున స్ట్రెస్ రిలీఫ్ ట్యాగ్ ఇస్తారు.
ఇక అమర్ దీప్, రతిక ఉండేచోట ఉండకుండా.. మరో సారి తమ చేతివాటం చూపించారు. బిగ్ బాస్ హౌస్ మేట్స్‌కు మాత్రమే అంటూ.. VIP రూమ్‌లో పెట్టిన ఫ్రిడ్జ్ నుంచి స్ప్రైట్ క్యాన్ ఎత్తుకెళతారు.
కట్ చేస్తే.. బెల్ట పట్టుకుని సీన్లోకి ఎంటర్ అయిన కింగ్ నాగార్జున.. హౌస్ మేట్స్‌ను చూడడం చూడడమే.. సీరియస్ అయ్యారు. శివాజీ, సందీప్ ఇద్దరూ సంచాలకులుగా ఫెయిల్ అంటూ.. మీకు హ్యూమానిటీ లేదంటూ.. సీరియస్ అయ్యారు. తేజు బెల్ట్ పట్టుని.. గౌతమ్ గొంతును లాగడాన్ని విపరీతంగా తప్పుబట్టారు. తేజును సంచాలకులిద్దరిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. మనిషివేనా.. కళ్లు కనబడటం లేదా అంటూ.. తేజను తిట్టారు. తేజుతో పాటు.. సందీప్, శివాజీ లను ఏం చేస్తే బాగుటుందో రిమైనింగ్ కంటెస్టెంట్స్‌ను అడిగారు. అందులో సందీప్.. ఈ పనికి తేజ ను ఇంటికి పంపాలని చెప్పగా.. ‘అలా అయితే నిన్ను కూడా బయటికి పంపాలని నాగ్ కామెంట్ చేస్తారు. గౌతమ్ జెంటిల్‌మెన్‌గా బిహేవ్ చేశాడని అతడిని అప్రిషియేట్ చేశారు.
తరువాత సుబ్బును అడ్రెస్ చేసిన నాగార్జున.. ‘నీ బాధ ఏంటో చూపిస్తున్నా చూడు’ అంటూ.. ఓ వీడియోను ప్లే చేస్తాడు. అందలో తను శివాజీ పై ఆరోపణలు చేస్తూ కనిపించడంతో అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. ఆ వీడియో ప్లే చేసిన తర్వాత మరో సారి తన ప్రాబ్లం ఏంటో చెప్పమని అడిగిన సుబ్బు.. టాస్క్‌లో భాగంగా.. శివాజీ తన మీదికి వచ్చాడని.. చెప్పింది. యాజ్ ఎ అమ్మాయిగా తనకు అది అన్ కంఫర్టబుల్‌గా అనిపించిందంది.
అయితే అందుకు నాగ్.. ‘శివాజీ నీతో మిస్ బిహేవ్ చేశాడా? లేక అన్ కంఫ్టర్టబుల్‌గానే అనిపించిందా..? ‘ అని అడగగా.. ఐ ఫెల్ట్ లిటిల్ అన్ కంఫ్టర్టబుల్ అంటూ ఆన్సర్ ఇచ్చింది. అయితే ఆ సీన్లో ఉన్న శోభను నిల్చోమని ఏం జరిగిందో చెప్పమని నాగ్ చెప్పగా… శోభ.. శివాజీ తప్పేం లేదంటూ.. చెప్పింది. శివాజీ మిస్ బిహేవ్ చేయలేదంటూ.. ప్రియాంక, గౌతమ్ కూడా నాగ్‌తో చెప్పారు. దీంతో అక్కడ అసలు ఏం జరిగిందో.. చూపించిన నాగ్.. హౌస్‌లో ఉన్న ఆడాళ్ల ఓపీనియన్ అడిగారు. అబ్బాయిలను కూడా అడిగారు. అయితే అందులో ఒక్క రితిక తప్పా.. అందరూ శివాజీది తప్పేలేదని తేల్చారు. దీంతో మధ్యే వర్తిగా ఓ మాట చెబుతాడు. ఆ స్పేస్‌లో తను.. ఇబ్బందిగా ఫీలైతే.. ఆ విషయం చెబుతుంటే.. తన మాటకు రిసీవ్ చేసుకోవాలని.. వదిలేయాలి అంటూ.. ఇద్దరికీ చెబుతారు నాగ్.
