Jabardasth Faima: పేదరికం నుంచి బిగ్‏బాస్ వేదిక వరకు ‘ఫైమా’ ప్రయాణం అసాధారణం.. ఆమె జీవితంలో ఎన్ని ఆటుపోట్లో తెలుసా ?..

సొంతిళ్లు లేక.. ఎన్నో అద్దెళ్లలో జీవించామని.. కొన్ని ఇంట్లో బాత్రూంలు కూడా లేక ఇబ్బందులు పడినట్లు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఫైమా తల్లి. తన కుటుంబం కోసం ఒక ఇళ్లు కట్టించాలని ఫైమా చెప్పుకొచ్చింది.

Jabardasth Faima: పేదరికం నుంచి బిగ్‏బాస్ వేదిక వరకు 'ఫైమా' ప్రయాణం అసాధారణం.. ఆమె జీవితంలో ఎన్ని ఆటుపోట్లో తెలుసా ?..
Faima
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 05, 2022 | 5:33 PM

జబర్ధస్త్ ఫైమా.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. తన కామెడీ టైమింగ్.. పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది (Jabardasth Faima). కేవలం ఫైమా కామెడీ కోసం జబర్ధస్ షో చూసేవారున్నారంటే ఆమె క్రేజ్ ఏ రెంజ్‏లో ఉందో చెప్పక్కర్లేదు. అతి తక్కువ సమయంలోనే బుల్లితెరపై తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఇప్పుడు టెలివిజన్ వేదికపై అతి పెద్ద రియాల్టీ షోలో కంటెస్టెంట్‏గా పాల్గొనే అవకాశం దక్కించుకుంది. అయితే నిరుపేద కుటుంబం నుంచి ఓ సామాన్య అమ్మాయి జబర్ధస్త్, బిగ్‏బాస్ షో వరకు రావడం వెనక అంతులేని కష్టాలు.. ఎన్నో అవమానాలు ఉన్నాయి. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుందని.. బిగ్‏బాస్ వేదికపై ఆమె ప్రోమో వేసి చూపించారు. సొంతిళ్లు లేక.. ఎన్నో అద్దెళ్లలో జీవించామని.. కొన్ని ఇంట్లో బాత్రూంలు కూడా లేక ఇబ్బందులు పడినట్లు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఫైమా తల్లి. తన కుటుంబం కోసం ఒక ఇళ్లు కట్టించాలని ఫైమా చెప్పుకొచ్చింది.

ఫైమా వాళ్లది ఓ నిరుపేద కుటుంబం. నలుగురు అమ్మాయిలు.. అందరికంటే చిన్నమ్మాయి ఫైమా. తండ్రి రోజూ కూలీ కాగా.. తల్లి ఇంట్లో ఉంటూ బీడీలు చేస్తుంటుంది. సొంతిళ్లు లేక దాదాపు 30 సంవత్సరాలుగా కిరాయి ఇంట్లోనే జీవించారు. అనేక అద్దె ఇళ్లు మారారట. కొన్ని కిరాయి ఇళ్లలో బాత్రుమ్స్ లేక ఇబ్బంది పడ్డారట. ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ ఫైమాను చదవిస్తూనే ఉన్నారు. ఒకసారి ఫైమా చదువుతున్న కాలేజీ వాళ్లంతా పటాస్ షోకు వచ్చారు. ఆ సమయంలో ఫైమా కామెడీ టైమింగ్ చూసి విజయ్ అనే వ్యక్తి కామెడీకి పనికొస్తుందని.. ఆమెతో చిన్న పార్ట్ చేయించాడు. దీంతో ఆ వీడియో రెండు రోజుల్లోనే మిలియన్ వ్యూస్ సంపాదించింది. ఫైమా కామెడీ అదిరిపోయిందంటూ నెటిజన్స్ నుంచి కామెంట్స్ రావడంతో షో నిర్వాకులు ఫైమాను సంప్రదించగా.. ఆ షోలోకి పంపేందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఆ సమయంలో యాంకర్ శ్రీముఖి, రవి, మిగత సభ్యులు వారికి నచ్చజెప్పడంతో ఒప్పుకున్నారట. పటాస్ షోలో తన కామెడీతో దూసుకుపోతున్న సమయంలో అనుకోకుండా ఆ షోను ఆపేశారు. దీంతో ఫైమా మళ్లీ ఇంటికే పరిమితం అయ్యింది. అలాంటి సమయంలోనే ఆమెకు జబర్ధస్త్ షో ఆఫర్ వచ్చింది. ఈ షోలోకి అడుగుపెట్టిన తర్వాత ఫైమా మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. తన కామెడీ టైమింగ్.. పంచులతో ప్రేక్షకులను నవ్వించింది. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకుంది. భాస్కర్, ఇమాన్యుయేల్, వర్ష, ఫైమా మధ్య వచ్చే కామెడీ స్కిట్స్ ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికీ ఫైమా చేసే స్క్రిట్స్ అన్ని యూట్యూబ్‏లో మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!