Bigg Boss Season 6: వివాదాలు మొదలయ్యాయ్.. ఆర్మీలు షురూ అయ్యాయ్.. అప్పుడే అగ్గి రాజేస్తున్న బిగ్ బాస్ సీజన్ 6

బిగ్‏బాస్ టాస్క్ ఇచ్చినా కూడ బాత్రూంలో అలా వేరే వాళ్ల వెంట్రుకలు పడి ఉంటే నేను తీయను అనగా.. ఇనయ సుల్తానా.. గీతూ మధ్య మాటల యుద్ధం నడిచినట్లుగా తెలుస్తోంది.

Bigg Boss Season 6: వివాదాలు మొదలయ్యాయ్.. ఆర్మీలు షురూ అయ్యాయ్.. అప్పుడే అగ్గి రాజేస్తున్న బిగ్ బాస్ సీజన్ 6
Bigg Boss
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 05, 2022 | 4:40 PM

బుల్లితెరపై అశలైన ఎంటర్టైన్మెంట్ సందడి మొదలైంది. సెప్టెంబర్ 4న ఆదివారం బిగ్‏బాస్ షోలో మరింత గ్రాండ్‍గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత సీజన్లకు భిన్నంగా ఈసారి మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ ఇంట్లోకి అడుగుపెట్టారు. ఇక తాజాగా బిగ్‏బాస్ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడే వదిలిన ప్రోమోలో కంటెస్టెంట్స్ ఇప్పుడే రచ్చ స్టార్ట్స్ చేసినట్లుగా తెలుస్తోంది. బాత్రూంలో వెంట్రుకలు పడి ఉన్నాయంటూ గోల చేసింది గీతూ గలాటా. అదే విషయాన్ని ఇనయ సుల్తానా వద్దకు వచ్చి అడిగింది. బిగ్‏బాస్ టాస్క్ ఇచ్చినా కూడ బాత్రూంలో అలా వేరే వాళ్ల వెంట్రుకలు పడి ఉంటే నేను తీయను అనగా.. ఇనయ సుల్తానా.. గీతూ మధ్య మాటల యుద్ధం నడిచినట్లుగా తెలుస్తోంది.

ఇక అనంతరం ఇంట్లో మొదటి టాస్క్ సమయం వచ్చేసింది. ట్రాష్, క్లాస్ అంటూ ఓ టాస్క్ పెట్టారు బిగ్‏బాస్. ఇందులో భాగంగా బిగ్‏బాస్ రెండు తరగతలుగా విడిపోతుంది. అందులో ఒకటి క్లాస్. మరొకటి ట్రాష్. క్లాస్ కేటగిరీలో పడ్డ కంటెస్టెంట్స్ అంతా బిగ్‏బాస్ ఇంట్లోనే ఉంటూ సౌకర్యాలు అనుభవిస్తుంటారు.. ఇక ట్రాష్ కేటగిరీలోకి వచ్చినవారు గార్డెన్ ఏరియాలోనే ఉంటూ అక్కడే లిమిటెడ్ వస్తువులతో వంట చేసుకోవాలి. అయితే ట్రాష్ కేటగిరీలోకి వచ్చినవారంత నేరుగా నామినేట్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ట్రాష్ కేటగిరీలోకి గీతూ రాయల్, సింగర్ రేవంత్.. ఇనయ సూల్తానా రాగా.. బాలాదిత్య, ఆర్జే సూర్య, శ్రీహాన్ క్లాస్ కేటగిరీలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక మిగిలినవారు మాస్ లేబుల్ తో సెటిల్ అయ్యారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.