ఇక ఆ తరువాత ప్రశాంత్ దగ్గరికి వచ్చిన నాగ్.. గౌతమ్‌ను తను నామినేట్ చేస్తూ.. చెప్పిన రీజన్ గురించి డిస్కషన్ పెడతారు. గౌతమ్ శోభతో గొడవ పెట్టుకుంటూ.. తన చేతులతో జెస్చర్ చేసినట్టు … నాగ్ చూపించిన వీడియోలో తేలడంతో.. హౌస్‌లోని మెజారిటీ కంటెస్టెంట్స్ గౌతమ్‌ది తప్పంటూ ఫీలవుతారు. గౌతమ్‌ని గిల్టీగా తేలుస్తారు.
ఆ తరువాత ప్రిన్స్ యావర్‌ను నిలుచోమన్న నాగ్.. తినే ఫుడ్ మీద కోపం చూపించడాన్ని తప్పుబట్టారు. కోపం.. కసి వేరు వేరని.. కోసితో ఆడు.. కోపంతో కాదంటూ క్లాస్ పీకుతారు. డోంట్ లూస్ కంట్రోల్ అంటూ.. ప్రిన్స్‌కు సూచిస్తారు.
అప్పటి వరకు క్లాసులతో.. కామెంట్స్‌తో.. కంటెస్టెంట్స్‌కు చెమటలు పట్టించిన నాగ్.. ఆ తరువాత.. మరో టాస్క్‌తో కంటెస్టెంట్స్ ముందుకు వస్తారు. శివాజీ, సందీప్, శోభ ఈ ముగ్గరి హౌస్‌మేట్స్ అండ్ సంచాలకులలో.. ఎవరు పార్షల్ అండ్ బయాసో చెప్పాలంటూ.. ఒక్కో కంటెస్టెంట్స్‌ను యాక్టివిటీ రూంలోకి పిలిచి మరీ అడుగుతుంటారు. అయితే మొదట యాక్టివిటీ రూంలోకి వచ్చిన ప్రిన్స్.. సందీప్‌ను బయాస్డ్‌గా పిక్ చేసుకోగా.. రతిక శివాజీని పిక్ చేసుకుంటుంది.
ఇక ఈ టాస్క్ మధ్యలో మరోసారి కంటెస్టెంట్స్ మధ్యకు వచ్చిన నాగ్.. సిగ్గుందా.. మీ ఇంట్లో వాళ్లు ఇలానే పెంచారా అంటూ.. ప్రశాంత్‌ను రతిక తిట్టడంపై కాసేపు క్లాస్ పీకారు. రతికతో పాటు.. అమర్ కూడా.. ఈ యాక్టివిటీలో భాగమైనందుకు అమర్‌ను కూడా మందలించారు.
ఇక తరువత మళ్లీ బయాస్డ్ అండ్ పార్షల్ టాస్క్ మొదలెట్టిన నాగ్.. అమర్‌ను యాక్టివిటీ రూమ్‌కి పిలిచి.. తన దృష్టిలో ఎవరు బయాస్డో అడుగుతారు. అయితే అమర్ శివాజీని నామినేట్ చేయగా.. తేజ.. తనకు ఎవరూ అనిపించలేదంటూ చెబుతాడు. ఆ తరువాత వచ్చిన ప్రశాంత్ సందీప్ తనపై పార్శాలిటీ చూపిస్తున్నాడని చెబుతాడు. సుబ్బు కూడా సందీపే పార్శల్ అంటూ.. అన్ డిసర్వింగ్ హౌస్ మేట్ అంటూ.. కోట్ చేస్తుంది. తరువాత వచ్చిన ప్రియాంక కూడా.. తేజ లాగే ఆన్సర్ ఇస్తుంది.
