AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 6- Smitha: బిగ్‏బాస్ షోపై సింగర్ స్మిత సెన్సెషనల్ కామెంట్స్.. ఎవరైనా వెళ్తే ఆ మాట అడిగేస్తుందట..

గతంలో చాలా మంది తారలు బిగ్‏బాస్ షో తమకు నచ్చదని.. ఆఫర్ వచ్చినా వెళ్ళమని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా పాప్ సింగర్ స్మిత

Bigg Boss 6- Smitha: బిగ్‏బాస్ షోపై సింగర్ స్మిత సెన్సెషనల్ కామెంట్స్.. ఎవరైనా వెళ్తే ఆ మాట అడిగేస్తుందట..
Smita
Rajitha Chanti
|

Updated on: Sep 05, 2022 | 7:18 PM

Share

బిగ్‏బాస్ (Bigg Boss 6) రియాల్టీకి షోకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అన్ని భాషల్లోనూ దూసుకుపోతున్న ఈ షో.. ఇక ఇప్పుడు తెలుగులో 5 సీజన్లు పూర్తిచేసుకుని 6వ సీజన్ ప్రారంభమైంది. సెప్టెంబర్ 4న మొత్తం 21 మంది కంటెస్టెంట్లతో ఎంత గ్రాండ్ గా ప్రారంభమైంది. ఇక ఎప్పటిలాగే ఈ సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోకు జనాల్లో ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ మరోవైపు నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి. ఇక సెలబ్రెటీలు ఈషోలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తే మరికొందరు మాత్రం అసలు బిగ్‏బాస్ షోనే నచ్చదు అంటున్నారు. గతంలో చాలా మంది తారలు బిగ్‏బాస్ షో తమకు నచ్చదని.. ఆఫర్ వచ్చినా వెళ్ళమని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా పాప్ సింగర్ స్మిత సైతం బిగ్‏బాస్ షోపై సెన్సెషనల్ కామెంట్స్ చేశారు. ఈ కార్యక్రమం తనకు అస్సలు నచ్చదని అన్నారు.

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మిత మాట్లాడుతూ.. బిగ్‏బాస్ నాకు అస్సలు నచ్చని షో. ఒకవేళ నాకు ఆ షోలోకి వెళ్లే అవకాశం వస్తే పొరపాటున కూడా వెళ్లి తప్పు చేయను. అన్ని రోజులపాటు కుటుంబాన్ని వదిలి ఉండాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిన వాళ్లు ఎవరైనా అక్కడి వెళ్తున్నారని తెలిస్తే ఏం వచ్చింది మీకు ? అని అడిగేస్తా. కొందరిని ఒక చోట పెట్టి మీరు తన్నుకోండి మేము టీఆర్పీలు తెచ్చుకుంటాం అన్నట్టు ఉంటుంది అక్కడి పరిస్థితి. ఆ షోను చూడను. చూసిన అది నాకు అర్థం కాదు. నాకు ఇష్టమైన కొందరు ఆ షోకు వెళ్లారు. ఇప్పుడు ఏమైనా మాట్లాడితే వాళ్లను విమర్శించినట్లు అవుతుంది. అందుకే ఆ షో గురించి ఎక్కువగా మాట్లాడాలనుకోవడం లేదు అంటూ చెప్పుకొచ్చారు స్మిత. అలాగే డిసెంబర్ నెలలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని.. ఐదేళ్ల నుంచి ఆ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు.

Follow Us
రోగనిరోధకశక్తిని పెంచే పవర్‌ ఫుల్‌ టీ.. ఎలాంటి వైరస్ దరిచేరదు!
రోగనిరోధకశక్తిని పెంచే పవర్‌ ఫుల్‌ టీ.. ఎలాంటి వైరస్ దరిచేరదు!
అవునా.. నిజమా.. 30 రోజులు చాయ్ తాగకపోతే ఇన్ని జరుగుతాయా..
అవునా.. నిజమా.. 30 రోజులు చాయ్ తాగకపోతే ఇన్ని జరుగుతాయా..
అప్పుడు గుర్తించని వాళ్లు.. ఇప్పుడు గౌరవమిస్తున్నారు
అప్పుడు గుర్తించని వాళ్లు.. ఇప్పుడు గౌరవమిస్తున్నారు
ఎవడ్రా నువ్వు.. మా కపిల్ దేవ్ ఆల్ టైమ్ రికార్డునే బద్దలుకొట్టావ్‌
ఎవడ్రా నువ్వు.. మా కపిల్ దేవ్ ఆల్ టైమ్ రికార్డునే బద్దలుకొట్టావ్‌
వర్షంతో ఆగిన క్రికెట్ మ్యాచ్.. ఆ తర్వాతే మొదలైన అసలు హంగామా!
వర్షంతో ఆగిన క్రికెట్ మ్యాచ్.. ఆ తర్వాతే మొదలైన అసలు హంగామా!
కుక్కలు వాహనాల టైర్లపై మాత్రమే మూత్రం ఎందుకు పోస్తాయి?
కుక్కలు వాహనాల టైర్లపై మాత్రమే మూత్రం ఎందుకు పోస్తాయి?
ఆపరేషన్ లేకుండా కంటి సమస్యలకు చెక్ పెట్టి.. కళ్లజోడు అవసరమే రాదు
ఆపరేషన్ లేకుండా కంటి సమస్యలకు చెక్ పెట్టి.. కళ్లజోడు అవసరమే రాదు
హైదరాబాద్ శివార్లలో కల్తీ ఆహార తయారీ ముఠా గుట్టురట్టు.. లక్షల్లో
హైదరాబాద్ శివార్లలో కల్తీ ఆహార తయారీ ముఠా గుట్టురట్టు.. లక్షల్లో
అతి భారీ వర్షం.. అపార నష్టం! భారత యాపిల్ రైతుల కన్నీళ్లు
అతి భారీ వర్షం.. అపార నష్టం! భారత యాపిల్ రైతుల కన్నీళ్లు
భారత్‌ను అత్యధికంగా ఓడించిన జట్టు ఏదో తెలుసా?
భారత్‌ను అత్యధికంగా ఓడించిన జట్టు ఏదో తెలుసా?