AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: ‘షూటింగ్‌లో ఆ స్టార్ హీరో నా చేతులు గట్టిగా పట్టుకుని’.. బిగ్‌బాస్ సంజన షాకింగ్ కామెంట్స్

బుజ్జిగాడుతో పాటు పలు తెలుగు సినిమాల్లో నటించిన కన్నడ హీరోయిన్ సంజనా గల్రానీ ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు హౌస్ లో ఉంది. ప్రారంభంలో కొంచెం ఆమెపై నెగెటివిటీ కనిపించినా ఇప్పుడు హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారిపోయింది. అయితే ఈ అమ్మడు..

Bigg Boss Telugu 9: 'షూటింగ్‌లో ఆ స్టార్ హీరో నా చేతులు గట్టిగా పట్టుకుని'.. బిగ్‌బాస్ సంజన షాకింగ్ కామెంట్స్
Bigg Boss Telugu 9 Sanjana
Basha Shek
|

Updated on: Oct 09, 2025 | 9:06 PM

Share

తెలుగు, తమిళ, కన్నడలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సంజనా గల్రానీ ఇప్పుడు బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ లో పార్టిసిపేట్ చేస్తోంది. తన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగానే దగ్గరైపోయింది. అయితే సంజనాకు సంబంధించి ఒక పాత ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతోంది. కెరీర్ ప్రారంభంలో ప్రొఫెషనల్ పరంగా ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు, వేధింపులను ఈ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది సంజనా. ముఖ్యంగా ఓ హీరో తనను మానసికంగా వేధించాడంటూ సంచలన విషయాన్ని బయట పెట్టిందీ అందాల తార. ‘కన్నడలో ఓ సినిమా షూటింగ్‌ నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఒక స్టార్ హీరో నన్నుబాగా టార్చర్‌ పెట్టాడు. ఆ మూవీ డైరెక్టర్‌తో అప్పటికే అతనికి గొడవలు జరుగుతున్నాయి. అదే సమయంలో షూటింగ్‌ జరగడం.. హీరో వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడు. వాస్తవానికి ఆ సీన్ లో హీరో నా చేతులు పట్టుకొని ముందుకు కదాలాలి. కానీ ఆయన కోపంతో వచ్చి నా చేతులను పట్టుకుని గట్టిగా నొక్కాడు. నొప్పిగా ఉందని చెబితే.. మ్యానేజ్‌ చేసుకో అని సీరియస్‌ లుక్‌తో చెప్పాడు. దీంతో నేను షూటింగ్‌కు బ్రేక్ చెప్పాను.’

‘నేనేమీ దెబ్బలు తినడానికి ఇక్కడకు రాలేదు..ఇదేం యాక్షన్‌ సీన్‌ కాదు.. నేను విలన్‌ కాదు..ఈ సీన్‌కి తగ్గట్టుగా నీ మైండ్‌సెట్‌ మార్చుకో.. ఆ తర్వాతే షూటింగ్ చేద్దాం’ అని ఆ హీరోకు చెప్పి అరగంట తర్వాత మళ్లీ ఆ సీన్‌ చేశాం. ఇలాంటి క్రాక్‌ ఉన్నవాళ్లు అప్పుడప్పుడు మననకు తగులుతుంటారు. వారిని పట్టించుకోకుండా..మన పని చేసుకొని పోవాలి’ అని సంజన చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ నెట్టింట బాగా వైరలవుతోంది. అయితే తనను వేధించిన హీరో పేరు చెప్పలేదు సంజన.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ హౌస్ లో సంజన..

తరుణ్ నటించిన సోగ్గాడు(2005) సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సంజన. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బుజ్జిగాడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పోలీస్ పోలీస్, సత్యమేవ జయతే, దుశ్శాసన, యమహో యమ, ముగ్గురు, లవ్ యూ బంగారం, అవును 2, సర్దార్ గబ్బర్ సింగ్ తదితర తెలుగు చిత్రల్లో నటించి మెప్పించింది. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నెల సరి సమయంలో మహిళలు అస్సలే వెళ్లకూడని ప్రదేశాలివే!
నెల సరి సమయంలో మహిళలు అస్సలే వెళ్లకూడని ప్రదేశాలివే!
గుడ్ న్యూస్.. ఉద్యోగులకు రూ.1.25 కోట్ల బీమా..
గుడ్ న్యూస్.. ఉద్యోగులకు రూ.1.25 కోట్ల బీమా..
మీ టీవీ సైజును బట్టి కరెంట్ బిల్లు.. నెలకు ఏ టీవీకి ఎంత..
మీ టీవీ సైజును బట్టి కరెంట్ బిల్లు.. నెలకు ఏ టీవీకి ఎంత..
సత్తా చాటిన శ్రీచరణి, రాధాయాదవ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
సత్తా చాటిన శ్రీచరణి, రాధాయాదవ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
ఇక దబ్బిడిదిబిడే..! చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై పోలీసుల సర్జికల్ స్
ఇక దబ్బిడిదిబిడే..! చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై పోలీసుల సర్జికల్ స్
మాస్క్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
మాస్క్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న..
తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న..
పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల కోసం పోటెత్తనున్న భక్తులు!
పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల కోసం పోటెత్తనున్న భక్తులు!
ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి..
ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి..
ముదిరిన వైరం.. టాస్ వేళ షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు!
ముదిరిన వైరం.. టాస్ వేళ షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు!