AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cobra Movie: సినిమా సూపర్ హిట్.. కానీ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన డైరెక్టర్.. ఎందుకంటే..

తాజాగా కోబ్రా పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై స్పందిస్తూ.. ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు. తాజాగా సినిమా గురించి ఇన్ స్టాలో ఫాలోవర్లతో ముచ్చటించారు.

Cobra Movie: సినిమా సూపర్ హిట్.. కానీ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన డైరెక్టర్.. ఎందుకంటే..
Cobra
Follow us
Rajitha Chanti

| Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 05, 2022 | 3:10 PM

తమిళ్ స్టార్ హీరో విక్రమ్ చియాన్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం కోబ్రా. డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 31న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో విక్రమ్ సరసన కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించింది. అయితే ఓవైపు సినిమా సూపర్ హిట్ టాక్‏తో దూసుకుపోతున్నప్పటికీ కొన్ని నెగిటివ్ కామెంట్స్ సైతం వస్తున్నాయి. సినిమా నిడివి ఎక్కువగా ఉందని.. క్లైమాక్స్ బాలేదంటూ నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే ఇప్పటికే సినిమా నిడివి 20 నిమిషాలు తగ్గించింది చిత్రయూనిట్. తాజాగా కోబ్రా పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై స్పందిస్తూ.. ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు. తాజాగా సినిమా గురించి ఇన్ స్టాలో ఫాలోవర్లతో ముచ్చటించారు.

కథ, కథనం బాగున్నప్పటికీ క్లైమాక్స్ నిరాశాజనకంగా ఉంది అని ఓ నెటిజన్ అనగా.. పోలీసుల నుంచి హీరో తప్పించుకుని విదేశాల్లో స్వేచ్చగా బతుకుతున్నట్లు క్లైమాక్స్ రాయొచ్చు. కానీ అలాంటి నేరస్థుడికి ఎలాంటి శిక్ష పడకపోవడం న్యాయం కాదు కదా ? అని అజయ్ సమాధానమిచ్చారు. అలాగే స్క్రీన్ ప్లే గందరగోళంగా ఉందంటూ మరో నెటిజన్ కామెంట్ చేయగా.. మిమ్మల్ని గందరగోళానికి గురి చేసినందుకు సారీ. ప్రతిక్షణం ఉత్కంఠకు గురిచేసే సినిమా చూసేందుకు ఓ ప్రేక్షకుడిగా నేను ఇష్టపడతాను. అందుకే కోబ్రాను తెరకెక్కించాను. సాధ్యమైతే మరోసారి మా సినిమాను చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది. అంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్. కోబ్రా సినిమా అంత నిడివి ఎందుకు ఉంది ? అని మరో నెటిజన్ అడగ్గా.. సినిమాలోని ప్రతి కీలక విషయాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించాలనుకుంటున్నాం. అందుకే మొదటి రోజు మూడు గంటల నిడివితో సినిమాను విడుదల చేశారం. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన వల్ల నిడివి తగ్గించాము. నిడివిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని అర్థమైంది. తదుపరి సినిమాలకు ఈ తప్పు జరగకుండా చూసుకుంటాము అంటూ చెప్పుకొచ్చారు.