ఆ తరువాత గౌతమ్‌ను పిలిచిన నాగ్.. నామినేషన్స్‌లో బూతు మాట్లాడడం పై మందలిస్తారు. ‘నువ్వు వేసుకున్నసూట్‌కు.. నువ్వు మాట్లాడే బూతు ఏమన్నా సెట్ అవుతుందా.. డోంట్ రిపీట్’ అంటూ.. చెబుతాడు. తరువాత తన దృష్టిలో అన్ డిస్వర్డ్ శివాజీ అంటూ నామినేట్ చేస్తాడు గౌతమ్.
ఆ తరువాత గౌతమ్ మధ్య సందీప్ మధ్య జరిగిన పంచాయితీని అడ్రస్ చేసిన నాగ్.. గౌతమ్ గుర్తు లేదంటూ.. చెప్పిన ఆన్సర్‌పై కాస్త అసహనం వ్యక్తం చేశారు. ‘కాంటెక్ట్స్ గుర్తుండవు.. వరడ్స్ గుర్తుండవు.. కోపంలో ఏం చేస్తావో తెలియవు ఇలా అయిత ఎలా గౌతమ్’ అంటూ.. నాగ్.. గౌతమ్‌కు మరో సారి క్లాసు పీకుతారు. దాంతో పాటే.. ఓ వీడియోను ప్లే చేస్తారు నాగ్. దాంతో పాటే.. గౌతమ్ గెలిచినందుకు శివాజీ హ్యాపీగా లేడని.. సందీప్ క్లియర్‌గా చెప్పలేదని తేల్చారు.
View this post on Instagram
ఇక ఆ తరువాత మళ్లీ టాస్క్‌లోకి వచ్చిన నాగ్.. ముగ్గురు ముగ్గురు ఓట్లతో.. ఇద్దరూ అన్ డిజర్వింగ్ కంటెస్టింట్‌గా శివాజీ , సందీప్.. హౌస్ మేట్స్ చేత ఎన్నికయకయ్యారని చెబుతారు. టై బ్రేక్‌గా.. మూడో కన్ఫర్డ్మ్ కంటెస్టెంట్ అయిన శోభతో సహా.. మిగిలిన ఇంటి సభ్యులందూ.. ఇద్దర్లో ఎవరు అన్ డిసర్వో తేల్చాలంటారు. తాను పేరు చెప్పగానే.. చేతులు పైకెత్తి.. ఓటు వేయాలంటారు.
అయితే సందీప్‌ను హౌస్‌లోని ముగ్గురే అన్ డిస్వరింగ్ అంటూ.. చేతులు పైకి ఎత్తి నామినేట్ చేయగా…. శివాజీకి మాత్రం ఏకంగా ఆరుగురు అన్‌డిస్వరింగ్ అంటూ ఓటేస్తారు. హౌస్ మేట్స్‌లో ఎక్కువ మంది శివాజీని అన్‌డిస్వరింగ్ అంటూ ఓటేయడంతో.. తన పవరాస్త్రను వెనక్కి తీసుకుంటున్నామని.. చెప్పిన నాగ్… ఇక నుంచి శివాజీ కంటెస్టెంట్ మాత్రమే అని.. హౌస్ మేట్ కాదని క్లియర్ కట్ గా చెబుతారు. శోభ చేత శివాజీ పవరాస్త్రను పగలగొట్టిస్తారు. అయితే నామినేషన్స్‌లో ఎవరు సేవ్ అవుతారో .. ఎవరు ఎలిమినేట్ అవుతారో.. సండే ఫన్‌డే ఎపిసోడ్‌లో తెలుస్తుందంటూ.. షో నుంచి ఎగ్జిట్ అవుతారు నాగ్.
– సతీష్ చంద్ర (ఈటీ ప్రొడ్యూసర్)
మరిన్ని బిగ్‌బాస్-7 కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.