Samantha: మరోసారి భయపెట్టేందుకు సిద్ధమైన సమంత.. కానీ ఈసారి…

ఈ సిరీస్ కాకుండా మరో మూవీలో సమంత నటిస్తోంది. ఆయుష్మాన్ ఖురానా ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

Samantha: మరోసారి భయపెట్టేందుకు సిద్ధమైన సమంత.. కానీ ఈసారి...
Samantha
Follow us
Rajitha Chanti

| Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 05, 2022 | 3:32 PM

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది సమంత. ఎప్పుడూ ఫోటోషూట్స్..చిట్ చాట్స్ అంటూ సందడి చేసే సామ్ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ప్రస్తుతం యశోధ, ఖుషి చిత్రాల షూటింగ్స్‏లో పాల్గోంటూ తెగ బిజీ అయిపోయింది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, గ్లింప్స్ సినిమాలపై మరింత ఆసక్తిని పెంచాయి. ఇటు టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్‏లో సామ్ బిజీ కానుంది. ప్రస్తుతం ఆమె చేతిలో హిందీ ప్రాజెక్ట్స్ రెండు ఉన్నాయి. అందులో ఒకటి వెబ్ సిరీస్. వరుణ్ దావన్‏తో కలిసి నటిస్తోంది. ఈ సిరీస్ కోసం సామ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ కాకుండా మరో మూవీలో సమంత నటిస్తోంది. ఆయుష్మాన్ ఖురానా ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

రాజస్థాన్ బ్యాక్ డ్రాప్ లో జానపద కథతో రాబోతున్న ఈ సినిమాలో సామ్ ద్విపాత్రాభినయం చేయబోతుంది. ఇందులో ఒకటి రాజ్ పుత్ రాణిగా.. మరొకటి ఆత్మగా. అయితే ఆత్మగా నటించడం అనేది సమంతకు కొత్తేమి కాదు. గతంలోనూ రాజు గారి గది 2లో సామ్ ఆత్మగా నటించింది. కానీ ఈ సినిమా ఆశించినంత స్థాయిలో హిట్ కాలేదు. ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇప్పటికే సామ్ నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది.

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..