Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ షాకింగ్ ఎలిమినేషన్.. ఫోక్ సింగర్ కాదు.. ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ బయటకు..
బిగ్‌బాస్ హౌస్ లో ఆరో వారం ఎలిమినేషన్ సమయం దగ్గరపడింది. ఐదు వారాల తర్వాత ఆట తీరులో మరింత మార్పులు వచ్చాయి. ముఖ్యంగా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీల తర్వాత తలలు పట్టుకుంటున్నారు అడియన్స్. ఆట కాకుండా కొట్లాటే ముఖ్యమన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ప్రతిదానికి గొడవ పెట్టుకుంటే స్క్రీన్ స్పేస్ దొరుకుందనట్లుగా బిహేవ్ చేస్తూ జనాలకు విసుగుపుట్టిస్తున్నారు.

బిగ్‌బాస్ సీజన్ 9.. ఆరో వారం ఎలిమినేషన్ సమయం దగ్గరపడింది. ఇక ఐదో వారంలో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీల తర్వాత హౌస్ లో ఊహించని పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఓల్డ్ కంటెస్టెంట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ అన్నట్లుగా టాస్కులు జరిగాయి. అలాగే గత సీజన్లకు భిన్నంగా ఈసారి హౌస్ లో ఇద్దరు కెప్టెన్స్ ఎన్నికయ్యారు. ఇక శనివారం ఎపిసోడ్ లో ఒక్కొక్కరికి ఇచ్చిపడేశారు హోస్ట్ నాగార్జున. వైల్డ్ కార్డ్స్ కు వీడియోస్ చూపించి మరీ ఊతికారేశారు. ఇక ఇప్పుడు బిగ్‌బాస్ ఆరో వారం ఎలిమినేషన్ పై ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ సీజన్ లో ప్రతి వారం ఊహించని ట్విస్టులు, ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా గత వారం శ్రీజ దమ్ము ఎలిమినేట్ బయటకు రావడం అందరినీ షాక్ కు గురి చేసింది. ఆమె ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అంటూ నెట్టింట కామెంట్స్ వర్షం కురిపించారు. ఇక ఇప్పుడు కూడా మరో షాకింగ్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తోంది.
ఆరో వారం నామినేషన్లలో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్న సంగతి తెలిసింది. వీరందరి మధ్య పోటా పోటీగా ఓటింగ్ జరుగుతుంది. గత వారం ఊహించని విధంగా శ్రీజ దమ్ము ఎలిమినేషన్ జరగ్గా.. ఇప్పుడు కూడా బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ వారం నామినేషన్లలో రాము రాథోడ్, డీమాన్ పవన్, తనూజ, భరణి, దివ్య నిఖిత, సుమన్ శెట్టి.. వీరు ఆరుగురు నామినేట్ కాగా.. ఇందులో మొదటి నుంచి అత్యధిక ఓటింగ్ తో తనూజ ముందు స్థానంలో దూసుకుపోయింది. ఆమె తర్వాత మిగిలిన ఐదుగురి మధ్య పోటా పోటీగా ఓటింగ్ సాగింది. దీంతో చివరి వరకు ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయంపై స్పష్టత రాలేదు.
ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..
సోషల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఆరో వారం ఫోక్ సింగర్ రాము రాథోడ్, దివ్య, భరణి డేంజర్ జోన్ లో ఉన్నట్లు ప్రచారం నడిచింది. అయితే తనూజ తర్వాత సెకండ్ సేఫ్ జోన్ లో డీమాన్ పవన్ ఉండగా.. తర్వాత సుమన్ శెట్టి ఉన్నారు. ఇక భరణి, దివ్య, రాము రాథోడ్ మధ్య గట్టి పోటీ నడిచింది. పలు సోషల్ మీడియా పోల్స్ ఈవారం రాము రాథోడ్ ఎలిమినేట్ అంటూ కన్ఫార్మ్ చేయగా.. మరికొన్ని దివ్య నిఖిత అంటూ ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు ఊహించని విధంగా ఆరో వారం భరణి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ముందు నుంచి ఈవారం ఫోక్ సింగర్ రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని ప్రచారం నడవగా.. ఇప్పుడు ఊహించని విధంగా భరణి ఎలిమినేట్ అయ్యాడని నెట్టింట టాక్.
ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‌గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..




