Bigg Boss 9 Telugu Promo : అతడికి అమ్మాయిల పిచ్చి.. రమ్యకు కౌంటరిచ్చిన నాగ్.. ఒక్కొక్కరిని ఉతికారేసాడుగా..
వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తర్వాత బిగ్‌బాస్ హౌస్ లో రచ్చ మొదలైన సంగతి తెలిసిందే. రావడంతోనే తమ నోటికి పని చెబుతూ గంతులేసిన వైల్డ్ కార్డులకు దిమ్మతిరిగే షాకిచ్చాడు నాగ్. ఒక్కోక్కరికి వీడియో చూపిస్తూ మరీ ఇచ్చిపడేశాడు. మరోవైపు కళ్యాణ్, తనూజ, డీమాన్, రీతూ మధ్య ఉన్న బాండింగ్ గురించి ఆరా తీశారు. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ లో హౌస్మేట్స్ తోపాటు ఇటు అడియన్స్ కు ఉన్న సందేహాలపై క్లారిటీ ఇచ్చినట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది.

బిగ్‌బాస్ సీజన్ 9.. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల నోటికి తాళం వేశాడు హోస్ట్ నాగార్జున. గత వారం రోజులుగా వైల్డ్ కార్డ్స్ గొడవలు.. అర్థం లేని మాటలతో విసుగెత్తిపోయిన ప్రేక్షకులకు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న తరుణం వచ్చేసింది. శనివారం నాటి ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున వైల్డ్ కార్డ్స్ పై ఎలా రియాక్ట్ అవుతారు.. అని వెయిట్ చేస్తున్న అడియన్స్ కు వరుస ప్రోమోలతో కిక్కిచ్చారు. ఫస్ట్ ప్రోమోలో దివ్వెల మాధురికి మాట తీరు సరిగ్గా ఉండాలని కౌంటరిచ్చారు నాగ్. ఇక ఇప్పుడు రెండో ప్రోమోలో పచ్చళ్ల పాప నోటి దురుసుకు అడ్డు కట్ట వేస్తూ ఆటిట్యూడ్ కు కౌంటరిచ్చారు. అలాగే తనూజ, కళ్యాణ్ గురించి మాధురి, రమ్య మాట్లాడిన మాటలు.. రీతూ, పవన్ మధ్య ఉన్న బాండింగ్ గురించి అసలు విషయం బయటపెట్టారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో మాత్రం ఒక్కొక్కరికి తనదైన స్టైల్లో ఇచ్చిపడేశారు నాగ్.
ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..
తాజాగా విడుదలైన ప్రోమోలో.. కళ్యాణ్, పచ్చళ్ల పాప రమ్యను కన్ఫెషన్ రూంలోకి పిలిచారు. కిరీటం పెట్టుకోగానే రాణి కాదు.. మనల్ని ఆ కిరీటంకు అర్హత ఉండేలా చేసేది మన మాట తీరు అంటూ కౌంటరిచ్చాడు. ఆ తర్వాత కళ్యాణ్ గురించి రమ్య, మాధురి మాట్లాడుకున్న వీడియోను చూపించారు. దీంతో ఒకరిని అమ్మాయిల పిచ్చి అనడానికి నువ్వేమి అతడిని జీవితాంతం చూడలేదని కౌంటరిచ్చాడు నాగ్. కళ్యాణ్ అమ్మాయిలతో ప్రవర్తించే తీరు సరిగా ఉందా ? లేదా ? అని ప్రేక్షకులను అడగ్గా సగం మంది అవునని.. మిగతా సగం మంది కాదని ఆన్సర్ ఇచ్చారు. ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి కళ్యాణ్ షాకయ్యాడు. దీంతో తన ప్రవర్తనతో జనాల్లో నెగిటివిటీ ఉందని కళ్యాణ్ కు అర్థమయ్యేలా చేశారు.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..
ఇక తర్వాత రీతూ, డీమాన్ పవన్ ఇద్దరిని కన్ఫేషన్ రూంలోకి పిలిచి.. ఇద్దరి మధ్య ఏముంది ? అని అడగ్గా.. తనతో కంఫర్ట్ జోన్, సర్ఫ్ యాక్సిల్ జోన్ అంటూ చెప్పుకొచ్చింది రీతూ. ఇక డీమాన్ మాత్రం తనకే క్లారిటీ లేదన్నట్లుగా ప్రవర్తిస్తూనే కంఫర్ట్ జోన్ అని అన్నాడు. దీంతో రమ్యతో రీతూ గురించి డీమాన్ మాట్లాడిన వీడియోను చూపించారు. నేనైతే క్లియర్ గా ఉన్నాను అంటూ రీతూ చెప్పగా.. పవన్ మాత్రం ఆన్సర్ ఇవ్వలేక కంఫర్ట్ జోన్ అన్నాడు. దీంతో వీళ్లిద్దరి బాండింగ్ గురించి ప్రేక్షకులను అడగ్గా.. ఇద్దరు నిజం చెప్పడం లేదని నూటికి నూరు శాతం ఓటింగ్ వేశారు. దీంతో నాగార్జున సైతం ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత మాధురి, రమ్య ఇద్దరూ తనూజ, కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలను తనూజకు చూపించారు నాగ్. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు.. అంటూ తనూజ గురించి మాధురి మాట్లాడిన మాటలు చూసి షాకయ్యింది తనూజ. ఇక చివరకు బ్రేక్ తర్వాత ఇమ్మాన్యుయేల్ కు పగిలిపోద్ది అంటూ హింట్ ఇచ్చారు నాగార్జున. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో ఒక్కొక్కరికి ఇచ్చిపడేశారు.
ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‌గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..




