AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu: తనూజ పై ఫోకస్.. టాస్కులు గోవిందా.. కళ్యాణ్‏కు ఇచ్చిపడేసిన సీరియల్ బ్యూటీ..

అగ్నిపరీక్షలో అదరగొట్టిన కామనర్స్.. హౌస్ లో మాత్రం తేలిపోతున్నారు. ఇప్పటికే ముగ్గురు కామనర్స్ ఎలిమినేట్ కాగా.. మరో నలుగురు హౌస్ లో కొనసాగుతున్నారు. ఇక విన్నర్ మెటీరియల్స్ గా వెళ్లిన ఇద్దరూ అబ్బాయిలు అమ్మాయిల చుట్టూ తిరుగుతూ గేమ్ గాలికి వదిలేశారు. నిన్నటి ఎపిసోడ్ లోనూ మళ్లీ సేమ్ సీన్ రిపీట్ చేశారు.

Bigg Boss 9 Telugu: తనూజ పై ఫోకస్.. టాస్కులు గోవిందా.. కళ్యాణ్‏కు ఇచ్చిపడేసిన సీరియల్ బ్యూటీ..
Bigg Boss 9 Telugu (4)
Rajitha Chanti
|

Updated on: Oct 09, 2025 | 9:10 AM

Share

ఈసారి హౌస్ లోకి మొత్తం ఆరుగురు కామనర్స్ అడుగుపెట్టగా.. ఆ తర్వాత దివ్య సైతం ఎంట్రీ ఇచ్చింది. అగ్నిపరీక్షలో తమ గేమ్, మాటలతో అదరగొట్టిన ఈ కామనర్స్.. హౌస్ లో మాత్రం పూర్తిగా నెగిటివిటీని మూటగట్టుకుంటున్నారు. ఇప్పటికే ముగ్గురు కామనర్స్, మర్యాద మనీష్, ప్రియ, హరిత హరీష్ ఎలిమినేట్ కాగా.. మరో నలుగురు మిగిలారు. టాస్కులలో రీతూతో కలిసి డిమాన్ పవన్ అదరగొడుతున్నాడు. ఇక తనూజ పై ఫోకస్ పెట్టిన సోల్జర్ కళ్యాణ్ మాత్రం తన ఆటతోపాటు తనూజ ఆటను సైతం దెబ్బకొట్టాడు. నిన్నటి ఎపిసోడ్‏లో మొత్తం రెండు టాస్కులు జరిగాయి. మొత్తం పది మందిని ఐదు జంటలుగా విడగొట్టి వివిధ రకాల ఛాలెంజెస్ ఇస్తున్నాడు బిగ్ బాస్. మరీ నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు. ఈ వారం ఆదివారం ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ఇమ్యూనిటీ గెలుచుకుని నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు ఇమ్మాన్యుయేల్. కెప్టెన్ కావడంతో రాము సైతం నామినేషన్లలో లేకపోవడంతో మిగతా హైస్మేట్స్ అందరూ డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలిపాడు బిగ్ బాస్. డేంజర్ నుంచి సేవ్ కావడానికి రకరకాల టాస్కులు పెట్టాడు. కానీ స్ట్రాటజీ పేరుతో ఫౌల్ గేమ్ ఆడి బిగ్ బాస్ కు కోపం తెప్పించారు. దీంతో టాస్కులు మార్చేశాడు. ముందుగా బొమ్మలు గీసే టాస్కు పెట్టగా.. అద్భుతమైన ఆట తీరుతో బిగ్ బాస్ ను మెప్పించారు.

బొమ్మలు గీసే టాస్కులో ముందుగా భరణి, దివ్య టీమ్ గెలిచింది. ఆ తర్వాత రౌండ్ లో ఫ్లోరా, సంజన గెలిచి సెకండ్ ప్లేస్ సాధించారు. ఆ తర్వాత శ్రీజ, సుమన్ శెట్టి.. తర్వాత రీతూ, డిమాన్ పవన్ గెలిచారు. ఇలా వరుసగా అన్ని టీమ్స్ గెలవగా.. చివరి వరకు ఒక్క గేమ్ గెలవకుండా ఒక్క పాయింట్ పొందకుండా ఉండిపోయింది తనూజ, కళ్యాణ్. అయితే గేమ్ ఒడిపోవడానికి ప్రతిసారి కళ్యాణ్ కారణం గమనార్హం. విన్ కాకపోవడంతో తనూజ హర్ట్ అయ్యింది. వెళ్లి సారీ చెప్పాడు కళ్యాణ్. నాకు ఇరిటేషన్ తెప్పిస్తున్నావ్ అంటూ చిరాకుపడింది తనూజ.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?

ఇక డెంజర్ డోన్ లో ఉన్నవాళ్లకు హోల్డ్ ఇట్ లాంగ్ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్కులో గెలవాలంటే.. ఇద్దరు పోటీదారులు తమకు ఇచ్చిన ప్లాట్ ఫామ్ కు రెండువైపులా నిలబడి ఆ ప్లాట్ ఫామ్ తాళ్లకు ఉన్న హ్యాండిల్స్ తో ప్లాట్ ఫామ్ ను గాల్లో ఉంచి పట్టుకోవాలి. ఏ జంట అయితే టాస్కు ముగిసేవరకు ప్లాట్ ఫామ్ నేలకు టచ్ కాకుండా గాల్లో ఉంచగల్గుతారో వారే విజేతలు. అత్యధిక పాయింట్స్ స్కోర్ చేసి లీడర్ బోర్డ్ లో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంటారు. ఈ టాస్కులో ముందుగా సుమన్, శ్రీజ ఔట్ అయ్యారు. ఆ తర్వాత భరణి దివ్య, సంజన ఫ్లోరా ఔట్ కాగ.. చివరకు కళ్యాణ్ తనూజ, రీతూ చౌదరి డిమాన్ లు మిగిలారు.అప్పుడే కళ్యాణ్ తనూజకు సలహా ఇచ్చాడు. పెయిన్ వస్తుంటే పొజిషన్ మార్చుకో అని చెప్పడంతో తనూజ వెనక్కు జరిగింది. దీంతో ప్లాట్ పై ఉన్న సంచి పడిపోయింది. దీంతో వీరి జోడి ఔట్ అయిపోయింది. దీంతో తనూజ హర్ట్ కాగా.. కళ్యాణ్ సర్దిచెప్పేందుకు ట్రై చేశాడు. కళ్యాణ్ ఫోకస్ చేయాల్సింది దానిపైన నా ముఖం మీద కాదు అంటూ గట్టిగానే ఇచ్చిపడేసింది తనూజ. చివర ఉన్న రెండు జంట్లలో ఒక్కో వరస్ట్ ప్లేయర్ ఎవరో చెప్పాలని బిగ్ బాస్ అడగ్గా.. కళ్యాణ్ పేరు చెప్పారు అందరూ ఆ త్రవాత శ్రీజ పేరు చెప్పారు.

ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి డబుల్‌ వడ్డీ వస్తుంది!
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి డబుల్‌ వడ్డీ వస్తుంది!
ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. ఈ కారుకు కనీస డౌన్ పేమెంట్ ఎంత?
ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. ఈ కారుకు కనీస డౌన్ పేమెంట్ ఎంత?
విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్
విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..