Bigg Boss 7 Telugu: మళ్లీ ఒక్క ఛాన్స్ ప్లీజ్.. ఎపిసోడ్‏కు ముందే రతిక ఎలిమినేషన్ లీక్.. స్క్రీన్ షాట్స్ వైరల్..

ఆట ఆడాలి.. కానీ మనుషులతో కాదంటూ ముందు నుంచి చెప్పినా.. తన ఆట తీరు మార్చుకోకుండా మరింత హద్దుమీరిన రతికకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. పవరాస్త్ర టాస్క్ విషయంలో ప్రశాంత్ పై మాటల దాడి చేసిన అమర్ దీప్, రతికలకు చుక్కలు చూపించారు. ఫ్యామిలీని ఎందుకు లాగావ్ ? సిగ్గుందా ? అంటూ మాట్లాడటం కరెక్టా ?. నిన్ను అలాగే నీకు సిగ్గుందా అంటే ఊరుకుంటావా అంటూ ఫైర్ అయ్యారు నాగ్. మొత్తానికి ఈ వారం రెచ్చిపోయి మరీ రైతుబిడ్డను మానసికంగా టార్చర్ చేసిన రతిక పాపను నిలబెట్టి కడిగేశారు.

Bigg Boss 7 Telugu: మళ్లీ ఒక్క ఛాన్స్ ప్లీజ్.. ఎపిసోడ్‏కు ముందే రతిక ఎలిమినేషన్ లీక్.. స్క్రీన్ షాట్స్ వైరల్..
Rathika Rose Bigg Boss
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 01, 2023 | 8:19 AM

శనివారం (సెప్టెంబర్ 30) ఎపిసోడ్‏లో ఒక్కొక్కరిని ఉతికారేశారు హోస్ట్ నాగార్జున. బెల్టు పట్టుకుని వచ్చిన నాగ్ వీడియోస్ చూపించి మరీ అందరి బెండు తీశారు. ముఖ్యంగా టేస్టీ తేజ శాడిస్టుగా మారి ఆడిన ఆట తీరును.. సంచాలక్ గా వ్యవహరించి మాట మాట్లాడని సందీప్, శివాజీలపై సీరియస్ అయ్యారు. సందీప్, శివాజీలకు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ నాగ్ అల్లాడించగా.. నోరు మెదపలేకపోయారు. ఇక ఊహాలోకంలో బతికేస్తోన్న డాక్టర్ బాబుకు రియాల్టీలోకి రమన్నారు. ఒకరిలో తప్పులు చూసే ముందు తనలో తప్పులు చూసుకోవాలని హితబోధ చేశారు. ఇక ఆట ఆడాలి.. కానీ మనుషులతో కాదంటూ ముందు నుంచి చెప్పినా.. తన ఆట తీరు మార్చుకోకుండా మరింత హద్దుమీరిన రతికకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. పవరాస్త్ర టాస్క్ విషయంలో ప్రశాంత్ పై మాటల దాడి చేసిన అమర్ దీప్, రతికలకు చుక్కలు చూపించారు. ఫ్యామిలీని ఎందుకు లాగావ్ ? సిగ్గుందా ? అంటూ మాట్లాడటం కరెక్టా ?. నిన్ను అలాగే నీకు సిగ్గుందా అంటే ఊరుకుంటావా అంటూ ఫైర్ అయ్యారు నాగ్. మొత్తానికి ఈ వారం రెచ్చిపోయి మరీ రైతుబిడ్డను మానసికంగా టార్చర్ చేసిన రతిక పాపను నిలబెట్టి కడిగేశారు.

ఇదిలా ఉంటే.. ముందు నుంచి వినిపిస్తోన్నట్లుగానే ఈవారం హౌస్ నుంచి రతిక బయటకు రానుంది. అయితే రతిక ఎలిమినేట్ వార్త నెట్టింట వైరలవుతుండగా.. బిగ్‏బాస్ హౌస్ కు పట్టిన శని పోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎప్పటిలాగే బిగ్‏బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ముందే లీక్ అయ్యింది. ఈసారి డబుల్ ఎలిమినేషన్ అని.. టేస్టీ తేజతోపాటు రతిక ఎలిమినేషన్ కానుందనే టాక్ నడిచింది. అయితే చివరి రెండు రోజుల్లో ఓటింగ్ పూర్తిగా తారుమారు అయ్యింది. ముఖ్యంగా పవరాస్ట్ర టాస్క్ సమయంలో ప్రశాంత్ ను రతిక అన్న మాటలతో ఆమె గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. అమ్మాయి ప్రవర్తన ఇలా ఉంటుందా ?.. అనే సందేహం కలిగించింది. దీంతో ఆమెకు ఓటింగ్ పూర్తిగా తగ్గిపోయి డేంజర్ లో ఉండిపోయింది. ఇక ఇప్పుడు రతిక రోస్ అఫీషియల్ ఇన్ స్టా ఖాతా స్టోరీలో చేసిన పోస్ట్ వైరలవుతుంది.

Rathika Rose

Rathika Rose

“రతిక ఎలిమినేట్ కానుందని అప్డేట్ వచ్చింది. కానీ ఆమె బిగ్‏బాస్ లో ఉండాల్సిన కంటెస్టెంట్. టాప్ 3లో అర్హత ఉన్న కంటెస్టెంట్. అమర్ దీప్ లాంటి నెగెటివ్ వ్యక్తుల వల్ల ఆమె తప్పుడుదారిలో నడిచింది. ప్లీజ్.. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. సీక్రెట్ రూంలోకి పంపించండి. తన వెనకాల ఏం జరుగుతుందో తనకు తెలియనివ్వండి. ఎవరు తన మంచి కోరుతున్నారు ఎవరు వాడుకుంటున్నారో తెలియజేయండి. ఆమె మంచి అమ్మాయి. అమర్ దీప్ లాంటి వాళ్లు నిన్ను వాడుకున్నారు” అంటూ ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చారు. అయితే ఈ స్క్రీన్ షాట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. దీంతో బిగ్‏బాస్ రూల్స్ కు విరుద్ధంగా ఎపిసోడ్ కు ముందే ఎలిమినేషన్ లీక్ ఇచ్చారేంటీ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అయితే వెంటనే రతిక ఇన్ స్టా ఖాతా నుంచి ఈ పోస్ట్ డెలీట్ చేశారు. కానీ అప్పటికే స్క్రీన్ షాట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే