AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu: కింగ్ ఈజ్ బ్యాక్.. నాగార్జున ఫైర్.. ఒక్కొక్కరి బాక్స్ బద్దలవుతుంది..

బిగ్‏బాస్ సీజన్ 9 అప్పుడే మొదటి వారం కంప్లీట్ అయ్యింది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ షోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈసారి కామనర్స్, సెలబ్రెటీస్ మధ్య ఆట మొదలెట్టాడు బిగ్‏బాస్. దీంతో మొదటి రోజు నుంచే కామనర్స్ వర్సెస్ సెలబ్రెటీస్ మధ్య రోజుకో లొల్లి జరుగుతుంది. తాజాగా శనివారం ఎపిసోడ్ ప్రోమో రివీల్ చేశారు.

Bigg Boss 9 Telugu: కింగ్ ఈజ్ బ్యాక్.. నాగార్జున ఫైర్.. ఒక్కొక్కరి బాక్స్ బద్దలవుతుంది..
Bigg Boss 9 Telugu
Rajitha Chanti
|

Updated on: Sep 13, 2025 | 5:16 PM

Share

బిగ్‏బాస్ సీజన్ 9 ఈసారి సరికొత్తగా ప్లాన్ చేశారు. కామనర్స్ వర్సెస్ సెలబ్రెటీస్ అంటూ సీజన్ 9 మొదలుపెట్టాడు బిగ్‏బాస్. మొత్తం 15 మందితో స్టార్ట్ అయిన ఈ షో ఇప్పుడు మొదటి వారం కంప్లీట్ అయ్యింది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన బిగ్‏బాస్ సీజన్ 9.. రోజూ గొడవలు, నవ్వులు, ఎంటర్టైన్మెంట్ తో సాగుతుంది. ఇక మొదటి వారం ఇంటి సభ్యులు అందరికీ చుక్కలు చూపించింది సంజన. గుడ్డు కొట్టేసి హౌస్ మొత్తాన్ని పరిగెత్తించిన ఈ అమ్మడు ఇప్పుడు హౌస్ కెప్టెన్ అయ్యింది. దీంతో హౌస్మేట్స్ పరిస్థితి గురించి చెప్పక్కర్లేదు. కెప్టెన్ అయిన వెంటనే ఫ్లోరా షైనీకి ఆర్డర్స్ వేసింది. ఆ తర్వాత హౌస్ మొత్తాన్ని స్కిట్స్ చేయండి అంటూ చెప్పుకొచ్చింది. అయితే మొదటి వారంలోనే సంజన దెబ్బకు హౌస్ మొత్తం మెంటల్లీ డిస్ట్రబ్ అయ్యారంటూ శ్రష్టి వర్మ ఫ్రస్టేట్ అయిపోయింది.

ఇవి కూడా చదవండి : Tollywood: అప్పుడు క్యాటరింగ్ బాయ్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు.. క్రేజ్ చూస్తే..

ఇక జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేది హోస్ట్ నాగార్జున ఎంట్రీ కోసమే. శనివారం హోస్ట్ నాగార్జున రావడం.. కంటెస్టెంట్లకు గట్టిగా క్లాస్ తీసుకోవడం తెలిసిన సంగతే. అయితే ఈసారి నాగార్జున ఎలా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.. ? ఎవరెవరికి క్లాస్ తీసుకోనున్నారని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నాగ్ కు సంబంధించిన ప్రోమో రివీల్ చేశారు. ఎప్పటిలాగే ఎనర్జిటిక్ పాటతో ఎంట్రీ ఇచ్చారు నాగ్.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Actors: ఇద్దరు అన్నదమ్ములు తెలుగులో క్రేజీ హీరోస్.. ఒకరు పాన్ ఇండియా.. మరొకరు టాలీవుడ్..

చాలా రోజుల తర్వాత కొత్త వ్యక్తిని చూడడం రీఫ్రెషింగ్ గా ఉందని సంజన చెప్పడంతో.. హౌస్ లో కూడా రోజుకో కొత్త మనిషి కనిపిస్తున్నారంటూ సంజనకు ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారు నాగ్. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్, రాము రాథోడ్ ఆట తీరుపై ప్రశంసలు కురిపించారు. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలని.. ఒక్కొక్కరి బాక్స్ బద్దలవుతుందని అన్నారు. ఆ తర్వాత సంజన, ఫ్లోరా షైనీ మధ్యలో మొదలైన గొడవ గురించి హౌస్మేట్స్ తో చర్చించారు. ముఖ్యంగా కెప్టెన్ సంజన ఆట తీరు, ప్రవర్తన పై గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

బిగ్‏బాస్ ప్రోమో.. 

ఇవి కూడా చదవండి : Cinema : ఇదెందయ్య ఇది.. ఓటీటీలో దూసుకుపోతుంది.. అయినా థియేటర్లలో కలెక్షన్స్ ఆగడం లేదు..